Health Schemes
-
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వాళ్లవి పార్టిషన్ పాలిటిక్స్
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని తాము న్యూట్రిషన్ అందిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పార్టిషన్ పాలిటిక్స్ (విభజన రాజకీయాలు) చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ హిట్ అయితే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి,, అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలా సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన మరో పథకమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం’’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతోపాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గర్భిణులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను బాగా తగ్గించగలిగామని, మరింత ప్రయోజనం కలిగించేలా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. రెండు సార్లు కిట్.. ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐర¯న్ సిరప్లు, అర కిలో నెయ్యి, అల్బెండోజల్ మాత్రలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.2 వేల విలువైన కిట్‌ను రెండు సార్లు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులకు అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలో వచ్చే ఏడాది కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభిస్తామని ప్రకటించారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జెడ్పీ చైర్పర్సన్ డి.శోభ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ఎనిమిది జిల్లాల్లో ప్రారంభం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కామారెడ్డిలో నేరుగా, మిగతా ఎనిమిది జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు. వికారాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు లో మంత్రి సత్యవతి రాథోడ్, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్‌లో విప్ బాల్క సుమన్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతుండగా హరీశ్‌రావు కల్పించుకుని.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మెచ్చుకున్నారా, లేదా అని అడిగారు. మెచ్చు కున్నారంటూ ఎర్రబెల్లి సమాధానమివ్వగా.. శ్రీధర్‌బాబు మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండు పథకాలను కలిపి అమలు చేసే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ గురువారం నిర్వహించిన సమావేశానికి ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ యోగితారాణా, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..తాను ఇటీవల సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు ఆయుష్మాన్ భారత్ అమలుపై చర్చించేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను పంపిస్తానని, వారితో చర్చించాలని సీఎం చెప్పారన్నారు. వివిధ రాష్ట్రాలు అక్కడున్న ఆరోగ్య పథకాలతో కలిపి కొన్ని మార్పులతో అమలు చేస్తున్నాయని ఆయుష్మాన్ భారత్‌ను గవర్నర్ తెలిపారు. పట్టింపులకు పోకుండా ప్రజలందరికీ ఆరోగ్య సేవలు ఎలా అందించాలో ఆలోచించాలన్నారు. కేసీఆర్ కిట్, కంటివెలుగు తదితర పథకాల అమలుతీరును గవర్నర్ ప్రశంసించారు. ఈ సమావేశానికి హాజరైన నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్హెచ్ఏ) డిప్యూటీ సీఈవో డాక్టర్ ప్రవీణ్ గోయి మాట్లాడుతూ.. హైదరాబాద్ హెల్త్ హబ్ గా రూపుదిద్దుకున్నందున మహారాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులు చికిత్స కోసం వస్తుంటారన్నారు. లాభదాయక పదవుల జాబితాపై గెజిట్ ఇదిలా ఉండగా..లాభదాయకపదవుల జాబితా నుంచి 29 రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను, కార్పొరేషన్ చైర్మన్ పదవులను తొలగిస్తూ తెలంగాణ జీతాలు, పింఛన్ చెల్లింపు, నిరర్హతల తొలగింపు చట్టం 1953 నిబంధనలను సవరిస్తూ గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో గవర్నర్ తమిళి సై -
భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: పేదరోగులకు ఓ శుభవార్త. అవయవమార్పిడి చికిత్సను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కిడ్నీ, లివర్, తలసేమియా చికిత్సలతోపాటు అవయవమార్పిడి సేవలకు ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కల్పించనున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వాసుపత్రులను మెరుగుపరిచే చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తొలిసారి ప్రభుత్వాసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. పేదలకు ఆ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. పద్దులపై చర్చలో భాగంగా గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై ఆయ న సమాధానమిచ్చారు. ఒక్కో మెడికల్ కాలేజీలో ఒక్కో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుందని, అది ఒక్కోటి గాంధీ ఆసుపత్రితో సమంగా ఉంటుందన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా సాయంత్రంవేళ ఓపీ సేవలు నిర్వహిస్తున్నామని, 541 హెల్త్ క్యాంపులు నిర్వహించామన్నారు. వైద్యులు సెలవులు రద్దు చేసుకున్నారని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, ఈ సందర్భంగా సిబ్బంది సేవలకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూచకమా? మంత్రి మాటలపై కాంగ్రెస్ పక్షనేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఒక్కో బెడ్‌పై ఇద్దరుండటం శుభసూ చకం కాదని, రోగుల సంఖ్య విపరీతంగా ఉందని అర్థమన్నారు. మానవీయ కోణంలో ఆలోచించే వ్యక్తిగా పేరున్న ఈటల చేతికి వైద్యశాఖ వస్తే తీరు మారుతుందని జనం సంతోషించారని, కానీ బడ్జె ట్ చూస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. వానాకాలం రాకముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం వ్యాధిగ్రస్థమై ఉండేది కాదన్నారు. సాయంత్రం వేళ ఓపీ నిర్వహించటం గొప్ప కాదని కొట్టిపడేశారు. -
రూపాయికే ఆరోగ్య పథకం
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సం స్థలో మరో నాలుగు కొత్త పథకాలు రూపుదిద్దుకున్నాయి. రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమం అమ లు చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన కరీంనగర్ బల్దియా.. అదే స్ఫూర్తితో మరో నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది. మూడు రోజుల్లో పాలకవర్గం గడువు ముగుస్తున్నప్పటికీ మేయర్ రవీందర్ సింగ్ నూతన పథకాలకు శ్రీకారం చుట్టారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ కొత్త పథకాల గురించి వివరించారు. పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక్క రూపాయికే రక్త, మూత్ర, బీపీ చెకప్ చేసే విధంగా పథకాన్ని రూపొందించామని తెలిపారు. కార్పొరేషన్ ఆవరణలోనే పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ సహకారంతో ఒక డాక్టర్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమిస్తామన్నారు. వైద్య పరీక్షల కోసం వేల రూపాయల ఖర్చును భరించలేని పేదల కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. ఇప్పటికీ చెప్పులు లేకుండా నడిచేవారు ఉన్నారని వారందరికీ చెప్పులు అందించే విధంగా బూట్‌హౌస్ పథకం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఇళ్లలో మూలన పడి ఉన్న పాత చెప్పులు, బూట్ల జతలు తీసుకొచ్చి రిపేర్లు చేసి అందిస్తామన్నారు. ఇందుకోసం కళాభారతిలో షెడ్డును నిర్మిస్తామని తెలిపారు. నగరంలోని కమ్యూనిటీ హాళ్లలో నాలుగు రీడింగ్‌రూంలు ఏర్పా టు చేసి ఒకటి మహిళలకు కేటాయిస్తామని పేర్కొ న్నారు. మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో సేవా దృక్ఫథంలో నడుస్తున్న నైట్ షెల్టర్‌లోనే అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. రెండు పూటల భోజనం, బెడ్, ఫ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. -
కేసీఆర్ కిట్.. బడుగుల్లో హిట్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అనేక వైద్య, ఆరోగ్య పథకాలు ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చేరువయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఇటీవల హైదరాబాద్ వచ్చింది. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో ఎస్సీ, ఎస్టీలకు ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ కమిటీకి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం... 2017–18 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ తో ఇప్పటి వరకు 29.8% మంది ఎస్సీ, ఎస్టీలు లబ్ధి పొందారని తెలిపింది. ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెంచడం, తల్లీబిడ్డల మరణాలను తగ్గించడం కోసం దీన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు 10.60 లక్షల మంది ఉపయోగించుకున్నారు. వీరిలో ఎస్సీలు 1.99 లక్షల మంది, ఎస్టీలు 1.17 లక్షల మంది. దీనికిగాను ప్రభుత్వం 392.61 కోట్లు వెచ్చించగా, వారికోసం 31 శాతం నిధులను ఖర్చు చేశారు. తెలంగాణలో అమలవుతున్న వైద్య, ఆరోగ్య పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉపయోగించుకున్నది కేసీఆర్ కిట్టేనని కేంద్రానికి తెలిపింది. కంటి వెలుగుకు ఆదరణ అంధత్వంలేని తెలంగాణగా మార్చేందుకు ఆగస్టులో ప్రారంభమైన కంటి వెలుగు పథ కాన్ని 40 లక్షల మంది ఉపయోగించుకుంటే, అందులో ఎస్సీ, ఎస్టీలే 27.45% మంది ఉన్నారు. దీనిలో ఎస్సీలు 7.04 లక్షలు, ఎస్టీలు 3.94 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కంటి వైద్యశిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ చేసి అద్దాలు ఇస్తారు. అవసరమైతే శస్త్రచికిత్సకు సిఫారసు చేస్తారు. ఆరు నెలల్లో రాష్ట్రంలో పూర్తిగా కంటి పరీక్షలు నిర్వహించాలనేది ఈ పథకం లక్ష్యం.కంటి పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 827 బృందాలను ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 21.3 శాతం ఆరోగ్యశ్రీ పథకం కింద తెలంగాణలో 2015–16 నుంచి ఇప్పటి వరకు ఎస్సీలు 14.41 శాతం, ఎస్టీలు 6.89 శాతం ఉపయోగించుకున్నారు. మొత్తంగా 21.3 శాతం ఈ వర్గాల ప్రజలు ఉపయోగించుకున్నట్లు నివేదికలో ప్రస్తావించింది. ఈ పథకం కింద 949 వ్యాధులకు ఉచితంగా చికిత్స చేస్తున్నారు. 2015–16లో 2.60 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో 14.35 శాతం మంది ఎస్సీలు, 6.76 శాతం మంది ఎస్టీలున్నారు. 2016–17లో మొత్తం 2.76 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే అందులో ఎస్సీలు 14.30 శాతం, ఎస్టీలు 6.90 శాతం ఉన్నారు. ఇక 2017–18లో 3.11 లక్షల మందికి శస్త్రచికిత్సలు జరిగితే, అందులో ఎస్సీలు 14.59 శాతం, ఎస్టీలు 7.01 శాతం ఉన్నారు. పిల్లల్లో వచ్చే వ్యాధులను గుర్తించే రాష్ట్రీయ బాల స్వస్థీయ కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో 2016–18 మధ్య 36.55 లక్షల మంది కవర్ కాగా, అందులో ఎస్సీ, ఎస్టీలు 24.3 శాతం ఉపయోగించుకున్నారు. కేసీఆర్ కిట్ కింద ఎస్సీ, ఎస్టీలు పొందిన లబ్ధి –––––––––––––––––––––––––––––––––––– ఏడాది మొత్తం ఎస్సీలు శాతం ఎస్టీలు శాతం 2017–18 7,75,168 1,45,286 18.7 86,264 11.1 2018–19 2,84,898 54,474 19.1 30,996 10.8 మొత్తం 10,60,066 1,99,760 18.8 1,17,260 11.0 -
‘అందరికి ఆరోగ్యం’ అభాసుపాలు
కర్నూలు(హాస్పిటల్):ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నినాదం అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు(యూనివర్సల్ హెల్త్ కవరేజ్) అభాసుపాలవుతోంది. జనాభాలో 50 శాతం ప్రజలకు తమకు ఏ రకమైన ఆరోగ్యసేవలు అవసరమో? అవి ఎక్కడ లభిస్తాయో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. ఫలితంగా సంపాదనలో అధిక భాగం ఆరోగ్య సేవలకే వెచ్చిస్తుండటంతో దారిద్య్రానికి లోనవుతున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన డబ్ల్యూహెచ్‌వో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ నినాదాన్ని ప్రకటించింది. అయితే ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. పథకాలున్నా.. అవగాహన సున్నా కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పలు ఆరోగ్య, సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చింది. దాంతో పాటు ఆయనే ప్రవేశపెట్టిన 108, 104 సేవలను కొనసాగిస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవకు అదనంగా ఆరోగ్య రక్ష పేరుతో మరో పథకాన్ని తీసుకొచ్చింది. అయితే వీటి గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఇక ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా సేవలు అందిస్తున్న నెట్వర్క్ ఆసుపత్రులకు క్లెయిమ్ మొత్తాన్ని నెలల తరబడి విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచుతుండటంతో కొన్ని ఆసుపత్రుల్లో అదనంగా అయ్యే మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేస్తున్నారు. వైద్య పరీక్షల నివేదికలకు నిరీక్షణ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించే వైద్య పరీక్షలు నివేదికలు కావాలంటే రోగులు మరో రోజు రావాల్సిందే. దూరాభారాన్ని లెక్కచేయకుండా వైద్యుల వద్దకు చికిత్స చేయించుకోవడానికి వచ్చే వారికి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఏ రోజు పరీక్షల నివేదికలు ఆరోజే ఇచ్చి, వాటి ఆధారంగా చికిత్స చేసే అవకాశం రావాలని రోగులు కోరుతున్నారు. ఇక చంద్రన్న సంచార చికిత్స, 108 అంబులెన్స్‌ల్లోనూ మందుల కొరత వేధిస్తోంది. మృతదేహాలను ఇంటికి ఉచితంగా తీసుకెళ్లేందుకు ఏర్పాటైన మహాప్రస్తానం వాహనాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొరగా పనిచేస్తున్నాయి. ఐదు వాహనాలున్నా అవి కేవలం పగలు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజుకు 18 నుంచి 26 మందికి మరణిస్తున్నా ఐదారుగురికి మాత్రమే సేవలందిస్తున్నాయి. మిగిలిన వారు ప్రైవేటు అంబులెన్స్‌లపైనే ఆధారపడాల్సి ఉంటోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి ఉచితంగా చేర్చేందుకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో ఒక్కొక్కరిని గాకుండా ముగ్గురు, నలుగురు బాలింతలు ఒకేసారి తీసుకెళ్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కర్నూలులోని ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్ చెప్పారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆరోగ్యసేవలపై ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల అది వారి ఆర్థిక పరిస్థితిపై భారం పడుతోందన్నారు. తమ శాఖ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తుందన్నారు. సమావేశంలో పీవోడీటీటీ డాక్టర్ సరస్వతీదేవి, మలేరియా అదికారి డేవిడ్ రాజు, అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ దేవసాగర్, డెమో శారద, డిప్యూటీ డెమో ఎర్రంరెడ్డి పాల్గొన్నారు. రీయింబర్స్‌మెంట్‌వైపే మొగ్గు రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పేరిట ఈహెచ్ఎస్ కార్డును తీసుకొచ్చింది. రీయింబర్స్మెంట్ స్థానంలో వచ్చిన ఈ కార్డు చాలా ఆసుపత్రుల్లో అమల్లో లేదు. దీనికితోడు ఈ కార్డును ఉపయోగించుకోవడానికి ఉద్యోగులు కూడా వెనుకంజ వేస్తున్నారు. అత్యవసర పరిస్థితిల్లో ఇది ఆదుకోవడం లేదని ముందుగా నగదు ఖర్చు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ చేసుకుంటున్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేయడానికి 20 నుంచి 50 శాతం వరకు కోత విధిస్తుండటం, ఖర్చు పెట్టిన మొత్తం కూడా ఏడాదైనా తిరిగి పొందలేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. -
వైద్యశాఖ పోస్టుల్లో ‘ఇతరుల’ తిష్ట
సాక్షి, హైదరాబాద్: వైద్యులు కానివారు వైద్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. వారి పై వెంటనే కేసులు నమోదు చేస్తారు. అదే వైద్య వృత్తితో సంబంధమున్న పోస్టుల్లో ఇత రులను నియమిస్తే ఎలా ఉంటుంది. పరి స్థితి ఆందోళనకరంగా మారుతుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోనూ ఇదే జరుగుతోంది. ఆ శాఖలోని కీలక పోస్టుల్లో వైద్యులు కానివారిని నియమిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ లక్ష్యాలు పట్టించుకోకుండా ఆ శాఖ ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కింది స్థాయి అధికారులు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. - గర్భంలోనే ఆడ శిశువులను చంపేస్తున్న దారుణాలను నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర, రాష్ట్రాలను ఆదేశిస్తోంది. లింగనిర్ధాణ నియంత్రణ విభాగం(పీసీపీఎన్డీటీ) ఆరోగ్య, కుటుంబ సం క్షేమ శాఖ పరిధిలో ఉంది. లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చూసేందుకు పీసీపీ ఎన్డీటీ ఆస్పత్రులు తనిఖీ చేయాల్సి ఉంది. సరోగసి వ్యవహారం ఈ విభాగం పరిధిలోనే ఉంది. ఇంత కీలకమైన విభాగం ఉన్నతాధికారిగా జాయింట్ డైరెక్టర్ ఉంటారు. స్వతహాగా వైద్యులే ఈ పోస్టులో పని చేయాల్సి ఉంటుంది. పీసీపీఎన్డీటీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న మహిళా అధికారి సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేశారు. ఈ పోస్టులో వైద్య అధికారులను కాకుండా సహకార శాఖకు చెందిన ఒక అధికారిని ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్‌గా నియమించారు. దీనిపై వైద్యవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. - ల్యాబ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, ఆపరేషన్ అసిస్టెంట్ వంటి పోస్టుల్లో పారామెడికల్ కోర్సులు పూర్తి చేసినవారిని నియమిస్తారు. పారామెడికల్ బోర్డు ఇలాంటి 24 కోర్సులను నిర్వహిస్తుంది. అన్ని కోర్సుల్లో కలిపి ప్రతి ఏటా సగటున 10 వేల మంది శిక్షణ పూర్తి చేస్తున్నారు. కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పారామెడికల్ బోర్డులో పేర్లను నమోదు చేసుకుంటారు. అనంతరం వీరికి కొత్త విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలపై పారామెడికల్ బోర్డు అవగాహన కల్పిస్తుంది. ఈ బోర్డు పరిధిలో ల్యాబ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, ఆపరేషన్ అసిస్టెంట్లు ఉంటారు. కోర్సు లు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ పారామెడికల్ బోర్డులో పేర్లను నమోదు చేసుకుంటారు. అనంతరం వీరికి కొత్త విధానాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పారామెడికల్ బోర్డు కార్యదర్శిగా వైద్య వృత్తి, బోధన అంశాలపై సంబంధంలేని వ్యక్తిని ఉన్నతాధికారులు నియమించారు. బోర్డు పరిధిలో కోర్సులు, పరీక్షల నిర్వహణ గతంలో కంటే గాడితప్పాయని వైద్య వర్గాలో వాపోతున్నాయి. -
రోగాల ముసురు
- మన్యంలో విజృంభిస్తున్న టైఫాయిడ్, మలే రియా - గతేడాది కన్నా ఈ ఏడాది పెరుగుతున్న కేసులు - ఏరియా ఆస్పత్రికి జ్వరపీడితుల తాకిడి పాడేరు/పాడేరు రూరల్ : ఆదివాసీల ఆరోగ్యం కొడిగట్టిన దీపమవుతోంది. పాలకుల్లో చిత్తశుద్ధిలోపంతో ఆరోగ్య పథకాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఎపిడమిక్తో మన్యాన్ని వ్యాధులు చుట్టేస్తున్నాయి. డయేరియా, మలేరియా, విషజ్వరాలు జడలు విరబోసుకుంటున్నాయి. వాతవరణంలో మార్పులు, గూడేల్లో కొరవడిన పారిశుధ్యం, కలుషిత తాగునీటి కారణంగా వందలాది మంది మంచాన పడి అల్లాడిపోతున్నా రు. ఏజెన్సీ 11 మండలాల్లో 3574 గ్రామాలున్నాయి. ఏటా ఎపిడమిక్‌లో ఇక్కడ పరిస్థితి అదుపుతప్పడం, మరణాలు చోటుచేసుకోవడం పరిపాటి. వివిధ సర్వేలు దీనిని నిర్థారిస్తున్నాయి. జీకేవీథి మండలం దారకొండ పంచాయతీ చాకిరేవుగెడ్డలో బి.దిలీప్‌కుమార్(18), పెద్ద గంగారంలో లక్ష్మి అనే ఆరేళ్ల బాలిక మలేరియా లక్షణాలతో బాధపడుతూ గురువారం చనిపోయారు. ఆరోగ్యశాఖ ఇంతవరకు వీటిని అధికారికంగా గుర్తించ లేదు. రాయిగెడ్డ ఆశ్రమపాఠశాలకు చెందిన 12మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి రాగా పరీక్షల్లో ముగ్గురికి మలేరియాగా తేలింది. ఏజెన్సీలోని 36 పీహెచ్‌సీల పరిధిలో జూన్నెలాఖరుకు 4191 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇది ప్రబలుతున్న వ్యాధులకు అద్దం పడుతోంది. మలేరియా జ్వరాలు వెలుగులోకి వచ్చాకే ఆయా గ్రామాలు, పాఠశాలల్లో వెద్యసేవలు కల్పిస్తున్నారు. అపరిశుభ్రత కారణంగా మన్యంలో దోమల బెడద ఎక్కువ. మూడేళ్ల క్రితం ఐటీడీఏ పంపిణీ చేసిన దోమతెరలు ప్రస్తుతం ఎక్కడా కానరావడం లేదు. మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ దోమల నివారణ మందు మలాథియాన్ పూర్తిస్థాయిలో పిచికారీ చేపట్టలేదు. రెండో విడత స్ప్రేయింగ్ కేవలం 429 గ్రామాల్లో పూర్తి చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏజెన్సీలోని 2,505 గ్రామాల్లో స్ప్రేయింగ్ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. ఈ కారణాలతో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఆశ్రమాలు, హాస్టళ్ల విద్యార్థులు విలవిల్లాడిపోతున్నారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. శనివారం ఒక్కరోజే సుమారు 350 మంది ఓపీకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏరియా ఆస్పత్రిలో 2487 మంది జ్వరపీడితుల నుంచి రక్త పూతలు సేకరించగా 150మందికి టైఫాయిడ్, 46 మందికి మలేరియా సోకినట్టు నిర్ధారణ అయింది. ఎపిడమిక్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. గిరిజన సంఘం ఇటీవల గ్రామాల్లో చేపట్టిన సర్వేలోనూ ఇదే వ్యక్తమైంది. గతేడాది కన్నా ఈ ఏడాది జ్వరాల తీవ్రత అధికమని నిర్ధారించారు. ఇటీవల ఏజెన్సీలో పర్యటించిన ఆరోగ్య అభివృద్ధి వేదిక రాష్ట్ర సలహాదారుడు ఎం. గేయానంద్ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లో మందుల కొరత పలు పీహెచ్‌సీల్లో మందుల కొరత ఉంది. మినుములూరు పీహెచ్సీ ఇందుకు తార్కాణం. ఈ పీహెచ్‌సీకి నిత్యం రోగుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. డైక్లోఫిన్, ఐవీ, సిలైన్ బాటిళ్లు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు ఎస్.రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ, ఎంఎం శ్రీను ఈ పీహెచ్‌సీని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న మందుల వివరాలను సేకరించారు. రోగులతో రద్దీగా ఉండే ఈ పీహెచ్సీలో పిల్లలకు అవసరమైన సిరప్లు, యాంటీ బయాటిక్ మాత్రలు, పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో లేవని గుర్తించారు. -
కోమాలో ఆరోగ్య పథకాలు
ప్రమాదం జరిగితే.. మూడక్షరాల పదం డయల్ చేస్తే చాలు అంబులెన్సు ప్రత్యక్షమయ్యేది. ప్రాణదీపాలు ఆరిపోకుండా ఆదుకునేది. అదే 108 వాహనం. ఇప్పుడు ఫోన్ చేస్తే రాదు.. వచ్చినా గంటన్నర పడుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో 104 వాహనం సంచరించేది. వ్యాధిగ్రస్తులకు చక్కని మందులు అందించేది. ఇప్పుడీ వాహనం గ్రామాల్లో కనిపించడం అరుదైపోయింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేది. అదే ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా రూపాంతరం చెందింది. ప్రభుత్వాస్పత్రుల్లో అసౌకర్యాల వల్ల పేదలకు వైద్యం అందడం గగనమైంది. పేదల పాలిట ఆపద్బాంధవుడిలాంటి 104, 108 అంబులెన్సులు, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమిది. విజయనగరం ఆరోగ్యం: ఒకప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడితే చాలు.. ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లో 108 వాహనం వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేసిన గంటన్నర వరకు రావడం లేదు. పైగా సవాలక్ష ప్రశ్నలు వేస్తూ 108 అధికారులు రోగులను విసిగిస్తున్నారు. జిల్లాలోని 24 వాహనాల్లో సగానికి పైగా శిథిలమయ్యాయి. వాహనాల్లో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవు. పురుగు మందు, గుళికలు వంటి విష పదార్థాలు తీసుకున్న రోగుల కడుపు శుభ్రపరిచే సెక్షన్ ఆపరేటర్స్ ఒకటి రెండు వాహనాల్లోనే ఉన్నాయి. పల్స్‌రేటు చూసే సదుపాయం ఏ వాహనంలోనూ లేదు. రోగులను బెడ్‌పైకి తరలించే స్టెచ్చర్స్ అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఇవి పాడవడం వల్ల నడవలేని రోగులను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఎత్తుకుని వాహనంలోకి ఎక్కించాల్సి వస్తోంది. నిలువ నీడ లేని వాహనాలు 108, 104 వాహనాలకు షెడ్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడం తప్ప నిర్మించిన దాఖలాల్లేవు. జిల్లాలో 104 వాహనాలు 17 ఉన్నాయి. గతంలో ఇవి గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇద్దరు ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఏఎన్ఎం మాత్రమే హాజరవుతుంది. ఈ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. గ్రామాలకు ఉదయం 7 గంటల్లోగా వెళ్లాల్సిన 104 వాహనాలు ఉదయం 11 గంటల వరకు వెళ్లడం లేదు. పూర్తిస్థాయిలో అందని వైద్యసేవలు ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కొరత వల్ల రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జిల్లాలో కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషాస్పత్రి, ఎస్.కోట ఆస్పత్రి, తిరుమల ఆస్పత్రి, సాయి ఆస్పత్రి, ఆంధ్ర చిల్డ్రన్ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమల్లో ఉంది. ప్రయివేటు ఆస్పత్రులను మినహాయిస్తే, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు గగనమయ్యాయి. వైద్య రంగంలో ఆధునాతన పరికరాలు వచ్చినా, ఇంకా పాత పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. జనరల్ సర్జరీ విభాగంలో లాప్రోస్కోప్, ఎంఆర్ స్కాన్ పరికరాల్లేవు. గైనిక్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు బయాప్సీ, థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ప్రయివేటు ల్యాబ్రేటరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుల తరబడి రోగులకు శస్త్రచికిత్సలు చేయకుండా ఉంచేస్తున్నారు. ఏడాదిన్నరగా అందని మందులు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన వృద్ధురాలు దేవుడమ్మకు రక్తపోటు ఉంది. ఆరు నెలల పాటు 104 సిబ్బంది మందులిచ్చారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉండటంతో ప్రస్తుతం ఇవ్వడం మానేశారు. దీంతో ప్రతి నెల ఆమె మందులు కొనుగోలు చేస్తోంది. వాహన సదుపాయం కల్పించాలి తెర్లాం మండలానికి 108 వాహనం లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవ సమయంలో 108 వాహనం లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు, పాలకులు స్పందించాలి. బి.సుధాకర్, తెర్లాం