
రుణమాఫీ రగడ!
రైతు రుణమాఫీపై రగడ మొదలైంది. లక్ష రూపాయల్లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న టీఆర్‌ఎస్... తాజాగా ఒక సంవత్సర పంట రుణాలకే మాఫీని పరిమితం చేసే ఆలోచన చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్‌ఎస్ అధికారంలోకొస్తే.. తాము తీసుకున్న పంట రుణాలన్నీ మాఫీ అవుతాయనే ఆశతో ఎదురుచూస్తోన్న రైతుల్లో ఆందోళన మొదలైంది.
సాక్షి, కరీంనగర్ : ఎన్నికల్లో ప్రధానహామీ అయిన రుణమాఫీపై గందరగోళం నెలకొంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పంట రుణాలన్నీ మాఫీ అవుతాయని ఆశిస్తున్న రైతుల ఆందోళన మొదలైంది. జిల్లాలోని 386 బ్యాంకు బ్రాంచీల నుంచి 4,77,663 మంది రైతులు రూ.లక్షలోపు పంట రుణాలు పొందారు. టీఆర్‌ఎస్ హామీ ప్రకారం రుణాలన్నీ మాఫీ చేస్తే రూ.1895 కోట్ల రుణాలు మాఫీ అవుతాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమైం ది. ఆరుగాలం కష్టించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోగా... రుణాలు మాఫీ అవుతాయనే సంతోషంలో రైతులు మునిగితేలారు. సీఎం కేసీఆర్ రుణమాఫీపై ఎప్పుడు ప్రకటన చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బు దవారం హైదరాబాద్‌లో బ్యాంకర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్.. గత ఆర్థికం సంవత్సరంలో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేయాలనే ప్రా థమిక నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.
పంట రుణా లు తీసుకున్న రైతుల వివరాలతో ఈ నెల 9న హాజరుకావాలని ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన పెరిగింది. మరోవైపు.. ఇప్పటికే రాజకీయ పార్టీల నుంచి కొత్త ప్రభుత్వంపై విమర్శలు మొదల య్యాయి. షరతులు, కాలపరిమితి లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తించేలా టీఆర్‌ఎస్ ప్రభుత్వం చ ర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం కరీంనగర్‌లో విలేకరుల స మావేశంలో డిమాండ్ చేశారు. కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ కిసాన్‌మోర్చా ప్రధాన కార్యదర్శి పి.సుగుణాకర్‌రావు. అఖిల భారత కిసాన్‌సభ జిల్లా అధ్యక్షుడు పి.కేదారి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి పైడిపల్లి రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండపల్లి రాజయ్య సైతం... ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులందరికీ రుణ మాఫీ వర్తింపజేయాలన్నారు. లేదంటే రైతులకు మద్దతుగా ఉద్యమించి... తగిన గుణపాఠం చెప్తామని వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు. హుస్నాబాద్‌లో బీజేపీ నాయకులు రాస్తారోకో చేశారు.
బంగారం రుణాల సంగతేంటో?
జిల్లాలో లక్షపైనే మంది రైతులు వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారు. కానీ, బంగారంపై తీసుకున్న డబ్బులకు రుణ మాఫీ వర్తించదంటూ టీఆర్‌ఎస్ తాజాగా ప్రకటి ంచడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బంగారంపై తీసుకున్న.. దీర్ఘకాలిక రుణాలకూ మాఫీ వర్తింపజేయాలంటూ కోరుతున్నారు. మరోపక్క.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.