
సాక్షి, కరీంనగర్: తహశీల్దార్ పాస్‌పుస్తకం ఇవ్వడంలేదన్న కారణంతో ఓ రైతుకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తహశీల్దార్ కార్యాలయంపై ఏకంగా పెట్రోల్‌తో దాడికి దిగాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ఎమ్మార్వో కార్యాలయంలో చోటుచేసుంది. వివరాలు.. లంబాడిపల్లికి చెందిన రైతు కనకయ్య తన పొలం పాస్‌పుస్తకాల కోసం గత కొంతకాలంగా తిరుగుతున్నాడు. కానీ పనిమాత్రం కావడంలేదు. రేపుమాపు అంటూ అధికారులు తిప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కార్యాలయానికి వచ్చిన కనకయ్య తనతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో హల్‌చల్ చేశాడు. పాస్‌పుస్తకం ఇవ్వడంలేదని ఆఫీసులోని కంప్యూటర్లపై పెట్రోల్ పోశాడు. దీంతో వెంటనే తేరుకున్న అక్కడున్న సిబ్బంది ఆయన్ని వెంటనే బయటకు తోసేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. కనకయ్య పెట్రోల్‌తో రావడంతో కార్యాలయ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటరతో తహశీల్దార్ ఆఫీసు వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.