సాక్షి,నర్సంపేట: సార్వత్రిక ఎన్నికల పర్వం మొదలైంది. ముందస్తుగా ప్రభుత్వం రద్దు కావడం, ఎన్నికల కోడ్ అమలులోకి రావడం రెండు నెలల వ్యవధిలో జరిగిపోయాయి. టికెట్ ఖరారైన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలామునకలయ్యారు. ఎక్కడ చూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. వర్తమాన రాజకీయాల్లో డబ్బుల అభ్యర్థులు విజయం కోసం చేసే ఖర్చుల వద్దు కూడా పెద్దదే. అయితే ఎంత చేయాలనేది ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రతి అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయొద్దని ఆదేశించింది. వాహనాలు, భోజనాలకు, పార్టీ జెండాలకు తదితర వస్తువులకు లెక్కలను రూపొందించింది.
సామగ్రి అద్దెలు ఇలా..
- లౌడ్ స్పీకర్, ఆప్లిఫైర్ మ్రెక్రోఫోన్ రోజుకు రూ.800
- బహిరంగ సభకు సంబంధించిన వేదికకు రూ.2,500
- క్లాత్, ఫ్లెక్సీకి రూ.10, వాల్‌పోస్టర్ రూ.10
- ప్లాస్టిక్ జెండా రూ.8, క్లాత్ జెండాకు రూ.12
- హోర్డింగుల ఏర్పాటుకు రూ.15,000
- చెక్కతో తయారుచేసిన కటౌట్‌కు రూ.8,000
- వస్త్రం, ప్లాస్టిక్‌తో తయారుచేసిన కటౌట్‌కు రూ.5,000
- ఫొటో, వీడియోగ్రాఫర్ (రోజుకు) రూ.3,000
- స్వాగత తోరణానికి రూ.2,500
- టెంట్లు (సైజునుబట్టి) రూ.400 నుంచి రూ.800
- కుర్చీకి రూ.6, భోజనానికి రూ.60
- కార్పెట్‌కు రూ.250, సైడ్ వాల్‌కు రూ.80
- భోజనం చేసే ప్లేట్‌కు రూ.3, చాయ్‌కు రూ.6
- హోర్డింగ్‌ల ఏర్పాటుకు, మునిసిపాలిటీ అనుమతి తీసుకోవడానికి రూ.500
- విశ్రాంతి కోసం అద్దెకు తీసుకునే ఇంటికి (రోజుకు) రూ.2000
- తలపై ధరించే టోపీకి రూ.50, కండువాకు రూ.10
- ఎన్నికల గుర్తుతో ఉన్న టీషర్టులకు రూ.150
- వాహనాలను నడిపే డ్రైవర్‌కు రోజుకు రూ.800
- జీపు రోజుకు రూ.1,600
- టెంపో, ట్రాక్టర్‌కు రూ.2,500
- సుమో, క్వాలీస్ రూ.3,500
- కారుకు రూ.3,000
- ఆటోకు రూ.1,000
- రిక్షా, ద్విచక్ర వాహనాలకు రూ.500
Comments
Please login to add a commentAdd a comment