‘పొదుపు’ను మింగిన సీఏ | Dwarka women money caught by a CA | Sakshi
Sakshi News home page

‘పొదుపు’ను మింగిన సీఏ

Published Tue, Aug 25 2015 4:56 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

‘పొదుపు’ను మింగిన సీఏ - Sakshi

‘పొదుపు’ను మింగిన సీఏ

- ఠాణాలో ఫిర్యాదు చేసిన డ్వాక్రా మహిళలు
సంగెం :
మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ సీఏ చేతివాటం ప్రదర్శించాడు. ఈ సంఘటన మండలంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. కృష్ణానగర్‌కు చెందిన స్వయం సహాయక సంఘం ఉర్వశి గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు బోయిని విజయ, మేకల పూలమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 23, 2012ను బ్యాంకులో రూ.4లక్షల రుణం తీసుకున్నాం. నెలనెలా పొదుపులు, బ్యాంకు రుణ వాయిదా మొత్తం రూ.15వేలు వసూలు చేసి బ్యాంకు లో జమ చేయమని ఖర్చులు కూడా ఇచ్చి అదే గ్రామానికి చెందిన సీఏ రాజబోయిన రాజ్‌కుమార్‌కు ఇచ్చేవారు.

వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న సద రు సీఏ కొన్ని నెలలు రూ.15వేలకు బదులు రూ.5 వేలు జమ చేసి కంప్యూటర్ ప్రింట్ సరిగా పడలేదని పెన్నుతో పాస్ పుస్తకంలో దిద్ది వారికి సర్దిచెప్పేవాడు. నెలనెలా సక్రమంగా కిస్తీలు కట్టినా బాకీ ఎంతకూ తీరడం లేదు. అరుుతీ మళ్లీ రుణం తీసుకోవాలని ఇటీవల అధ్యక్ష, కార్యదర్శులు సంగెం ఆంధ్రా బ్యాంకులో ఆరా తీశారు. మీరు వాయిదాలు సక్రమంగా కట్టడం లేదని చెప్పడంతో ఖంగుతిన్న వారు సీఏ వద్ద ఉన్న పాస్ పుస్తకాలు తీసుకుని పరిశీలించారు.

దీంతో సీఏ రూ.1.57వేలు మింగినట్లు తేలడంతో అతడిని నిల దీశారు. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండని బెది రించడంతో దిక్కుతోచని మహిళా గ్రూపు సభ్యులు రజిత, భాగ్య, కోమల, దూడమ్మ, రేణుక, మల్లమ్మ, దూడమ్మ, అరుణ, రాజమ్మ, సరోజన.. డబ్బులు కాజేసిన సీఏపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, మహిళా సంఘాల సభ్యులను మోసం చేసిన సీఏల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పల్లారుగూడ, గవిచర్ల, మొండ్రాయి, ఆశాలపల్లి, లోహిత తదితర గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు బయటపడ్డారుు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయూలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement