ఖమ్మం మామిళ్లగూడెం: నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే శాఖ ఇటీవల ప్రవేశపెట్టిన డబుల్ డెక్కర్ రైలును ట్రయల్ రన్‌లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. సికింద్రాబాద్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ఈ రైలును నడిపేందుకు అధికారులు ట్రయల్ రన్ చేపట్టారు. 17 బోగీలు ఉన్న ఈ ట్రైన్‌లో సుమారు 2040 మంది ప్రయాణికులు కూర్చునే వీలుంది. ఒక్కో బోగీలో కింది భాగంలో 60, పై భాగంలో 60 డీలక్స్ సీట్లు ఉన్నాయి. ప్రతీ బోగీలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేశారు.
ఖమ్మంలో జెండాఊపి ప్రారంభించిన ఎస్‌ఎం
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం వచ్చిన ఈ డబుల్ డెక్కర్ రైలుకు ఖమ్మం స్టేషన్‌లో స్టేషన్ మేనేజర్ పాలపాటి వినోద్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కాచిగూడ నుంచి గుంటూరు మధ్య మూడు రోజుల పాటు నడిచే ఈ రైలును మరో మూడు రోజులు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిపేందుకు ట్రయల్ రన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఈ ట్రైన్ షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్‌ఎంవీ వీఎస్‌డీ వరప్రసాద్, టీఐ ఎంఎస్‌ఆర్ ప్రసాద్, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, సీజీఎస్‌ఆర్ ప్రసన్నకుమార్, సీబీఎస్‌ఆర్‌ఎం పద్మారావు, బీఎస్‌ఆర్‌ఏ చంద్రశేఖర్, ఎండీ జావిద్, ఆలం చౌదరి, ఎండీ ఫయాజ్, శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.
మధిరలో...
మధిర : సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిపేందుకు ట్రయల్న్‌ల్రో భాగంగా డబుల్ డెక్క ర్ రైలు మంగళవారం మధిర రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. రైల్వేశాఖకు చెందిన లక్నోలోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అధికారుల సమక్షంలో డబుల్ డక్కర్ రైలును డోర్నకల్ జంక్షన్‌నుంచి విజయవాడ వరకు ట్రయల్న్ ్రనిర్వహించారు. సికింద్రాబాద్‌లో సోమవారం బయలుదేరిన ఈ రైలు అదేరోజు రాత్రికి డోర్నకల్ చేరుకుంది. అక్కడినుంచి మంగళవారం ఉదయం ఖమ్మం, మధిర రైల్వేస్టేషన్ మీదుగా విజయవాడ వరకు ట్రయల్న్ ్రనిర్వహిస్తున్న క్రమంలో మధిర రైల్వేస్టేషన్‌లో సుమారు అరగంట పాటు ఆగింది.
మధిర సబ్ డివిజన్ సీనియర్ ఏడీఎన్ సౌరబ్‌కుమార్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఆశిష్ చక్రపాణి, డబుల్ డెక్కర్ రైలులో వచ్చిన ఉన్నతాధికారులకు స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు ఈ రైలును నడిపేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యంగా అన్ని రైల్వేస్టేషన్ల లో ప్లాట్‌ఫాం, ప్రయాణికుల కోసం వేసిన షెడ్లు ఈ రైలుకు తగులుతాయా అని పరిశీలించారు. ఈ రూట్‌లో అడ్డుగా ఉన్న కొన్ని షెడ్లను తొలగించారు. స్టేషన్‌లో ఆగిన ఈ రైలును స్థానికులు పరిశీలించారు.
ఖమ్మంలో డబుల్ డెక్కర్ రైలు
Published Wed, Aug 6 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement