నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ : నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆస్పత్రి భవనంపైకి ఎక్కి ఆందోళన చేపట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని గత వారం రోజులుగా ఆస్పత్రి ఆవరణలో ధర్నాకు దిగారు. ఈ క్రమంలోనే గురువారం పోలీసులు వీరిని అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు.
కాగా, శుక్రవారం తమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆస్పత్రి భవనం రెండో అంతస్థు పైకి ఎక్కిన కొంతమంది నర్సులు దూకి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నర్సుల ఆందోళనతో గాంధీ ఆస్పత్రి ఆవరణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.