సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే మూడు కొత్త కేసులు వెలుగుచూశాయి. వీరిలో ఇద్దరు వ్యక్తులు విదేశాల నుంచి వచ్చిన వారు కాగా,, మరొకరు కరీంనగర్‌కు చెందిన వ్యక్తిగా వైద్యులు గుర్తించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. కాగా వైరస్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో మఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా లాక్‌డౌన్ పాటించాలని కోరుతున్నారు. మరోవైపు రోడ్లపైకి వచ్చిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని హెచ్చరిస్తున్నారు. (లాక్‌డౌన్ : ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి)
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నివేదిక విడుదల
‘ప్రపంచ వ్యాప్తంగా డబ్య్లూహెచ్‌వో హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. పీవీటీ హాస్పిటల్స్‌లో ఎలెక్టీవ్ సర్జరీలను నిలిపివేసి.. కరోనా బాధితులకు వైద్య చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీచేశాం. శ్వాశ సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేయాలి. (కరోనా వ్యాప్తి : సుప్రీం కీలక ఆదేశాలు)
Comments
Please login to add a commentAdd a comment