మెదక్: మెదక్ జిల్లా సంగారెడ్డి రూరల్ మండలం ఇస్మాయిల్‌ఖాన్ పేట సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులు మృత్యువాతపడ్డారు. ఫసల్‌వాడీ గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగలత దంపతులు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆంజనేయులు అక్కడికక్కడే చనిపోగా నాగలత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు విడిచింది.