districts reorganization
-
దుబ్బాక మాయం!
సాక్షి, దుబ్బాక: జిల్లాల పునర్వ్యస్థీకరణ గెజిట్ నోటిఫికేషన్లో జిల్లాలోని దుబ్బాక మండలమే లేకపోవడం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని రేకెత్తించింది. దుబ్బాక మండలంలో దుబ్బాక మున్సిపల్‌తో పాటుగా మొత్తం 30 గ్రామ పంచాయతీలున్నాయి. దీంట్లో మండలంలోని 26 గ్రామాలు రికార్డుల్లో లేవన్న వార్తతో మా గ్రామం ఉందో లేదో అన్న ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఉన్నారు. ‘ఊళ్లకు ఊళ్లు మాయం’ అనే కథనంతో ‘సాక్షి’లో ప్రచురితమవడం దుబ్బాక మండలంలో తీవ్ర సంచలనంగా మారింది. రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం కూడా మాయమైందని ఉండటం, అందులో 26 గ్రామాలు గల్లంతు కావడంతో అసలు ఏమయిందో అర్థం గాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు. అసలు తమ గ్రామం రికార్డుల్లో ఉందో లేదో తెలుసుకునేందుకు మండలంలోని పలు గ్రామాల వారు రెవెన్యూ కార్యాలయానికి పోతే శని, ఆది వారాలు సెలవుదినాలు కావడంతో ఇంకా గందరగోళం నెలకొంది. అసలు రెవెన్యూ రికార్డుల్లో నుంచి మండలంలోని 26 గ్రామాలు ఎలా మాయం అవుతాయి, అధికారుల తప్పిదమా లేక ఎవరన్నా కావాలని చేశారా..? అన్న అనుమనాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. గజిట్లో లేకుంటే మరి పరిస్థితి ఏంటని జనాభా లెక్కల్లో తమ గ్రామాలు, తాము ఎలా గల్లంతయ్యామని కొత్త జనాభా లెక్కల్లో తాము తమ గ్రామాలు ఉంటాయా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. అసలు ఆ 26 గ్రామాలు ఏవీ? రెవెన్యూ రికార్డుల్లో మాయమైన దుబ్బాక మండలంలోని 26 గ్రామాలు ఏవో తెలియక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అయోమయం చెందుతున్నారు. మండలంలో 30 గ్రామాలుండగా రికార్డుల్లో మాత్రం దుబ్బాక మండలం పేరు గల్లంతు కావడం అందులో 26 గ్రామాలు కనిపించకుండా పోవడంతో తీవ్ర గందరగోళంగా తయారైంది. తమ గ్రామం రికార్డుల్లో ఉందా అని ఎక్కడ తెలుసుకోవాలో తెలియక పలు గ్రామాల నాయకులు అధికారులకు ఫోన్లు చేస్తున్నారు. శని, ఆదివారాలు వరుస సెలవు దినాలు కావడంతో గ్రామాల్లో ఇంకా అయోమయంగా తయారైంది. మాకేం తెలియదంటున్న రెవెన్యూ అధికారులు రెవెన్యూ రికార్డుల్లో దుబ్బాక మండలం మాయంపై రెవెన్యూ అధికారులు తమకేం తెలియదంటూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. అలా ఎలా జరుగుతుంది, తమ దృష్టికి ఏం రాలేదు అని అర్థం లేని మాటలు చెబుతున్నారు. దుబ్బాక మండలం రికార్డుల్లో అసలు ఉందా లేదా అన్న విషయాన్ని అధికారులు ఫోన్లో క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారులను అడుగుతామని సోమవారం ఆఫీసుకు వచ్చాక తెలుసుకుంటామంటూ విషయంపై క్లారిటీ లేకుండా మాట్లాడుతుండటం చూస్తుంటే ఈ విషయంపై వారికి సరైన అవగాహన లేదన్నట్లు స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులతో మాట్లాడుతా.. రికార్డుల్లో దుబ్బాక మండలం మాయం కావడంపై సంబంధిత రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడుతా. ఇలా జరగడానికి కారణం ఏంటి అనే విషయం పూర్తి స్థాయిలో తెలుసుకుంటా. రెవెన్యూ రికార్డుల్లో మండలంతో పాటు 26 గ్రామాలు లేవన్న విషయం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఖచ్చితంగా దీనిపై క్లారిటీ తీసుకుంటే గాని ఏం జరిగిందనేది తెలుస్తుంది. – సోలిపేట రామలింగారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే మా దృష్టికి రాలేదు రికార్డుల్లో దుబ్బాక మండలం మాయమైందన్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించి తెలుసుకుంటాం. ఇలా జరగడానికి వీలు లేదు. సోమవారం కార్యాలయానికి వచ్చాక క్లారిటీగా ఈ విషయంపై తెలుసుకుంటాం. – అన్వర్, తహసీల్దార్, దుబ్బాక -
శరవేగంగా ‘పోలీస్’ నిర్మాణాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనతో ఏర్పడ్డ నూతన జిల్లాల్లో పోలీస్ కార్యాలయాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కదాన్ని 50 వేల ఎస్ఎఫ్టీతో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం 11 జిల్లాల్లో మాత్రమే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్; కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్ జిల్లాలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మిగతా జిల్లాల్లో భూ కేటాయింపులపై సందిగ్ధత నెలకొంది. మొదటి దఫాలో డీపీఓలు... జిల్లా పోలీస్‌కు కీలకమైన డీపీఓ (డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్)ను మొదటి దఫాలో భాగంగా నిర్మిస్తున్నారు. డీపీఓల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు దాదాపు రూ.25 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నట్టు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ తెలిపింది. అదే విధంగా రెండో దఫాలో ఎస్పీ క్యాంపు ఆఫీస్‌తో పాటు పరేడ్ గ్రౌండ్, ఆర్మ్డ్ రిజర్వ్ భవనం, సిబ్బంది బ్యారక్‌లు నిర్మించాలని నిర్ణయించారు. వరంగల్ కమిషనరేట్ భవన నిర్మాణం సైతం శరవేగంగా కొనసాగుతుండగా, రామగుండం కమిషనరేట్ నిర్మాణానికి సంబంధించి భూ కేటాయింపులు ఇంకా పూర్తికాలేదు. మొత్తంగా మొదటి దఫాలో నిర్మితమవుతున్న డీపీఓల నిర్మాణాలకు రూ. 250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు తెలిసింది. ఫిబ్రవరి కల్లా పూర్తి: ఐజీ మల్లారెడ్డి ప్రస్తుతం 11 జిల్లాల్లో డీపీఓల నిర్మాణం జరుగుతోంది. ఇంకో మూడు జిల్లాల్లో భూ కేటాయింపులు తేలాల్చి ఉంది. అది కూడా త్వరలోనే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న డీపీఓల నిర్మాణం వచ్చే జనవరి చివరికల్లా పూర్తి చేసి, ఫిబ్రవరిలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ప్రయత్నిస్తున్నాం. -
31 జిల్లాలు ఖరారు!
-
31 జిల్లాలు ఖరారు!
తుది నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం - కొత్తగా 21 జిల్లాలు, 21 డివిజన్లు, 119 మండలాలు - రేపు కేబినెట్ భేటీలో చర్చించాక తుది నిర్ణయం - గద్వాల జిల్లాకు ‘జోగులాంబ గద్వాల’గా పేరు - ఖరారు చేసిన ముఖ్యమంత్రి.. దసరా రోజునే నోటిఫికేషన్ - కొత్త జిల్లాల ప్రారంభ బాధ్యతలూ అప్పగింత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్య వస్థీకరణ కొలిక్కి వచ్చింది. కొత్తగా 21 జిల్లాలు, 21 రెవెన్యూ డివిజన్లు, 119 మండలాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తుది నోటిఫికేషన్ రూపకల్పన కూడా దాదాపుగా పూర్తయింది. శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో చర్చింది తుది నోటిఫికేషన్ ప్రకటనపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్తగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సంబంధిత ఆవిష్కరణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భారీగా మార్పులు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలపై ఆగస్టు 22న ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలు, డిమాండ్లతో జాబితాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ముసాయిదాలో ప్రతిపాదించిన 17 జిల్లాలకు అదనంగా మరో నాలుగు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటు హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నప్పటికీ... అది నామమాత్రమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని మండలాలు అటు ఇటు మారినా జిల్లాల పునర్వ్యవస్థీకరణ స్వరూపంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదని చెబుతున్నాయి. దసరా రోజున కొత్త జిల్లాల ప్రారంభోత్సవాలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు సైతం ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి. ఇక ముసాయిదాతో పోలిస్తే మండలాలు, డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. ముసాయిదాలో కొత్తగా 46 మండలాలు, 15 డివిజన్ల ఏర్పాటును ప్రతిపాదించగా... కొత్త మండలాల సంఖ్య దాదాపు మూడింతలు పెరిగి 119కి, కొత్త డివిజన్లు 21కి పెరిగాయి. మరోవైపు కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు ఉద్యోగుల సర్దుబాటు అధికారులకు కత్తి మీద సాములా మారింది. దసరా రోజునే ఉదయం తుది నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం జరిగే కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయనున్న గద్వాల జిల్లాకు జోగులాంబ గద్వాల జిల్లాగా ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. 21 కొత్త డివిజన్ల జాబితా మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నిర్మల్ జిల్లా: భైంసా ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్ జగిత్యాల జిల్లా: మెట్పల్లి నాగర్‌కర్నూల్: కల్వకుర్తి, అచ్చంపేట వరంగల్ రూరల్ జిల్లా: వరంగల్ రూరల్ మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ జనగాం జిల్లా: స్టేషన్ ఘన్పూర్ సిద్దిపేట జిల్లా: గజ్వేల్ మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్, నారాయణఖేడ్ కామారెడ్డి జిల్లా: బాన్సువాడ, ఎల్లారెడ్డి సూర్యాపేట జిల్లా: కోదాడ యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ మేడ్చల్ జిల్లా: కీసర శంషాబాద్ జిల్లా: కందుకూర్ ప్రారంభ బాధ్యతలు ఎవరెవరికి? సీఎం కేసీఆర్: సిద్దిపేట, మెదక్ (ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొంటారు) మండలి చైర్మన్ స్వామిగౌడ్: వరంగల్ రూరల్ స్పీకర్ మధుసూదనాచారి: భూపాలపల్లి డిప్యూటీ సీఎం మహమూద్: జగిత్యాల డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి: జనగామ నారుుని నర్సింహారెడ్డి: యాదాద్రి ఈటల రాజేందర్: పెద్దపల్లి పోచారం శ్రీనివాసరెడ్డి: కామారెడ్డి టి.పద్మారావు: మంచిర్యాల పి.మహేందర్‌రెడ్డి: శంషాబాద్ కె.తారక రామారావు: సిరిసిల్ల జోగు రామన్న: ఆసిఫాబాద్ జి.జగదీశ్‌రెడ్డి: సూర్యాపేట తుమ్మల నాగేశ్వర్రావు: కొత్తగూడెం ఇంద్రకరణ్‌రెడ్డి: నిర్మల్ తలసాని శ్రీనివాస్‌యాదవ్: వనపర్తి సి.లక్ష్మారెడ్డి: నాగర్‌కర్నూల్ అజ్మీరా చందూలాల్: మహబూబాబాద్ జూపల్లి కృష్ణారావు: గద్వాల సీఎస్ రాజీవ్‌శర్మ: మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లాలు.. వాటి పరిధిలోని మండలాలు 1. ఆదిలాబాద్ జిల్లా (18 మండలాలు) ఆదిలాబాద్ అర్బన్ (కొత్త మండలం), ఆదిలాబాద్ రూర ల్, మావల (కొత్త), గుడిహత్నూర్, బజార్హత్నూర్, బేల, బోథ్, జైనథ్, తాంసి, భీంపూర్(కొత్త), తలమడుగు, నేరడిగొండ, ఇచ్చోడ, సిరికొండ (కొత్త), ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ (కొత్త), ఊట్నూర్ 2. మంచిర్యాల జిల్లా (18) చెన్నూర్, జైపూర్, భీమారం (కొత్త), కోటపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల, నస్పూర్(కొత్త), హాజీపూర్ (కొత్త), మందమర్రి, దండేపల్లి, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, తాండూరు, భీమిని, కన్నెపల్లి 3. నిర్మల్ జిల్లా (18) నిర్మల్ రూరల్, నిర్మల్ అర్బన్ (కొత్త), సోన్ (కొత్త), దిలావర్పూర్, నర్సాపూర్-జి (కొత్త), కడెంపెద్దూర్, దస్తూరాబాద్ (కొత్త), ఖానాపూర్, మామడ, లక్ష్మణచాంద, సారంగపూర్, కుభీర్, కుంటాల, భైంసా, ముథోల్, బాసర (కొత్త), లోకేశ్వరం, తానూర్. 4. ఆసిఫాబాద్ (కొమురంభీం జిల్లా)(15) కాగజ్‌నగర్, సిర్పూర్-టి, దహెగాం, కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి (కొత్త), పెంచికల్‌పేట(కొత్త), ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, తిర్యాణి 5. కరీంనగర్ జిల్లా(16) కరీంనగర్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, వడ్లూరు బేగంపేట (బెజ్జంకి), గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, వీణవంక, వి.సైదాపూర్, శంకరపట్నం, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట 6. జగిత్యాల జిల్లా (18) జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగపూర్, బీర్పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్ 7. పెద్దపల్లి జిల్లా (14) పెద్దపల్లి, ఓదెల, సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మా రం, రామగుండం, అంతర్గాం, పాలకుర్తి, శ్రీరాంపూర్, కమాన్‌పూర్, రత్నాపూర్, మంథని, ముత్తారం 8. సిరిసిల్ల (రాజన్న జిల్లా)(13) సిరిసిల్ల, సిరిసిల్ల రూరల్ (కొత్త), వేములవాడ, వేములవాడ రూరల్ (కొత్త), చందుర్తి, రుద్రంగి (కొత్త), కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, బోయినపల్లి, వీర్నపల్లి (కొత్త) 9. మహబూబ్‌నగర్ జిల్లా(21) మూసాపేట, భూత్పూరు, హాన్వాడ, కోయల్‌కొండ, మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ రూరల్, నవాబ్‌పేట, జడ్చర్ల, బాలానగర్, రాజాపూర్, గండేడ్, దేవరకద్ర, నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, దౌల్తాబాద్, కొస్గి, మద్దూర్, ఉట్కూరు, నర్వ 10. వనపర్తి జిల్లా(17) వనపర్తి, గోపాలపేట, పెద్దమందడి, ఘన్పూర్, కొత్తకోట, వీపనగండ్ల, పానగల్, పెబ్బేరు, చిన్న చింతకుంట, ఆత్మకూర్, అమరచింత, మదనపూర్, కోడేరు, అడ్డాకుల, అలంపూర్, ఉండవెల్లి, ఏదుల 11. నాగర్‌కర్నూల్(22) బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, తెల్కపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, గొల్లాపూర్, చిన్నంబావి, పెంటవెల్లి, కల్వకుర్తి, మిడ్జిల్, ఉరుకొండ, వెల్దండ, వంగూర్, చారుకొండ, అచ్చంపేట, అమ్రాబాద్, పదిర, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల, సిద్ధాపూర్ 12. గద్వాల (జోగులాంబ) జిల్లా(13) గద్వాల, ధరూర్, గట్టు, మల్దకల్, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, అయిజ, నందిన్నె (కొత్త), రాజోలి(కొత్త), కృష్ణ, మాగనూర్, మక్తల్ 13. వరంగల్ అర్బన్ జిల్లా (12) వరంగల్, ఖిలా వరంగల్ (కొత్త), హన్మకొండ, కాజీపేట (కొత్త), హసన్‌పర్తి, ఐనవోలు (కొత్త), ధర్మసాగర్, వేలేరు (కొత్త), భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, ఇల్లంతకుంట (కొత్త) 14. వరంగల్ రూరల్ (కాకతీయ) జిల్లా (14) వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, శాయంపేట, పరకాల, ఆత్మకూరు, గీసుకొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, ఖానాపూర్, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ 15. భూపాలపల్లి (జయశంకర్) జిల్లా (19) భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ, ఘణపురం, వెంకటాపురం, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం(కొత్త), మంగపేట, కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహదేవపూర్, వెంకటాపురం (ఖమ్మం), వాజేడు 16. మహబూబాబాద్ జిల్లా (16) మహబూబాబాద్, గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, కురవి, మరిపెడ, నర్సింహులపేట, కొత్తగూడ, తొర్రూరు, గార్ల, బయ్యారం, చిన్నగూడురు (కొత్త), దంతాలపల్లి (కొత్త), పెద్దవంగర(కొత్త), గంగారం (కొత్త) 17. జనగాం జిల్లా (13) జనగాం, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, దేవరుప్పుల, నర్మెట్ట, తరిగొప్పుల(కొత్త), రఘునాథ్‌పల్లి, గుండాల, స్టేషన్ ఘన్పూర్, చిల్పూరు(కొత్త), జఫర్‌గఢ్, పాలకుర్తి, కొడకండ్ల 18. సిద్దిపేట జిల్లా (22) సిద్దిపేట, సిద్దిపేట రూరల్, నంగునూర్, చిన్నకోడూరు, తొగుట, దౌలతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, హుస్నాబాద్, కోహెడ, శనిగరం, హుస్నాబాద్ రూరల్ (అంతక్కపేట), గజ్వేల్, జగదేవ్‌పూర్, కొండపాక, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి 19. మెదక్ జిల్లా (20) మెదక్, హవేలీ ఘన్పూర్, పాపన్నపేట, శంకరంపేట రూరల్, శంకరంపేట(ఏ), టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడు, రామాయంపేట, నిజాంపేట, ఎల్దుర్తి, చేగుంట, తూప్రాన్, మనోహరాబాద్, నార్సింగి, నర్సాపూర్, శివంపేట, కోడిపల్లి, కుల్చారం, చిల్పిచేడ్ 20. సంగారెడ్డి జిల్లా (26) సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపూర్, జిన్నారం, గుమ్మడిదల, పుల్కల్, ఆందోల్, వట్పల్లి, మునిపల్లి, హత్నూర, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాలకల్, ఝరాసంఘం, కోహిర్, రాయ్‌కోడ్, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, మనూర్, నాగిల్గిద్ద 21. నిజామాబాద్ జిల్లా (26) నిజామాబాద్, నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, రుద్రూరు (కొత్త), కోటగిరి, డిచ్పల్లి, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి, మెండోరా (కొత్త), ఇందల్వాయి (కొత్త), ఆలూరు(కొత్త), ముగ్పల్ (కొత్త), నిజామాబాద్ ఉత్తరం (కొత్త), నిజామాబాద్ రూరల్ (కొత్త) 22. కామారెడ్డి జిల్లా (19) కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, గాంధారి, నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, బాన్సువాడ, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూరు, బీర్కూరు, ఎల్లారెడ్డి, బిచ్కుంద, సదాశివనగర్, రామారెడ్డి (కొత్త), రాజంపేట(కొత్త) 23. నల్లగొండ జిల్లా(31) చండూరు, చిట్యాల, కనగల్, కట్టంగూరు, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, నార్కట్‌పల్లి, తిప్పర్తి, కేతేపల్లి, శాలిగౌరారం, గట్టుప్పల, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, అనుముల, నిడమనూరు, పెదవూర, త్రిపురారం, మాడ్గులపల్లి, తిరుమలగిరి సాగర్, చందంపేట, చింతపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి (డిండి), గుర్రంపోడు, కొండమల్లేపల్లి, మర్రిగూడ, నాంపల్లి, పెద్ద అడిశర్లపల్లి, నేరేడుగొమ్ము 24. సూర్యాపేట జిల్లా (23) ఆత్మకూరు (ఎస్), చివ్వెంల, జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), నూతనకల్, పెన్‌పహాడ్, సూర్యాపేట, తిరుమలగిరి, తుంగతుర్తి, గరిడేపల్లి, నేరేడుచర్ల, నాగారం, చిలుకూరు, హుజూర్నగర్, కోదాడ, మఠంపల్లి, మేళ్లచెరువు, మోతె, మునగాల, నడిగూడెం, అనంతగిరి. మద్దిరాల, పాలకీడు, చింతలపాలెంయ(మల్లారెడ్డిగూడెం) 25. యాదాద్రి జిల్లా (15) ఆలేరు, రాజాపేట, మోత్కూరు, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, బీబీనగర్, బొమ్మల రామారం, ఆత్మకూరు (ఎం), భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, వలిగొండ, చౌటుప్పల్, అడ్డగూడూరు, నారాయణపూర్ 26. ఖమ్మం జిల్లా (21) ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ, ఎర్రుపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, కొణిజర్ల, వైరా, ఏన్కూరు, కామేపల్లి, రఘునాథపాలెం (కొత్త), కారేపల్లి, సింగరేణి 27. కొత్తగూడెం (భద్రాద్రి) జిల్లా (24) చండ్రుగొండ, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం, కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక, సుజాతానగర్, చెంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, కరకుగూడెం, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడు 28. వికారాబాద్ జిల్లా (17) వికారాబాద్, మోమిన్‌పేట్, మర్పల్లి, పూడూరు, ధారూర్, బంట్వారం, కోట్‌పల్లి, నవాబ్‌పేట్, కుల్కచర్ల, దోమ, పరిగి, తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, బొంరాసిపేట్, కొడంగల్ 29. శంషాబాద్ (రంగారెడ్డి) జిల్లా (26) మొయినాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, కొందుర్గు, షాబాద్, చౌదరిగూడ, శేరిలింగంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, కొత్తూరు, షాద్‌నగర్, కేశంపేట్, గండిపేట్, కందుకూరు, మహేశ్వరం, ఆమన్‌గల్, కడ్తాల్, తలకొండపల్లి, సరూర్‌నగర్, బాలాపూర్, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల 30. మేడ్చల్ జిల్లా (14) మల్కాజిగిరి, మేడ్చల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, దుండిగల్, నిజాంపేట్, కూకట్పల్లి, అల్వాల్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, ఉప్పల్, జవహర్‌నగర్, మేడిపల్లి, కాప్రా 31. హైదరాబాద్ జిల్లా(16) అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్, బహదూర్‌పుర, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, నాంపల్లి, సైదాబాద్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి, మారేడుపల్లి -
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కేసీఆర్
- జిల్లాల పునర్విభజనలో సీఎం తీరును తప్పుపట్టిన కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన పేరుతో పూటకో పేరు వెల్లడిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆ ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. రాత్రికి ఏం ఆలోచన వస్తే పొద్దున ప్రకటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలనీ, వాస్తు, అదృష్టసంఖ్య ప్రకారం కాదని వీహెచ్ అన్నారు. ప్రతిపక్షాల నేతలు రాజకీయంగా ఎదగకుండా చే యాలనే దురుద్దేశంతో గజిబిజిగా చేస్తున్నారన్నారు. కేసీఆర్ పరిపాలన అచ్చం నిజాంను తలపిస్తోందన్నారు. బంగారు తెలంగాణను కాస్త అప్పుల తెలంగాణగా మార్చాడని, ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రైతు రుణమాఫి, డబుల్బెడ్రూం, ఫీజురీయింబర్స్‌మెంట్ తదితర సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందిపడుతున్నారని, వాటి నుంచి దృష్టి మళ్లించడానికే జిల్లాల కుంపటి పెట్టారని వీహెచ్ మండిపడ్డారు. -
కార్మికశాఖలో విభజన పూర్తి
- జిల్లా స్థాయిలో డీసీఎల్ పోస్టులు రద్దు - చిన్న జిల్లాలు కావడంతో ఏసీఎల్లకే పగ్గాలు - అన్ని జిల్లాలకు ఎంప్లాయిమెంట్ అధికారుల నియామకం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కార్మికశాఖలో విభజన పూర్తి చేశారు. జిల్లాస్థాయి అధికారుల ఎంపిక, క్యాడర్ల ఏర్పాట్లు తదితర ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఈ మేరకు ఏయే జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే దానిపై ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 3నుంచి నూతనంగా ఏర్పడబోయే జిల్లాలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు. అయితే పునర్విభజన నేపథ్యంలో జిల్లాలు చిన్నవి కావడంతో క్యాడర్ పోస్టుల హోదాను తగ్గించారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మినహా మిగతా జిల్లాలకు బాధ్యులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్) స్థాయి అధికారులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ హోదాను తగ్గించి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ నిర్ణయించింది. అం దుకు అనుగుణంగా నూతన జిల్లాలకు ఏసీఎల్ స్థాయి అధికారులకు ఎంపిక చేసిన జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే దసరా నాటికి నూతన జిల్లాల్లో కార్యాలయాలు ఎంపిక చేసుకోవడంతో పాటు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారుల విషయంలో కూడా కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతనంగా ఉద్యోగులెవరినీ చేర్చుకోకపోవడంతో ఉన్న వారితోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జూనియర్ అధికారులకు నూతన జిల్లా బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ స్పష్టం చేసింది. -
‘జిల్లాల పునర్విభజనలో పారదర్శకం’
హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం వ్యవహరించాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆదేశించారు. ఉద్యోగుల విభజనలో సైతం సమస్యలకు తావివ్వకూడదన్నారు. బుధవారం ఆయన మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా మహిళా, శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. 10 జిల్లాల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులను 27 జిల్లాలకు విభజించే ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. భవనాల కేటాయింపుపై ఆరా తీసిన మంత్రి భవనాల స్థితిగతులను పరిగణనలోకి తీసుకొని దసరా నాటికి అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలోని చిన్నారుల దత్తతకు సంబంధించి అపరిషృ్కత అంశాలపై కేంద్ర మంత్రి మేనకా గాంధీకి నివేదిక పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ట్యాంక్‌బండ్ వద్ద టీఎస్ వైఎస్ఆర్ సీపీ నిరసన
-
జనగామ జిల్లా లేనట్లే
ప్రతిపాదనల ప్రకారమే ముసాయిదా వేగంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ భవనాలు, మౌలిక వసతుల కల్పనపై యంత్రాంగం దృష్టి సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన ప్రక్రియపై స్పష్టత వచ్చింది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్విభజించాలని జిల్లా యంత్రాంగం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారమే జిల్లాల పునర్విభజన ముసాయిదా సిద్ధమవుతోందని విశ్వనీయ సమాచారం. వరంగల్, ప్రొఫెసర్ జయశంకర్(భూపాలపల్లి), మహబూబాబాద్ పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఉద్యోగులు, సిబ్బంది కేటాయింపులపై ప్రభుత్వానికి గతంలో ఇచ్చిన ప్రతిపాదనలను జిల్లా యంత్రాంగం మరోసారి పరిశీలిస్తోంది. కొత్త జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భవనాలు, ఇతర మౌలికవసతుల కల్పన ప్రక్రియ వేగవంతమైంది. జిల్లాల పునర్విభజనపై జూన్‌లో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. టీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 29న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పునర్విభజనపై ప్రతిపాదనలు చేశారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ జిల్లా నేతలకు పునర్విభజనకు సంబంధించిన మ్యాప్‌లను అందజేశారు. జనగామను జిల్లాగా చేసే ప్రతిపాదనలు గతంలో లేకపోవడంతో ముసాయిదాలోనూ ఇదేతీరుగా ఉండనుందని సమాచారం. ఈ నెల 22న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేయనుంది. అక్టోబరు 11 నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన కార్యక్రమాలు మొదలుకానున్నాయి. జిల్లా యంత్రాంగం, జిల్లా నేతలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. కరీంనగర్ జిల్లాలోని ఎల్కతుర్తి, కమలాపురం, భీమదేవరపల్లి, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు వరంగల్ జిల్లాలో కలవనున్నాయి. ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలో కలపాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇల్లందు మండలం విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. తుది ప్రతిపాదనలు ఖరారు కావాల్సి ఉంది. జనగామ, బచ్చన్నపేట, లింగాలఘణపురం, దేవరుప్పుల మండలాలను యాదాద్రి జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలను సిద్ధిపేటలో కలపడం ఖాయమైంది. మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్రావు, మహదేవపూర్ మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉండనున్నాయి. జిల్లాల పునర్విభజనపై ప్రస్తుత ప్రతిపాదనలు... వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మహాముత్తారం, మల్హర్రావు, కాటారం, మహదేవపూర్. మానుకోట జిల్లా : మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం, ఇల్లందు. -
మూడు ముక్కలు!
పునర్విభజనతో చీలిపోతున్న అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు జిల్లాల్లో జనగామ, పాలకుర్తి రెండు జిల్లాల్లో ములుగు, భూపాలపల్లి సమన్వయంపై ప్రజల్లో సందేహాలు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వరంగల్ జిల్లా మూడు జిల్లాలుగా ఏర్పడనుంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు మండలాలను కలిపి... వరంగల్, ప్రొఫెసర్ జయశంకర్ (భూపాలపల్లి), మానుకోట (మహబూబాబాద్) పేర్లతో కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. మన జిల్లాలోని కొన్ని మండలాలు ఇతర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో కలవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై తాజాగా రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం కొన్ని నియోజకవర్గాల పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఏకంగా మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. మరికొన్ని రెండు జిల్లాల్లో ఉండనున్నాయి. ఇలా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో ఉంటే... ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల పరంగా సమన్వయంలో ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులకు ఇది ఇబ్బందికరంగానే ఉండనుంది. ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జనగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు మండలాలు మూడు జిల్లాల్లో ఉండనున్నాయి. జనగామ, బచ్చన్నపేట మండలాలు యాదాద్రి జిల్లాలో... చేర్యాల, మద్దూరు మండలాలు సిద్ధిపేట జిల్లాలో... నర్మెట మండలం వరంగల్ జిల్లాలో ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. అయితే, జనగామ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉద్యమం సాగుతోంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిస్థితి ఇలాగే ఉంది. పాలకుర్తి, రాయపర్తి మండలాలు వరంగల్ జిల్లాలో... తొర్రూరు, కొడకండ్ల మండలాలు మానుకోట జిల్లాలో... దేవరుప్పుల మండలం యాదాద్రి జిల్లాలో కలవనున్నాయి. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం సైతం రెండు జిల్లాల్లో ఉండనుంది. ఈ నియోజకవర్గంలోని లింగాలఘణపురం మండలాన్ని యాదాద్రి జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, ధర్మసాగర్ మండలాలు వరంగల్ జిల్లాలోనే కొనసాగనున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా ఏర్పడే జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఉండడం లేదు. భూపాలపల్లి నియోజకవర్గంలోని శాయంపేట మండలం వరంగల్ జిల్లాలోనే కొనసాగనుంది. మిగిలిన భూపాలపల్లి, చిట్యాల, గణపురం, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలు భూపాలపల్లిలో ఉండనున్నాయి. ములుగు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. కొత్తగూడ మండలం మానుకోట జిల్లాలో కలపనున్నారు. ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉంటాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు వరంగల్‌లో ఉండనున్నాయి. ఇదే జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే... కమలాపూర్, హుజూరాబాద్, జమ్మికుంట మండలాలు వరంగల్ జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు ఉన్నాయి. మంథని నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉంటే... మహాముత్తారం, మల్హర్రావు, కాటారం, మహదేవపూర్ మండలాలు భూపాలపల్లి జిల్లాలో ఉండనున్నాయి. జిల్లాల వారీగా మండలాలు ఇలా... వరంగల్ జిల్లా : వరంగల్, హన్మకొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, హసన్‌పర్తి, సంగెం, గీసుగొండ, ఆత్మకూరు, పరకాల, దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ, ఖానాపురం, నల్లబెల్లి, శాయంపేట, ధర్మసాగర్, స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్, పాలకుర్తి, రాయపర్తి, రఘునాథపల్లి, నర్మెట, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపురం, హుజూరాబాద్, జమ్మికుంట. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా : భూపాలపల్లి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, రేగొండ, ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మహాముత్తారం, మల్హర్రావు, కాటారం, మహదేవపూర్. మానుకోట జిల్లా : మహబూబాబాద్, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, నర్సింహులపేట, మరిపెడ, కురవి, తొర్రూరు, కొడకండ్ల, కొత్తగూడ, గార్ల, బయ్యారం, ఇల్లందు. యాదాద్రి జిల్లా : జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పులు, లింగాలఘణపురం. సిద్దిపేట జిల్లా : చేర్యాల, మద్దూరు.