దేవాదుల వద్ద కనిపించని నీరు
ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం దేవాదుల జె.చొక్కారావు ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన దేవాదుల ఇన్ టేక్ వెల్ వద్ద గోదావరి ఎండిపోయింది. దీంతో తెలంగాణ మణిహారంగా భావించే ఈ ప్రాజెక్టు వద్ద ఇప్పుడు ఎడారిలా కనిపిస్తోంది. గోదావరి వరదను సకాలంలో ఉపయోగించుకోలేని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు నిశ్శబ్దంగా మారింది.
దేవాదుల ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో రెండు మోటార్లు, రెండో దశలో రెండు మోటార్లు, మూడో దశలో ఆరు మోటార్లు అమర్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13వేల కోట్లు వెచ్చించగా, తెలంగాణలోని 7.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ కేవలం ఒక లక్షకు నీరును సరఫరా ఇస్తున్నారు. కాగా, గత పాలకుల వివక్షతో దేవాదుల ప్రాజెక్టు దిగువన బ్యారేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ రోజు ఎండిపోయిన గోదావరి చూడాల్సి వస్తోందని నిట్ రిటైర్‌డ ప్రొఫెసర్ పాండు రంగారావు ఆవేదన వ్యక్తం చేశారు. నీటిని తోడేందుకు మోటార్లు ఉన్నా.. నీరు లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
ఎండిన గోదావరి
Published Sat, Feb 13 2016 1:31 AM | Last Updated on Tue, Mar 19 2019 6:15 PM
Advertisement
Advertisement