నల్లగొండ : పరిపాలన ఆమోదం పొందిన తాగునీటి పథకాల పనులను ఏళ్లు గడుస్తున్నా ప్రారంభించని కాంట్రాక్టర్లకు జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే ప్రారంభంలో ఉన్న ప్రాజెక్టుల పనులు రీ డిజైన్ చేసి వాటర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేకోవలో పరిపాలన ఆమోదం పొంది ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రారంభించని పథకాలను రద్దు చేయాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగానే పలుమార్లు సంబంధిత 22 కన్‌స్ట్రక్షన్ సంస్థలకు నోటీసులు జారీచేసిన ఆర్‌డబ్ల్యూఎస్...ఇటీవల కాలంలో తుది హెచ్చరికలు కూడా పంపింది. జిల్లావ్యాప్తంగా 11 మండలాల్లో 22 తాగునీటి పథకాల పనులు రెండు, మూడు రోజుల్లో రద్దు చేసే అవకాశం ఉంది.
ఈ పనుల అంచనా మొత్తం విలువ రూ.3 కోట్ల 18 లక్షలు. ఈ మొత్తం పనులన్నీ గడిచిన రెండు మూడేళ్ల క్రితం ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి పరిపాలన ఆమోదం పొందినవే. 2013-14 నాటికిఈ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తామని కన్‌స్ట్రక్షన్ కంపెనీలు ఆర్‌డబ్ల్యూఎస్ వద్ద ఒప్పందం (అగ్రిమెంట్) చేశాయి. ఒప్పందం ప్రకారం కాం ట్రాక్టర్లకు ఇచ్చిన గడువు కొద్ది నెలల క్రితమే ముగిసింది. పరిపాలన ఆమోదం పొందిన ప నులు ఏళ్లు గడుస్తున్నప్పటికి ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. దీంతో అధికారులు ఆయా కంపెనీలకు అనేకసా ర్లు నోటీసులు జారీచేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న సమీక్షసమావేశాల్లో జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పుకోలేని స్థితికి వచ్చింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి రాజకీయ ఒత్తిళ్లు కూడా తోడుకావడంతో అధికారులకు మరో గత్యంతరం లేక పనులు రద్ధు చేయాలనే తుది నిర్ణయానికి వచ్చారు. దీనిలో భాగంగానే కాంట్రాక్టర్లకు ఆఖరు తాఖీదులు జారీ చేశారు.
పనులు చేపట్టకపోవడానికి కారణాలు..
ఈ ప్రాజెక్టులు అన్ని కూడా తండాలు, ఎస్సీ కాలనీల్లో తాగునీటి సమస్య తొలగించేందుకు ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినవి. పలు చోట్ల చాలీచాలని పైపులైన్లతో అన్ని ప్రాంతాలకు తాగునీరు చేరడం లేదన్న ఉద్దేశంతో కొత్తగా పైపులైన్ల విస్తరణ కోసం ప్రతిపాదించినవి. అయితే చాలాచోట్ల స్థల సేకరణ ఇబ్బందిగా ఉందని, ప్రాజెక్టుల నిర్మాణానికి స్థలం దొరకడం లేదన్న కారణాలు ఎక్కువగా ఉన్నాయి. స్థల సమస్యలేని మండలాల్లో కాంట్రాక్టర్లు ఉద్దేశపూర్వ కంగానే పనులు చేపట్టలేదన్న విమర్శలూ ఉన్నాయి. దీంతో కాంట్రాక్టు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనల మేరకు ఫైనల్ నోటీసులు జారీ చేసి...ఆ తర్వాత పనులు రద్దు చేయనుంది.
ఇవీ..రద్దయ్యే పనులు
చందంపేట మండలం బుగ్గతండా రూ.17.83 లక్షలు
పీఏ పల్లి మండలం గుర్రపు తండా రూ.24.70లక్షలు
నేరేడుచర్ల మండలం బెట్టిగూడెం రూ.12.5 లక్షలు
బోదల దిన్నె రూ.11.85 లక్షలు
మునగాల మండలం తాడ్వాయి రూ.19.5లక్షలు
నడిగూడెం మండలం కేశవాపురం రూ.18.65లక్షలు
దామరచర్ల మండలం కమ్మగూడెం రూ.10.7 5లక్షలు
నిడమనూరు మండలం
నేతాపూర్ ఎస్సీకాలనీ రూ.14.20లక్షలు
పజ్జన్నగూడెం ఎస్సీ కాలనీ రూ.14.20లక్షలు
ముకుందాపురం ఎస్సీ కాలనీ రూ.14.20లక్షలు
ముప్పారం ఎస్సీ కాలనీ రూ.14.20లక్షలు
నిడమనూరు రూ.20 లక్షలు
యాదగిరిగుట్ట మండలం ఎల్లమ్మతండా రూ.12.30లక్షలు
గుండాల మండలం
లంబాడితండా/కొంపల్లి రూ.11.20లక్షలు
తుంగతుర్తి మండలం కర్విరాల రూ.19.85లక్షలు
మేగ్యాతండా/వెంపటి రూ.10.50 లక్షలు
సావ్లాతండా రూ.11.50లక్షలు
నాంపల్లి మండలం బొట్యాతండా రూ.11.85లక్షలు
దొర్లతండా రూ.12.30లక్షలు
కొర్రెన్నేని తండా రూ.11.75 లక్షలు
రేక్యాతండా రూ.11.80లక్షలు
వరాయిగూడెం రూ.12.75లక్షలు
తాగునీటి కాంట్రాక్టర్లకు తాఖీదులు
Published Mon, Nov 3 2014 2:13 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement