సాక్షి, హైదరాబాద్ : ముంబైలో జర్నలిస్టులకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంపై నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. జర్నలిస్ట్‌లకు కరోనా సోకడం దురదృష్టకరమని, విషయం తెలిసి ఎంతో కలత చెందానని అన్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ‘ముంబైలో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడం దురదృష్టకరం. కరోనాపై పోరాటంలో జర్నలిస్టు మిత్రులు ముందుండి పోరాడుతున్నారు. ప్రజల వద్దకు వార్తలను చేరవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అని ట్వీట్ చేశారు.
కాగా ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. సోమవారం బీఎంసీ (బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్ 16,17 తేదీల్లో రిపోర్టర్లు, కెమెరామన్‌లు కలుపుకుని మొత్తంగా 167 మంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో సుమారు 53 మందికి సోకినట్లు తేలింది. మరోవైపు తమిళనాడులోనూ ముగ్గురు విలేఖరులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.
News of journalists in Mumbai testing positive for coronavirus is disturbing & very unfortunate. Requesting our media friends who are at the forefront in the war against the pandemic, to take care of themselves and their families while bringing news to us#IndiaFightsCoronavirus
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 21, 2020
Comments
Please login to add a commentAdd a comment