
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. తెలుగు జర్నలిస్టులకు కరోనా వైరస్ టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం కింద కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75 వేల నగదును విడుదల చేసింది. అలాగే చికిత్స కోసం అవసరమైన ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని వెల్లడించింది. కాగా, ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టుల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
వారికి అవసరమైన సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు 4898 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో ముగ్గురు తెలుగు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ఇప్పటి కరోనా బారిన పడి 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment