తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో వారం రోజులుగా ధర్నా చేస్తున్న కాంట్రాక్టు నర్సులతో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి శుక్రవారం చర్చలు జరిపారు.
హైదరాబాద్: తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో వారం రోజులుగా ధర్నా చేస్తున్న కాంట్రాక్టు నర్సులతో డెరైక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమణి శుక్రవారం చర్చలు జరిపారు. నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆమె చర్చించిన తర్వాత వారందరూ కలసి వైద్య ఆరోగ్య శాఖ ప్రన్సిపల్ సెక్రటరీని కలిసేందుకు వెళ్లారు. అంతకుముందు కొందరు కాంట్రాక్టు నర్సులు ఆస్పత్రి భవనం పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.