రామాయంపేట: తండ్రి మృతితో అన్నీ తానై కూతురు దహాన సంస్కారాలు జరిపించింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామాయంపేట మండలంలోని సుతారిపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... మేడిపల్లి లింగం(50) సుతారిపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుర్లున్నారు. పెద్ద కూతురు వివాహాం చేసిన కొద్దికాలానికి లింగం అనారోగ్యానికి గురై బుధవారం మృతిచెందాడు. దీంతో అతని చిన్నకూతురు భూలక్ష్మి తండ్రికి తలకొరివి పెట్టి తన రుణం తీర్చుకుంది.