అభివృద్ధికి సహకరించండి
‘కొండపోచమ్మ సాగర్’ నిర్వాసితులను కోరిన సీఎం
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజక వర్గంలోని మర్కూక్ –పాములపర్తి మధ్య నిర్మించతలపెట్టిన ‘కొండపోచమ్మ సాగర్’ రిజర్వాయర్ భూ సేకరణపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. శుక్రవారం కేసీఆర్ రంగంలోకి దిగి భూనిర్వాసితులతో సమావేశమయ్యారు. ముంపునకు గురవుతున్న తానేదార్‌పల్లి, బహిలింపూర్, మామిడ్యాల రైతులను మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కు పిలిపించుకుని, వారితో నాలుగైదు గంటలకుపైగా సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తాతముత్తాతల కాలం నుంచి తమ గ్రామాలతో అనుబంధం కలిగి ఉన్నామని, తమకు సముచిత న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని సీఎం కేసీఆర్‌పైనే నిర్ణయాన్ని వదిలేశారు. సీఎం కేసీఆర్ స్పందించి నిర్వాసితులకు సముచితమైన నష్టపరిహారం అందిస్తామ ని హామీ ఇచ్చినట్లు తెలిసింది. 3 గ్రామాల ప్రజలకు ములుగు మండలం వంటిమా మిడిలోని ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కింద ప్రత్యేక కాలనీలను నిర్మిస్తామని చెప్పినట్లు సమాచారం.