సాక్షి, హైదరాబాద్: వైద్యులు కానివారు వైద్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. వారి పై వెంటనే కేసులు నమోదు చేస్తారు. అదే వైద్య వృత్తితో సంబంధమున్న పోస్టుల్లో ఇత రులను నియమిస్తే ఎలా ఉంటుంది. పరి స్థితి ఆందోళనకరంగా మారుతుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోనూ ఇదే జరుగుతోంది. ఆ శాఖలోని కీలక పోస్టుల్లో వైద్యులు కానివారిని నియమిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ లక్ష్యాలు పట్టించుకోకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కింది స్థాయి అధికారులు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
- గర్భంలోనే ఆడ శిశువులను చంపేస్తున్న దారుణాలను నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్రాలను ఆదేశిస్తోంది. లింగనిర్ధాణ నియంత్రణ విభాగం(పీసీపీఎన్‌డీటీ) ఆరోగ్య, కుటుంబ సం క్షేమ శాఖ పరిధిలో ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చూసేందుకు పీసీపీ ఎన్‌డీటీ ఆస్పత్రులు తనిఖీ చేయాల్సి ఉంది. సరోగసి వ్యవహారం ఈ విభాగం పరిధిలోనే ఉంది. ఇంత కీలకమైన విభాగం ఉన్నతాధికారిగా జాయింట్ డైరెక్టర్ ఉంటారు. స్వతహాగా వైద్యులే ఈ పోస్టులో పని చేయాల్సి ఉంటుంది. పీసీపీఎన్‌డీటీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న మహిళా అధికారి సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. ఈ పోస్టులో వైద్య అధికారులను కాకుండా సహకార శాఖకు చెందిన ఒక అధికారిని ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. దీనిపై వైద్యవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
- ల్యాబ్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, ఆపరేషన్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారిని నియమిస్తారు. పారామెడికల్ బోర్డు ఇలాంటి 24 కోర్సులను నిర్వహిస్తుంది. అన్ని కోర్సుల్లో కలిపి ప్రతి ఏటా సగటున 10 వేల మంది శిక్షణ పూర్తి చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పారామెడికల్ బోర్డులో పేర్లను నమోదు చేసుకుంటారు. అనంతరం వీరికి కొత్త విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై పారామెడికల్ బోర్డు అవగాహన కల్పిస్తుంది. ఈ బోర్డు పరిధిలో ల్యాబ్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, ఆపరేషన్ అసిస్టెంట్లు ఉంటారు. కోర్సు లు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పారామెడికల్ బోర్డులో పేర్లను నమోదు చేసుకుంటారు. అనంతరం వీరికి కొత్త విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పారామెడికల్ బోర్డు కార్యదర్శిగా వైద్య వృత్తి, బోధన అంశాలపై సంబంధంలేని వ్యక్తిని ఉన్నతాధికారులు నియమించారు. బోర్డు పరిధిలో కోర్సులు, పరీక్షల నిర్వహణ గతంలో కంటే గాడితప్పాయని వైద్య వర్గాలో వాపోతున్నాయి.
వైద్యశాఖ పోస్టుల్లో ‘ఇతరుల’ తిష్ట
Published Tue, Dec 12 2017 2:54 AM | Last Updated on Tue, Dec 12 2017 2:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment