సాక్షి, హైదరాబాద్ : మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ రక్షక్’ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరాల్లో మహిళల భద్రత కోసం సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సైబర్ క్రైమ్‌ని అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇవ్వడం కోసం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామ’ని తెలిపారు.
ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. ‘మహిళా రక్షణ కోసం 2014లో షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘సైబర్ రక్షక్’.. సైబర్ మోసాల బారిన పడకుండా తోడ్పడతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు, పాఠశాలల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ రక్షక్ బృందాలుగా నియమిస్తాం. తెలంగాణను సైబర్ క్రైం ఫ్రీ స్టేట్‌గా చేయడమే మా టార్గెట్’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment