ఆలయ కోనేరులో మునిగి దంపతులు మృతి | couple died in ananta padmanaba swami Koneru | Sakshi
Sakshi News home page

ఆలయ కోనేరులో మునిగి దంపతులు మృతి

Published Sat, Apr 25 2015 11:22 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

couple died in ananta padmanaba swami Koneru

వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా అనంతగిరి మండలకేంద్రంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ కోనేరులో మునిగి దంపతులు మృతిచెందారు. మండలంలోని గోధుమగూడకు చెందిన దంపతులు శనివారం ఉదయం తమ ఇద్దరు పిల్లలతో కలసి అనంతపద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లారు. పిల్లలిద్దరికీ ఆలయ కోనేరులో స్నానం చేయించారు. అనంతరం వారిద్దరూ కోనేరులోకి దిగారు. అయితే కాలుజారి నీటిలో పడి పోయిన భార్యను రక్షించే ప్రయత్నంలో భర్త కూడా జారిపడ్డాడు. పిల్లల ఏడుపుతో చుట్టుపక్కల వారు చూసే లోపల వారు కోనేరులో మునిగిపోయారు. కాగా, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement