ఆదర్శానికి అడ్డంకులు! | development of location panchayths | Sakshi
Sakshi News home page

ఆదర్శానికి అడ్డంకులు!

Published Fri, Aug 1 2014 1:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

development of location panchayths

- ‘మేజర్ పంచాయతీ’ నిర్ణయాలతో ఇరకాటం
- ఇష్టానుసారంగా రోడ్ల కుదింపు
- ఇళ్ల నిర్మాణాల అనుమతుల్లోనూ ఇదే దుస్థితి
- గజ్వేల్ నగర పంచాయతీ అభివృద్ధికి కొత్త సవాళ్లు

గజ్వేల్: మేజర్ పంచాయతీ ఉన్న సమయంలో చోటుచేసుకున్న అక్రమాలు.. ప్రస్తుత నగర పంచాయతీకి గుదిబండగా మారాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సదాశయానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా భవిష్యత్తు అవసరాలను పట్టించుకోకుండా తీర్మానాలు చేయడం.. రోడ్లను కుదించడం, నిబంధనలు లేకుండా సాగిన ఇళ్ల నిర్మాణాలు పట్టకపోవడం, అంతర్గత రోడ్లు సైతం కుంచించుకుపోతున్నా కన్నెత్తి చూడకపోవడం వంటి అంశాలు.. ప్రస్తుత నగర పంచాయతీకి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. కొత్త పాలకవర్గం చర్యలకు ఉపక్రమిస్తేనే దిద్దుబాటుకు అవకాశం కలగనుంది.

గజ్వేల్ పట్టణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భవిష్యత్తు అవసరాలకనుగుణంగా సౌకర్యాల కల్పనలో దశాబ్దాలుగా అధికార యుంత్రాంగం, ప్రజాప్రతినిధులు విఫలవువుతూ వచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నగర పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్‌తోపాటు ప్రజ్ఞాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి గ్రామాల ప్రగతికి సీఎం వద్దకు రూ.423 కోట్ల ప్రతిపాదనలు వెళ్లిన సంగతి తెల్సిందే. ఇలాంటి నగర పంచాయతీని అందమైన పట్టణంగా తీర్చిదిద్దే యత్నాల్లో భాగంగా.. మొదటగా రోడ్లను విస్తరించాలని కొత్త పాలకవర్గం భావిస్తోంది. కానీ ఈ వ్యవహారంపై తెరపైకి రాగానే కొత్త సవాళ్లు ముందుకువచ్చాయి.

గతంలో బైపాస్ రహదారులను కుదించడం కొత్తగా ఆవిర్భవించిన నగరపంచాయతీకి శాపంగా మారింది. ముఖ్యంగా గతంలో పంచాయతీ పాలకవర్గం తీసుకున్న తప్పుడు నిర్ణయాలు గుదిబండగా మారాయి. పట్టణంలోని జాలిగామ బైపాస్ రోడ్డు ఉదంతమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. గత పాలకవర్గం 80 ఫీట్ల రోడ్డును 60కి కుదించి నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై తీర్మానం చేయడం ద్వారా అక్రమానికి రాజముద్ర వేశారనే చెప్పాలి. దీని ద్వారా ఈ రహదారి పక్కన కిలోమీటర్ మేర నిర్మాణాలు జరిగాయి. సుమారుగా 20 గజాల అత్యంత విలువైన స్థలం కలిసొచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు భారీగా ముడుపులు అందాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
అంతర్గత రోడ్ల పరిస్థితి కూడా అంతే...

అంతర్గత రోడ్ల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా కొత్త కాలనీలు నిర్మాణం చేపడితే అంతర్గత రోడ్ల కోసం తప్పనిసరిగా 30నుంచి 33 ఫీట్ల స్థలం వదిలివేయూల్సి వుంది. గతంలో నిర్మాణమై వున్న కాలనీల్లో కనీసం 21 ఫీట్ల వెడల్పు ఉండాలి. పట్టణంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా వుంది. కొత్తగా నిర్మించిన కాలనీల్లోనూ, గతంలో నిర్మాణమైన కాలనీల్లోనూ ఎక్కడా కూడా టౌన్‌ప్లానింగ్ అవులుకాలేదు. ఫలితంగా ఎక్కడ చూసినా ఇరుకైన రోడ్లే దర్శనమిస్తున్నాయి. వురికొన్నిచోట్ల కాలనీలు ఎగుడుదిగుడుగా ఉండటం సవుస్యలను సృష్టిస్తోంది.మరోవైపు మేజర్ పంచాయతీ పాలకవర్గం తీరు వల్ల నిబంధనలతో ప్రమేయం లేకుండా నిర్మాణాలు సాగుతూ వస్తున్నాయి. అదే పరంపర నేడు నగర పంచాయతీలోనూ కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement