సాక్షి, హైదరాబాద్: పదోతరగతి నామినల్‌రోల్స్ (ఎన్‌ఆర్) సమర్పణ ఆన్‌లైన్ విధానంలోకి మార్చినప్పటికీ విద్యాశాఖాధికారులు మాన్యువల్ పద్ధతికే ప్రాధాన్యమివ్వడం ఉపాధ్యాయులకు చిక్కులు తెచ్చిపెడుతుంది. పదోతరగతి పరీక్ష ఫీజు గడువు ఈనెల 7తో ముగిసింది. విద్యార్థుల నుంచి స్వీకరించిన ఫీజులను ప్రధానోపాధ్యాయులు ఈనెల 11లోగా విద్యాశాఖకు సమరి్పంచాలి. అనంతరం పాఠశాల నుంచి ఫీజు చెల్లించిన వారి వివరాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పగించాలి.
కానీ ఆన్‌లైన్ పద్ధతితో పాటు మాన్యువల్‌గా ఎన్‌ఆర్‌లు సమరి్పంచాలని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఎన్‌ఆర్ నమూనాలు, చలానా కాగితాలను పాఠశాలలకు పోస్టులో పంపారు. వీటిలో విద్యార్థుల వివరాలను రాసి గడువులోగా ఇవ్వాలని విద్యాశాఖాధికారులు సూచించారు. ఆన్‌లైన్‌లో విద్యార్థుల వివరాలు నమోదు చేసిన తర్వాత మాన్యువల్‌గా ఎన్‌ఆర్ పత్రంలో తిరిగి విద్యార్థుల పేర్లను రాయాల్సిన అవసరం లేదని ఉపాధ్యాయులు వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment