సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో సీటు లభించినా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేసి ఫీజు చెల్లి స్తేనే ఆ విద్యార్థికి సీటు కన్ఫార్మ్ చేసే విధానికి ఇక చెక్ పడనుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి తమ సీటు కన్ఫర్మ్ చేసుకునే విధానం రాబోతోం ది. ఈ మేరకు డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లిం చేలా చర్యలు చేపట్టేందుకు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2019–20 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల సన్నాహక సమావేశం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లో జరిగింది.
ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలను మరింత సులభతరం చేయాలని నిర్ణయిం చారు. ఈసారి ప్రవేశాల ప్రక్రియను పూర్తి పేపర్‌లెస్ గా నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. విద్యార్థు ల రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే వన్‌టైమ్ పాస్‌వర్డ్ నుంచి మొదలుకొని కాలేజీలో చేరే వరకు అంతా ఆన్‌లైన్‌లోనే సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ బోర్డు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ తదితర బోర్డుల నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లోనే సేకరించి వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
హెల్ప్‌లైన్ల ద్వారా సమస్యల పరిష్కారం..
విద్యార్థుల సమస్యలన్నింటినీ హెల్ప్‌లైన్ కేంద్రంలోనే పరిష్కరించేలా అధికారం కల్పిస్తామని లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు అందరికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు వారు వెబ్‌సైట్‌లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునేప్పుడే డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలు వివరాలు కూడా డౌన్‌లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇస్తామని, అందులో విద్యార్థులు ఎలా డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలో ఉంటుందని స్పష్టం చేశారు.
డిగ్రీ ఫీజు చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే
Published Thu, Feb 7 2019 1:05 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment