కాంగ్రెస్‌తో జతకట్టడం వల్లే సీపీఐకి నష్టం
కొత్తగూడెం, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో జతకట్టడం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ పరాజయం పాలైందని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీపీఐతో ఎన్నికల పొత్తుకోసం తాము ఆహ్వానించామని, అయితే ఆ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంతో తాము కలవలేదని చెప్పారు. ఇప్పటికైనా ఆ పార్టీ తన వైఖరి మార్చుకొని ప్రజాసమస్యలపై చేసే ఉద్యమాల్లో సీపీఎంతో కలసి రావాలని కోరారు. ఉద్యోగుల విభజన విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బయ్యారంలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలన్నారు.