thahashildar
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దారు, డ్రైవర్ : విశాఖ
-
పెట్రోల్ దాడి: ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కరీంనగర్: తహశీల్దార్ పాస్‌పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది. వివరాలు.. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ పనిమాత్రం కావడంలేదు. రేపుమాపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో హల్చల్ చేశాడు. పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులోని కంప్యూటర్లపై పెట్రోల్ పోశాడు. దీంతో వెంటనే తేరుకున్న అక్కడున్న సిబ్బంది ఆయన్ని వెంటనే బయటకు తోసేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటరతో తహశీల్దార్ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
నమ్మి..నట్టేట మునిగారు!
సాక్షి, గిద్దలూరు(ప్రకాశం): తెలిసి చేశాడో..తెలియక చేశాడో తెలియదుగానీ ఓ ఇన్చార్జి తహసీల్దార్ నిర్వాకానికి 16 మంది వీఆర్ఏలకు అన్యాయం జరిగింది. ఈ సంఘటన గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు..వీఆర్ఏలుగా పనిచేస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారు తమ పిల్లలను నామినీ వీఆర్ఏలుగా నియమించాలనుకోవడం సహజం. గిద్దలూరులో గతంలో ఇన్చార్జి తహసీల్దార్‌గా ఉన్న వల్లీకుమార్ మాటలు నమ్మిన వీఆర్ఏలు ఇప్పుడు నిండా మునిగారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన 12 మంది వీఆర్ఏలు వృద్ధాప్యంలో ఉండగా, మరో నలుగురు వీఆర్ఏలు చనిపోయారు. మొత్తం 16 మంది వీఆర్ఏల స్థానంలో వారి నామినీ (కుమారులు)లను వీఆర్ఏలుగా నియమిస్తానని వల్లీకుమార్ నమ్మబలికాడు. ఆయన చెప్పినట్లు 12 మంది వయస్సు పైబడిన వీఆర్ఏలు మెడికల్ సెలవులు పెట్టారు. అనంతరం ఆయన వారందరినీ నామినీ వీఆర్ఏలుగా భావించి వారితో ఎన్నికల విధులు చేయించుకున్నాడు. ఇక తాము వీఆర్ఏలుగా కొనసాగవచ్చని ఆశపడి వారు ఉత్సాహంగా విధులు నిర్వహించారు. ఎన్నికలనంతరం కొత్త తహసీల్దార్ జీవీ సుబ్బారెడ్డి బదిలీపై తన పాత స్థానావెళ్లగానే ఉత్తర్వులిచ్చి పూర్తి స్థాయి వీఆర్ఏలుగా ఉద్యోగాలు కల్పించి మొత్తం వేతనాలు ఒకేసారి చెల్లిస్తానని సదరు అధికారి వారికి ఆశ కల్పించాడు. 16 మంది నామినీ వీఆర్ఏలు నాలుగు నెలల పాటు విధులు నిర్వహించాక తమకు వేతనాలు ఇవ్వాలని ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ను నిలదీశారు. దీనికితోడు ఎన్నికల విధుల కోసం వచ్చిన తహసీల్దార్ సుబ్బారెడ్డి రెగ్యులర్‌గా ఇక్కడే ఉండిపోవడంతో వీఆర్ఏల వేతనాలు నిలిచిపోయాయి. ఇక తమకు ఉద్యోగాలు, వేతనాలు రెండూ రావని గ్రహించిన నామినీ వీఆర్ఏలు కనీసం వేతనాలైనా చెల్లించాలని తహసీల్దార్‌ను వేడుకున్నారు. మెడికల్ సెలవులో ఉన్నట్లు మీరు లెటర్ ఇచ్చారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చి విధుల్లో చేరితే అప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తామని తహసీల్దార్ సుబ్బారెడ్డి వారితో తేల్చి చెప్పారు. వీఆర్ఏలు సీఐటీయూ నాయకులు, వీఆర్ఏల సంఘంతో కలిసి 20 రోజుల పాటు ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశారు. గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్ మోసాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు వేశారు. అయినా ప్రస్తుత తహసీల్దార్ సుబ్బారెడ్డి నామినీ వీఆర్ఏలకు పోస్టులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఉద్యోగం, వేతనాలు ఇవ్వక పోవడంతో నామినీలు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రయోజనం లేకపోవడంతో రిలే నిరాహార దీక్షలు విరమించిన వీఆర్ఏలు తమకు వేతనాలివ్వాలని తహసీల్దార్‌కు డాక్టర్ సర్టిఫికెట్లు అందజేశారు. ఉద్యోగం మాట పక్కన పెడితే 8 నెలల పాటు శ్రమించిన వేతనం కోల్పోయామని 16 మంది వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీఓలో లేకుండానే తమకు నియామక ఉత్తర్వులిచ్చి మోసం చేసిన గత ఇన్చార్జి తహసీల్దార్ వల్లికుమార్పై చర్యలు తీసుకుని 16 మందికి రావాల్సిన 8 నెలల వేతనం రూ.12.80 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఆ అధికారం తహసీల్దార్లకు లేదు వీఆర్ఏల పిల్లలను వీఆర్ఏలుగా నియమించే అధికారం తహసీల్దార్లకు లేదు. 2012లో ఉద్యోగ కిరణాలు పేరుతో ప్రతి నియామకాన్ని ఏపీపీఎస్సీ ద్వారా చేపడుతున్నారు. వీఆర్ఏలను దాని ద్వారానే నియమిస్తున్నారు. వల్లికుమార్ ఎలా ఉత్తర్వులు ఇచ్చారో నాకు తెలియదు. వీఆర్ఏలు అనారోగ్యంతో ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చి సెలవులు పెట్టారు. తిరిగి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకొచ్చి విధుల్లో చేరితే ఇప్పటి నుంచి వేతనాలు చెల్లిస్తాం. జీవీ సుబ్బారెడ్డి, తహసీల్దార్, గిద్దలూరు -
అంతా మా ఇష్టం..!
సాక్షి, విజయనగరం(చీపురుపల్లి) : ఆయనో పెద్ద భూ స్వామి... పదుల ఎకరాల భూమి ఉంది... ఇంకా ఆయనకు భూ దాహం తీరలేదు. శ్రీకాకుళం జిల్లా నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో.. తన పొలం మధ్యలో ఉన్న గెడ్డలు, వాగులు..రస్తాలను కలిపేశారు. ఒకే పొలంగా మార్చేశారు... అందులో చక్కగా మొక్కజొన్న సాగు చేపట్టారు. చీపురుపల్లి మండలంలోని కర్లాం రెవెన్యూ పరిధిలో జరిగిన ఈ గెడ్డ ఆక్రమణ పుణ్యమా అని దాదాపు 300 ఎకరాల ఆయకట్టుకు నీరందడంలేదు. గెడ్డను విడిచిపెట్టాలని భూస్వామి రైతులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్‌కు గోడు వినిపించారు. 2.69 ఎకరాల ఆక్రమణ శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలంలోని లింగాలవలస, వెంకటాపురానికి చెందిన టీడీపీ నేతల సమీప బంధువు కర్లాం రెవెన్యూ పరిధిలో 18 ఎకరాలు జిరాయితీ పొలాన్నీ ఇటీవల కొనుగోలు చేశారు. ఆ జిరాయితీ పొలానికి చుట్టూ సర్వే నంబరు 302–1లో 2.41 ఎకరాల విస్తీర్ణంలోని గెడ్డ, 302–4 లో 0.28 సెంట్లు రస్తా ఉండేది. జిరాయితీ పొలం చుట్టూ ఉన్న ఈ గెడ్డ, రస్తాను భూస్వామి ఆక్రమించినట్టు గ్రామస్తులు,పెద్దలు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ గెడ్డ నుంచి వచ్చే నీరు పోలమ్మ చెరువుకు చేరుతుందని, ఆ చెరువు కింద 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని గ్రామ పెద్దల వాదన. అయితే, లావేరు మండలంలో ఉన్న టీడీపీ నాయకుడు తన దగ్గర నారాయణ మంత్రం ఉందని, అంతా తాను చూసుకుంటానని దగ్గరుండి కర్లాం రెవెన్యూ పరిధిలో భూములు కొనిపించి, ఆక్రమణకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌కు ఫిర్యాదు కర్లాం రెవెన్యూ పరిధిలో వాగు, రస్తా ఆక్రమణకు గురైందని, దీనివల్ల పోలమ్మ చెరువుకు నీరు సరఫరా నిలిచిపోయిందని గ్రామ పెద్దలు తహసీల్దార్ శ్యామ్సుందర్కు ఫిర్యాదు చేశారు. దీనివల్ల 300 ఎకరాల ఆయకట్టులో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వివరించారు. సర్వేకు ఆదేశించాం ఇదే విషయంపై తహసీల్దార్ పి.వి.శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ కర్లాంలో గెడ్డ, రస్తా ఆక్రమణలపై ఫిర్యాదు వచ్చిందన్నారు. దీనిపై మండల సర్వేయర్, ఆర్ఐలకు సర్వే చేసి వాస్తవ నివేదికలను ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఆక్రమణలకు గురైనట్లు తేలితే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
సచివాలయ పోస్టుల రాత పరీక్షలపై దృష్టి
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తుండడంతో అందుకు సంబంధించిన రాత పరీక్షల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఒక్కో సచివాలయంలో 11 రకాల పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పోస్టులకు జిల్లా నుంచి సుమారు 2.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనాకు వచ్చిన రెవెన్యూ యంత్రాంగం.. అందుకు తగ్గట్టు రాత పరీక్ష కేంద్రాలను గుర్తించే పనిలో పడింది. 2.50 లక్షల మంది అభ్యర్థులకు కనీసం 1,250 సెంటర్లు అవసరమవుతాయని భావిస్తున్నారు. ఈ మేరకు సెంటర్లు గుర్తించి సోమవారం సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వీరపాండియన్ అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికలను రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్‌కు పంపి.. ఆమోదం లభించిన వెంటనే పరీక్ష నిర్వహణకు తేదీలు ఖరారవుతాయని అధికార వర్గాలు తెలిపాయి. వీఆర్వో పోస్టుల భర్తీకి కసరత్తు గ్రామ సచివాలయాల్లో రెవెన్యూ శాఖ నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) నియామకానికి అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. మొత్తం మంజూరు (శాంక్షన్) అయిన పోస్టులు ఎన్ని? ఎంతమంది పనిచేస్తున్నారు? వీఆర్ఏలకు పదోన్నతి కల్పించడం ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలి? రాత పరీక్ష ద్వారా ఎన్ని భర్తీ చేయాలనే దానిపై రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో అర్బన్ ప్రాంతాలకు 46, గ్రామీణ ప్రాంతాలకు 746.. మొత్తం 792 పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో ప్రస్తుతం అర్బన్‌లో 43 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 648 మంది.. మొత్తం 691 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 27 పోస్టులను వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందుకోసం అర్హత కలిగిన వీఆర్ఏలను గుర్తిస్తున్నారు. మిగిలిన 74 వీఆర్వో పోస్టులను రాత పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లోనే 879 సచివాలయాలు ఏర్పాటు కానున్నాయి. చిన్న సచివాలయాలు రెండింటికి కలిపి ఒక వీఆర్వోను నియమించే దిశగా కసరత్తు సాగుతోంది. -
తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి దుర్మరణం
గార్లదిన్నె: విధులు ముగించుకుని స్వగ్రామానికి కారులో వస్తున్న తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి(42)ని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. శింగనమల మండలం గోవిందరాయునిపేటకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి జిల్లాలోని చిలమత్తూరు, సోమందేపల్లి, పెద్దవడుగూరు మండలాల్లో తహసీల్దార్‌గాను, పామిడిలో డీటీగాను పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా బనగానిపల్లి తహసీల్దార్‌కు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధులు చూసుకుని ఆదివారం తెల్లవారుజామున అనంతపురానికి ఒక్కడే కారులో బయల్దేరారు. గార్లదిన్నె మండలం తిమ్మంపేట సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి అవతలివైపు రోడ్డపై బోల్తాపడి పల్టీలు కొట్టడంతో విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతయ్యారు. పోలీసులు ప్రమాదస్థలిని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. విష్ణువర్ధన్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తహసీల్దార్ మృతి బాధాకరం అనంతపురం న్యూసిటీ: తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి మృతి బాధాకరమని కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. అనంతపురం సర్వజనాస్పత్రిలో విష్ణువర్ధన్‌రెడ్డి మృతదేహానికి కలెక్టర్ నివాళులర్పించారు. తహసీల్దార్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. అధికారులు ప్రయాణాలు చేసే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తుంచుకుని ముందుకెళ్లాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ సుబ్బారెడ్డి, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సీసీలు భాస్కర్‌రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. -
ఎన్నికల నిర్వహణకు కసరత్తు
సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్: ఎన్నికలు సమీస్తున్న త రుణంలో ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల పరిశీలన, ఈవీఎంల పనితీరు, పోలింగ్ కేంద్రాల్లో వసతులపై సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నారు. మహబూబ్‌నగర్ అర్బన్, రూరల్, హన్వాడ మండలాల పరిధిలో పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను రెవెన్యూ అ«ధికారులు పరిశీలిస్తున్నారు. గ్రామాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తున్నారు. తహసీల్దార్లతో పాటు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నియమించబడిన అధికారులు మౌలిక వసతులపై దృష్టి సారించారు. సామాన్య ఓటరుతో పాటు దివ్యాంగ ఓటర్లు సైతం ఓటుహక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మొత్తం 263 పోలింగ్ కేంద్రాలు ఉండగా రెండు లక్షల 7వేల 204మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు లక్ష 4వేల 13 మంది, స్త్రీలు లక్ష 3వేల 388మంది ఉన్నారు. ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో 90శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరగాలంటే అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని బూత్ లేవల్ అధికారులు గ్రామీణ ఓటర్లను చైతన్య పరుస్తున్నారు. పోలీసులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆ పార్టీలు తమ పార్టీ అభ్యర్థికి ఎవరికి సీటు ఇచ్చినా గెలిపించాలని ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఓటింగ్ శాతానికి చర్యలు ఎన్నికల సందర్భంగా ఓటర్ల ను చైతన్య పరుస్తున్నాం. ప్ర తిఒక్కరూ ఓటుహక్కును వి నియోగించుకునేలా అవగా హన కల్పిస్తున్నాం. ఓటింగ్ శాతం పెంచడానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల స్థితిగతులను అధికారులకు తెలియజేస్తున్నాం. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – వెంకటేశం, తహసీల్దార్ మహబూబ్‌నగర్ అర్బన్ -
తహసీల్దార్‌పై రాజకీయ వేటు
నెల్లూరు రూరల్ : నెల్లూరు తహసీల్దార్ జి.వెంకటేశ్వర్లుపై రాజకీయ వేటు పడింది. అధికార పార్టీ నేతల అడ్డగోలు అవినీతి, అక్రమాలకు అడ్డుపడున్నాడని దీర్ఘకాలిక సెలవుపై పంపించేశారు. ఆయన స్థానంలో దుత్తలూరు తహసీల్దారు వి.శ్రీనివాసులురెడ్డిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు తహసీల్దారుగా వెంకటేశ్వర్లు ఈ ఏడాది జనవరి 22న బాధ్యతలు చేపట్టారు. కేవలం 8 నెలలు మాత్రమే పని చేసినప్పటికీ అందరిని కలుపుకుని పోతూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే టీడీపీ నేతలకు ఆయన మింగుడు పడకుండా వ్యవహరించడంతో ఆయన్ను అడ్డుతొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండలంలోని ఓగూరుపాడులో తెలుగు తమ్ముళ్లు నెల్లూరు రూరల్‌లో పెత్తనం చెలాయిస్తున్న నేత సాయంతో అడ్డంగా ప్రభుత్వ భూములను ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు నిక్కచ్చిగా వ్యవహరించి ఇవి ప్రభుత్వ భూములంటూ బోర్డు పెట్టించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చర్యలు రూరల్ నాయకుడి ఆగ్రహానికి గురైనట్టు ప్రచారం జరుగుతోంది. మండలంలోని దేవరపాళెంలో వేదగిరి లక్ష్మీనరసింహస్వామి గుడికి చెందిన ఎర్రచందనం చెట్లను మాజీ మంత్రి ఆదాల అనుచరుడు వేమిరెడ్డి హంసకుమార్‌రెడ్డి అడ్డంగా నరికి సొమ్ము చేసుకున్నాడు. ఈ వ్యవహారం గత తహసీల్దారు జనార్దన్ కాలంలో జరిగింది. దీనిపై తహసీల్దారు వెంకటేశ్వర్లు కఠినంగానే వ్యవహరించినట్లు తెలిసింది. దేవస్థానానికి చెందిన ఆస్తుల పరిరక్షణకు పూనుకున్నాడు. కొలతలు వేయించి హద్దులు తేల్చాడు. ఆక్రమణదారుల ఆధీనంలో ఉన్న భూములను సైతం దేవస్థానానికి అప్పగించారు. ఈ చర్యలు ఆ మాజీ మంత్రి ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. నెల్లూరులోని శ్రీరంగనాథస్వామి దేవస్థానానికి చెందినరూ.70 కోట్ల ఆస్తులను అధికార పార్టీకి చెందిన కబ్జాపరుల పరం కాకుండా కాపాడేందుకు పూనుకున్నారు. ఈ పరిణామం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. అధికారం ఉండగానే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలనుకున్న తెలుగు నేతలు, తమ్ముళ్లకు తహసీల్దార్ కొరకరాని కొయ్యగా తయారు కావడంతో జిల్లాకు చెందిన మంత్రి నారాయణపై ఒత్తిడి తెచ్చి తహసీల్దార్ వెంకటేశ్వర్లును తప్పించారు. ఆయన స్థానంలో తమకు అనుకూలమైన దుత్తలూరు తహసీల్దార్‌ను నియమించుకున్నారనే ప్రచారం జరుగుతుంది. -
నందలూరు తహసీల్దార్‌పై వేటు
నందలూరు: వైఎస్సార్ జిల్లా నందలూరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన సయ్యద్ ముక్దుల్ బాషా అనే రైతుకు పట్టాదారు పాస్‌పుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో సదరు రైతు గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఈ ఘటన పై నివేదిక అందుకున్న కలెక్టర్ సదరు తహసీల్దార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు. సంఘటనపై విచారణ చేపట్టాలని కలెక్టర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గ్రామానికి చెందిన సమ్యద్ మక్దుల్ బాషా 5 ఎకరాలకు పైగా ఉన్న భూమిని తన పేరుమీద పట్టాచేయాలని మండల తహశీల్దార్‌ను సంప్రదించాడు. అయితే, ఆ భూమికి పట్టా కోసం రూ. 4లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో దిక్కు తోచని రైతు సెల్ టవర్ ఎక్కి తన తమ్ముడి కుమారుడికి ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న తమ్ముడి కొడుకు టవర్ దగ్గరకు చేరుకొని 108 సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే, సెల్‌టవర్‌పై ఉన్న సమయంలోనే అతనికి గుండెపోటు రావడంతో రైతు అక్కడికక్కడ మృతిచెందాడు.