కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పోటెత్తారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు బారులుతీరారు. కొందరు మహిళలు చంటిపిల్లలతో వచ్చారు. జనం పెద్ద ఎత్తున రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. కలెక్టర్ కరుణ దరఖాస్తుదారులతో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. - హన్మకొండ అర్బన్
హన్మకొండ అర్బన్: పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టించి ఇస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం దరఖాస్తులు కుప్పలుగా వచ్చా యి. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 3500కుపైగా దరఖాస్తు లు అందాయి. వీటిలో అధిక మొత్తం ఇండ్లు, ఇంటి స్థలాల కోసం చేసుకున్నవే కావడం విశేషం. అయితే ఒక్కసారే వూహించని విధం గా గ్రీవెన్స్‌సెల్‌కు జనం పోటెత్తడంతో అధికారులు కొంత హైరానా పడ్డారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో కొద్దిపాటి తోపులాట జరిగింది. చివరకు పోలీసుల సహకారంతో మహిళలు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జనం ఉదయం 9గంటల నుంచే కలెక్టరేట్‌లో దరఖాస్తులు చేసుకునేందు కు క్యూలో ఉన్నారు. చిన్నపిల్లలతో వచ్చినవారు పిల్లలకునీరు, ఆహారం విషయంలో ఇ బ్బందులు పడ్డారు. అయినా సాయంత్రం 6 గంటల వరకు వేచి ఉండి దరఖాస్తులు అధికారులకు ఇచ్చిన తరువాతే వెళ్లారు. దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన వారు తెల్లకాగితాలు, నమూనా దరఖాస్తులు కొనుగోళ్లతో కలెక్టరేట్ సమీపంలోని స్టేషనరీ దుకాణాలు, జిరాక్స్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. జనం తాకిడితో కలెక్టరేట్ ఎదుట ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.
దరఖాస్తుకు రూ.50
దరఖాస్తులు అప్పటికప్పుడు నమూనా తయా రు చేసి వాటిపై లబ్దిదారుల ఫొటోలు పెట్టి ఖాళీలు నింపి ఇచ్చినందుకు దుకాణాదారులు ఒక్కొక్కరి నుంచి రూ.50నుంచి రూ.100 వరకు వసూలు చేశారు. దరఖాస్తులు చే సుకునేందుకు వచ్చినవారిలో చాలా మంది నిరక్ష్యరాస్యులు కావడంతో అడిగినంత ఇచ్చి దర ఖాస్తులు రాయించుకున్నారు.
తూర్పునుంచి అధికం
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తు ల్లో 90శాతం వరకు వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని వారివే. కొన్ని డివిజన్లలో స్థానిక నాయకులు దరఖాస్తులు చేయమని పంపించి నట్లు కొందరు దరఖాస్తుదారులు వెల్లడించారు. వేల సంఖ్యలో జనం రావడంతో పరిస్థితి తెలసుకున్న కలెక్టర్ వాకాటి కరుణ నేరుగా జనంవద్దకు వచ్చి ఆరా తీశారు.
దరఖాస్తు రశీదులు ఇంటికే పంపిస్తాం : కలెక్టర్
కలెక్టరేట్‌లో సోమవారం ఇండ్లు, ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి దరఖాస్తులకు సంబంధించిన రసీదులను దరఖాస్తుదారులు అందజేసిన చిరునామాకు అధికారులు పంపిస్తారని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం అర్హులైన లబ్దిదారులను అధికారులు ఎంపిక చేస్తారని, కొందరు మద్యవర్తుల మాటలు నమ్మి కార్యాలయా ల చుట్టూ తిరిగి డబ్బులు, సమయం వృథా చేసుకోవద్దని కోరారు. దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చినప్పుడు చేసుకుంటే వారిలో అర్హులను ఎంపిక చేస్తామన్నా రు. కలెక్టరేట్‌కు కాకుండా స్థానికంగా తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేస్తే వారు పరిశీలించి పంపుతారని, ప్రజలు గమనించి సహకరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇండ్ల కోసం బారులు
Published Tue, Dec 22 2015 1:21 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM
Advertisement
Advertisement