వైరా: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బల్లి పడిన ఆహారం తిని ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన వైరా మండలం పాటడుగు గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన జానకి రామయ్య కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనుమానం వచ్చిన వారు వంట గిన్నెలు తీసి చూడగా.. సాంబారులో బల్లి పడి ఉంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. జానకి రామయ్య భార్య భారతమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా..జానకి రామయ్యతో పాటు కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.