సాక్షి, హైదరాబాద్: సీపీఐ, సీపీఎంల మధ్య పొత్తు కొలిక్కి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసే ఖమ్మం, నల్లగొండ, సీపీఐ పోటీ చేసే భువనగిరి, మహబూబాబాద్‌లలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. తాము పోటీ చేసే సీట్లలో కంటే కూడా మిగతా స్థానాల్లో ఏ పార్టీకి మద్దతునివ్వాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యా యి. దీంతో పొత్తులపై ప్రతిష్టంభన ఏర్పడటంతో ఆ రెండు పార్టీలు కేంద్ర నాయకత్వాలకు నివేదించాయి. ఇరుపార్టీలు పోటీచేసే స్థానాల్లో పరస్పరం సహకరించుకోవాలని, మిగతా సీట్లలో ఎవరికి మద్దతునివ్వాలనే దానిపై ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలని జాతీయ నాయకత్వాలు సూచిం చాయి. ఈ మేరకు శనివారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జరిపిన ఫోన్ చర్చల్లో అంగీకారం కుదిరింది.
ఆదివారం ఇరు పార్టీలు మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. కొన్ని లోక్‌సభ సీట్లలో అంగీకారమైన అభ్యర్థులకు మద్దతు నిచ్చే విషయంలో చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. ఏ అభ్యర్థికి మద్దతునివ్వాలనే అంశంపై రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ సొంత నిర్ణయం తీసు కోవచ్చనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో వామపక్షాలు పోటీ చేస్తున్న స్థానాల్లో ఆయా పార్టీల ఓట్లు బదిలీ అయ్యేందుకు కృషి చేయాలని నిర్ణయించాయి. గతంలో బీఎల్‌ఎఫ్‌లో భాగంగా ఉన్న ఎంసీపీఐ(యూ), బీఎల్‌పీ, ఎంబీటీ చెరో స్థానంలో పోటీకి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పార్టీలు పోటీ చేసే సీట్లతోపాటు బీఎస్పీ 4, జనసేన 2 సీట్లలో పోటీ చేయనున్నందున, వాటికి మద్దతునిచ్చే విషయంపై ఆదివారం సీపీఐతో సీపీఎం చర్చించనున్నట్టు సమాచారం.
మానుకోట సీపీఐ అభ్యర్థి కల్లూరి!
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్‌సభ స్థానానికి కల్లూరి వెంకటేశ్వరరావును అభ్యర్థిగా సీపీఐ రాష్ట్ర కమిటీ ప్రతిపాదించింది. ఆయన పేరును ఆ పార్టీ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పరిశీలనకు పంపింది. వెంకటేశ్వరరావు పేరు ను పరిగణనలోకి తీసుకుని అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. భువనగిరి స్థానానికి గోదా శ్రీరాములు పేరును ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment