మండలి ప్రచారానికి నేటితో తెర | Council today unveils campaign | Sakshi
Sakshi News home page

మండలి ప్రచారానికి నేటితో తెర

Published Fri, Mar 20 2015 1:59 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

మండలి ప్రచారానికి నేటితో తెర - Sakshi

మండలి ప్రచారానికి నేటితో తెర

  • 22న పోలింగ్
  • సాక్షి, హైదరాబాద్ : శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం తెరపడనుంది. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’, ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఈ నెల 22న పోలింగ్ జరగనుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వశక్తులు ఒడ్డారు.

    ‘వరంగల్-ఖ మ్మం-నల్లగొండ’ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తరఫున మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, నాగేశ్వర్‌రావు సభల్లో పాల్గొన్నారు. ‘హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్’లో దేవీప్రసాద్ గెలుపు కోసం మంత్రులు నర్సింహారెడ్డి, పద్మారావుగౌడ్, శ్రీనివాస్‌యాదవ్, రంగారెడ్డిలో మంత్రి మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మంత్రులు కృష్ణారావు, లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు.
     
    వామపక్షాల తీరు భిన్నం: ‘హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్’ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతు తెలిపిన సీపీఎం, సీపీఐ వంటి వామపక్ష పార్టీలు.. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’లో మాత్రం టీఆర్‌ఎస్ అభ్యర్థిపై పోటీ లో ఉన్న సూరం ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశాయి. రెండు నియోజకవర్గాల్లోనూ పోటీకి దూరంగా ఉన్న టీడీపీ.. తమ మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థులు రామచందర్‌రావు(హైదరాబాద్), ఇ.రామ్మోహన్‌రావు(వరంగల్)కు మద్దతుగా నిలిచింది.

    కాగా, మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులపక్షాన ఆ పార్టీ ముఖ్యనేతలు పెద్దగా ప్రచారం చేసినట్లు కనిపించలేదు. రెండు నియోజకవర్గాల్లో 54 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ‘వరంగల్’ నియోజకవర్గంలో 31 మంది, ‘హైదరాబాద్’లో 23 మంది బరిలో ఉన్నారు. ‘వరంగల్-ఖమ్మం-నల్లగొండ’ పరిధిలో 2,81,138 మంది పట్టభద్రులు, ‘హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్’ పరిధిలో 2,96,218 మంది పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement