
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలెదుర్కొంటున్న అధికారుల్లో కొంతమందికి పదోన్నతి కల్పించే అంశంపై పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. నయీంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో కొంతమంది అధికారులను స్వల్పంగా శిక్షించారు. అయితే నయీంతో వీరికి ఆర్థిక సంబంధాలు లేవని విచారణలో తేలడంతో పదోన్నతులు కల్పించేందుకు పోలీసు శాఖ చర్చలు జరుపుతోంది. పలువురు అధికారులపై ఉన్న స్వల్ప శిక్షను ప్రభుత్వం ఎత్తివేసిందని పదోన్నతులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయ వర్గాలు తెలిపాయి.
నలుగురి డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి?
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో నలుగురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా, ఒకరికి నాన్‌క్యాడర్ ఎస్పీగా పదోన్నతి కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా సస్పెండైన కొంతమంది అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేత, పోస్టింగ్ కేటాయింపులపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment