సారంగాపూర్/దిలావర్‌పూర్ : రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికీ ఆహార భద్రత కార్డులు పంపిణీ చేస్తామని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని స్వర్ణ గ్రామంలో శుక్రవారం లబ్ధిదారులకు ఆహారభద్రతా కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి చెంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వం హయాంలో ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున బియ్యం చొప్పున పంపిణీ చేశారని.. ఆరు కిలోలకు పెంచిందని అన్నారు. వార్షిక ఆదాయం రూ.60 వేలలోపు ఉన్న వారికి మాత్రమే రేషన్‌కార్డులు ఇచ్చారని, ప్రస్తుతం లక్ష, 50 వేలలోపు ఉన్నవారికి కూడా ఆహార భద్రతా కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. పింఛన్‌లు పెంచామని పేర్కొన్నారు.
వంటగ్యాస్ లేనివారికి త్వరలో దీపం పథకం కింద సిలిండర్లు మంజూరు చేసే యోచనలో ఉన్నామని అన్నారు. అలాగే రైతుల వ్యవసాయ ఇబ్బందులు తీర్చడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం 40 వేల మోటార్లకు సోలార్ విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తోందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఎలాంటి విద్యుత్ కొరత లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడి బొగ్గు, నీళ్లతో ఆంద్రోళ్లు తమ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు.
రాష్ట్రం విడిపోయాక మనకు విద్యుత్ సమస్యలు వచ్చిపడ్డాయని అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని అన్నారు. కాకతీయ మిషన్‌ద్వారా చెరువుల్లో పూడికతీత, మరమ్మతు చేపడుతున్నామని చెప్పారు. సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ఆకనట్ట వెడల్పు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే రూ.3 కోట్లతో గేట్ల మరమ్మతులు చేయిస్తున్నామని అన్నారు.
సారంగాపూర్ మండలంలోని చించోలి(బి) నుంచి వెంగ్వాపేట్ రోడ్డుకు రూ.3 కోట్ల 80 లక్షలు, బీరవెల్లి నుంచి దిలావర్‌పూర్ రోడ్డుకు రూ.2.44 లక్షలు, పెండల్‌దరి రోడ్డుకు రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పవార్ శెవంతాబాయి, ఆర్డీవో శివలింగయ్య, సర్పంచులు లక్ష్మి, గంగారెడ్డి, ఎల్లయ్య, రవి, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగు రవికిషన్‌గౌడ్, ఎంపీడీవో శేఖర్, తహశీల్దార్ గంగాధర్, నిర్మల్ రూరల్ సీఐ పురుషోత్తం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల సంక్షేమానికి కృషి
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమానికి తనవంతు కృషిచేస్తానని మంత్రి ఐకే రెడ్డి పేర్కొన్నారు. స్వర్ణ ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్‌ఫైన్ బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థులు చెప్పడంతో.. వెంటనే 50 బెంచీలు తయారు చేయించి ఇవ్వాలని డీఆర్వో జైపాల్‌రెడ్డిని ఆదేశించారు.
పాఠశాల భవనం నిర్మించి ఏళ్లు గడుస్తున్నా తమకు కాంట్రాక్టర్ అప్పగించలేదని ఉపాధ్యాయులు చెప్పడంతో.. మంత్రి వెంటనే ఐటీడీఏ అధికారులతో మాట్లాడారు. వెంటనే భవనాన్ని అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పాఠశాలలలలో సీఆర్టీలు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ పథకాలను
సద్వినియోగం చేసుకోవాలి
దిలావర్‌పూర్ : ఆహార భద్రత పథకంలో భాగంగా మండంలోని నర్సాపూర్(జి) గ్రామంలోనూ లబ్ధిదారులకు బియ్యం అందించే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, నిర్మల్ ఎఫ్‌ఎస్‌సీఎస్ ైచె ర్మన్ రాంకిషన్‌రె డ్డి, బోథ్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు తుల శ్రీనివాస్, సర్పంచ్ కోండ్రురేఖ రమేశ్, ఎంపీపీ పాల్దె లక్ష్మీశ్రీనివాస్, జెడ్పీటీసీ ఆమ్గోత్ సుజాత మెర్వాన్, ఎంపీటీసీలు లక్ష్మి, కవిత, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు
Published Sat, Jan 3 2015 4:51 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement