ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్)
సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్: ఎన్నికలు సమీస్తున్న త రుణంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఈవీఎంల పనితీరు, పోలింగ్ కేంద్రాల్లో వసతులపై సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, హన్వాడ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను రెవెన్యూ అ«ధికారులు పరిశీలిస్తున్నారు.
గ్రామాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. తహసీల్దార్‌లతో పాటు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించబడిన అధికారులు మౌలిక వసతులపై దృష్టి సారించారు. సామాన్య ఓటరుతో పాటు దివ్యాంగ ఓటర్లు సైతం ఓటుహక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాలు ఉండగా రెండు లక్షల 7వేల 204మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు లక్ష 4వేల 13 మంది, స్త్రీలు లక్ష 3వేల 388మంది ఉన్నారు. ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల్లో 90శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరగాలంటే అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని బూత్ లేవల్ అధికారులు గ్రామీణ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. పోలీసులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆ పార్టీలు తమ పార్టీ అభ్యర్థికి ఎవరికి సీటు ఇచ్చినా గెలిపించాలని ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
ఓటింగ్ శాతానికి చర్యలు
ఎన్నికల సందర్భంగా ఓటర్ల ను చైతన్య పరుస్తున్నాం. ప్ర తిఒక్కరూ ఓటుహక్కును వి నియోగించుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల స్థితిగతులను అధికారులకు తెలియజేస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశం, తహసీల్దార్ మహబూబ్‌నగర్ అర్బన్
Comments
Please login to add a commentAdd a comment