
రెండుచోట్లా ఒకే ఆయుధాలు వాడారు: డీజీపీ
నల్లగొండ: సూర్యాపేటలో పోలీసులపై కాల్పులకు పాల్పడిన దుండగులే ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతి చెందినవారు ఉత్తరప్రదేశ్కు చెందినవారిగా గుర్తించినట్లు డీజీపీ మీడియాకు తెలిపారు. దుండగులు రెండుచోట్ల ఒకే ఆయుధాలను ఉపయోగించినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆయన అన్నారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.