నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎంసెట్-2014) గురువారం జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా ముగి సింది. 18 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇంజినీరింగ్ విభాగం వారికి పరీక్ష నిర్వహించారు. ఇందులో 8444 మంది విద్యార్థులు ఉండగా 7984 మంది (94.5 శాతం) హాజరయ్యారు. 460 మంది విద్యార్థులు హాజరు కాలేదు. 8 సెంటర్లలో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు మెడిసిన్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3983 మంది విద్యార్థులకు గాను 3681 మంది (92.4శాతం) హాజరయ్యారు. 302 మంది గైర్హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని అధికారులు ప్రచారం చేయడం వల్ల విద్యార్థులు ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. మెడిసిన్ ప్రవేశపరీక్ష కేంద్రాల్లో జామ ర్లు ఏర్పాటు చేశారు. పోలీసులు విస్త్రతంగా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్, పరిశీ లకుల బృందాలు సెంటర్లను తనిఖీ చేశాయి.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువులను సహాయకులుగా తీసుకు రావడంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ కిటకిటలాడాయి. ఎంసెట్‌కు హాజరయ్యే వివిధ ప్రాంతాల విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు. ప్రైవేటు ఇంజినీరింగ్, ఫార్మసి కళాశాలల నిర్వాహకులు కూడా గ్రామాల నుంచి విద్యార్థులను తమ వాహనాల్లో తరలించి వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చాలా మంది ద్విచక్రవాహనాలు, కార్లతో తరలిరావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఎన్‌జీ కాలేజీ నుంచి క్లాక్‌టవర్ వరకు, హైదరాబాద్ రూట్‌లో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యింది. పట్టణంలోని భోజన హోటళ్లు కూ డా కిటకిటలాడాయి. ఐస్‌క్రీమ్, సోడాబండ్లు, శీతల పానీయాల అమ్మకం దారులకు కూడా మంచి గిరాకీ లభించింది.
ప్రత్యేక బస్సులు
ఎంసెట్ విద్యార్థుల కోసం ఆర్టీసీ వారు 36 స్పెషల్ బస్సులను నడిపారు. దేవరకొండ నుంచి 2, నల్లగొండ-4, మిర్యాలగూడ-8, కోదాడ-5, సూర్యాపేట 12, యాదగిరి గుట్ట-5 బస్సులను నడిపారు. విద్యార్థుల నుంచి సాధారణ చార్జీలే వసూలు చేసినట్లు డిప్యూటీ సీటీఎం అనిల్‌కుమార్ తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్
Published Fri, May 23 2014 2:40 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement