మట్టిలో కూరుకుపోయిన యాదరుషి విగ్రహం, పాతగుట్ట ఆలయం పక్కన చెత్తలో పడేసిన ఆలయద్వారాలు
సాక్షి, యాదగిరికొకండ (ఆలేరు) : శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి యాదగిరిగుట్టలో స్వయంభువుగా వెలువడానికి కారణభూతుడైన యాదరుషి విగ్రహానికి దిక్కులేకుండా పోతోంది. అదే విధంగా ద్వార పాలకుల విగ్రహాలు కనిపించకుండా పోయినా దేవస్థానం అధికారులకు పట్టింపులేకుండా పోతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదరుషి విగ్రహంతో పాటు రెండు ద్వారపాలకులు జయ, విజయ విగ్రహాలను హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఆరేళ్ల క్రితం తయారు చేయించి దేవస్థానానికి బహూకరించాడు. గతంలో విష్ణు పుష్కరిణికి సమీపాన ఒక షెడ్డు వేసి దానికింద ఈ యాదదరుషిని ప్రతిష్ట చేశారు.
నూతన ప్రదానాలయం నిర్మాణం పనులు ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు ద్వార పాలకులైన జయ విజయుల విగ్రహాలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అంతేకాదు పాత ఆలయానికి వెనుక వైపు ఉన్న రాజగోపురం ద్వారానికి ఉన్న తలుపులను కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో చెత్తపాలయ్యాయి. విగ్రహాలు, ద్వార తలుపులు చెత్తల పాలు చేయడంపై ఆలయ అదికారులు కనీసం నోరు మెదపడం లేదు. యాదాద్రిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ కృషిచేస్తుంటే అధికారులు ఆలయ ప్రతిష్ట దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment