సమాజానికి మార్గదర్శకులుగా ఉండాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. బోగస్ బిల్లులతో మెడికల్ రీయింబర్స్‌మెంట్ కాజేయడం... ప్రమోషన్ల కోసం బోగస్ సర్టిఫికెట్లు... నకిలీ చాలన్లతో డబ్బులు మాయం చేయడం, నకిలీ స్టాంప్‌లతో పాఠశాలలకు బోగస్ అనుమతి పత్రాలు జారీ చేయడం వంటి ఘటనలతో ఇప్పటికే పరువు పోతుండగా... తాజాగా మరో అవినీతి బాగోతం వెలుగుచూసింది. నకిలీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాలతో అప్పనంగా అలవెన్సులు పొందుతున్న వైనం విస్మయం గొల్పుతోంది.
కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్:విద్యాశాఖలో రోజుకో అవినీతి బాగోతం వెలుగులోకి వస్తోంది. తాజాగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి పీహెచ్‌సీ కోటాలో అలవెన్సులు స్వాహా చేస్తున్న ఉపాధ్యాయుల, ఉద్యోగుల బండారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలుచేశారు. నకిలీ సర్టిఫికెట్లతో ప్రభు త్వ సొమ్ము స్వాహా చేస్తున్నారనే సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు ఏడా ది క్రితం విచారణ చేశారు.
జిల్లానుంచి వికలాంగుల కోటాలో అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయుల, విద్యాశాఖ ఉద్యోగుల వివరాలు సేకరించగా.. 500 మంది అలవెన్సులు పొందుతున్నట్లు తేలింది. అక్రమాలు జరుగుతున్నాయని ప్రాథమికంగా తేలడంతో పూర్తిస్థాయి విచారణ కోసం రాష్ట్ర విద్యాశాఖ అధికారులను సం ప్రదించి డీఈవో ద్వారా ఉపాధ్యాయుల వివరాలు రాబట్టారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా ఉపాధ్యాయుల అవినీతి బాగోతం గుట్టురట్టయింది. మొదటి విడతగా విచారణ చేసిన జాబితాలోనే 15 మంది ఉపాధ్యాయులు తప్పుడు పత్రాలు సమర్పించి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నట్లు తేలింది.
అలవెన్సుల కోసం..
వికలాంగుల కోటాలో ఉపాధ్యాయులకు ప్రతినెలా అలవెన్సు కింద రూ.900తోపాటు రూ.200 వృత్తి పన్ను మినహాయింపు, బదిలీలు, పదోన్నతుల్లో 3శాతం రిజర్వేషన్, రూ.లక్ష వరకు ఇన్‌కంటాక్స్ మినహాయింపు, ఇతర వెసులుబాటు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉపాధ్యాయులు తప్పుడు వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, అదనపు సౌకర్యాలు పొందేందుకు కక్కుర్తి పడ్డారు.
రికవరీకి ఆదేశాలు
విజిలెన్స్ విచారణలో జిల్లాలోని 15 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు ఇప్పటివరకు పొందిన అలవెన్సులు రికవరీ చేయాలని విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి బుధవారం జిల్లా విద్యాశాఖాధికారికి ఆదేశాలందాయి. ఈ మేరకు సదరు ఉపాధ్యాయులపై చర్యలకు విద్యాశాఖ సమాయత్తమైంది. దీంతో అక్రమంగా అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు 15 మంది అక్రమాలకు పాల్పడినట్లు తేలగా మిగతా వారిపైనా విచారణ కొనసాగుతోంది. వీరంతా ఎప్పటినుంచి ఈ అలవెన్సులు పొందుతున్నారు? ఎంత మొత్తం స్వాహా అయిందనే లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
అక్రమంగా అలవెన్సులు పొందుతున్న ఉపాధ్యాయులు వీరే...
ఎండీ.షకీల్‌అహ్మద్, జెడ్పీహెచ్‌ఎస్ కోత్తపేట, వెల్గటూర్ మండలం
శ్రీనివాసరావు, జెడ్పీహెచ్‌ఎస్, పాతగూడురు, వెల్గటూర్
ఎం.బాపురెడ్డి, శివంగాలపల్లె, కోనరావుపేట మండలం
ఎం.రాజిరెడ్డి, ఎస్‌ఏ, మొగ్దుంపూర్, కరీంనగర్
కె.లక్ష్మయ్య , వడ్లూరు, బోయినపల్లి
బి.అమరేందర్‌రెడ్డి, పెద్దకురమపల్లె, చొప్పదండి
బి.హనుమండ్లు, గట్టుభూత్కుర్, గంగాధర
వలిఅలీ, స్కూల్ అసిస్టెంట్ జెడ్పీహెచ్‌ఎస్, కరీంనగర్
రాజా మహేందర్‌రెడ్డి, శాంతినగర్, కరీంనగర్(పీఎస్)
వెంకటరమణారెడ్డి, జెడ్పీహెచ్‌ఎస్, నగునూరు, కరీంనగర్
ప్రభాకర్‌రెడ్డి, నగునూరు, కరీంనగర్
జరీనాబేగం, ప్రియదర్శిని కాలనీ- బొమ్మకల్, కరీంనగర్
పి. రాజు, విలాసాగర్, బోయినపల్లి మండలం
రాాజిరెడ్డి, పీఆర్కేనగర్, కరీంనగర్
డి. చంద్రయ్య, గంజ్ హైస్కూల్ అటెండర్, కరీంనగర్
దారితప్పారు
Published Thu, May 22 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement