తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
రూ.4,000 కోట్ల నిధుల వెచ్చింపు
13 లక్షల పని దినాలు, పూర్తి కూలీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో గ్రామాల్లో ఆస్తుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా గ్రామాల్లో చేపట్టే ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో బేస్‌మెంట్ వరకు అవసరమైన పనిని ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టనుంది. మూడు లక్షల రూపాయలతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధి నిధులను ప్రభుత్వం దీనికి ఉపయోగించనుంది. గ్రామాల్లో ఆస్తుల కల్పనలో భాగంగా ఉమ్మడి కమ్యూనిటీ హాళ్లు, కల్లాలు, మినీ గోడౌన్లతో పాటు పశు వైద్యశాలల్లో మౌలిక సదుపాయల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణరుుంచారు.
ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రూ.4,000 కోట్లతో ఉపాధి హామీ పనులను అమలు చేయనున్నారు. తద్వారా కూలీలకు 13 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ‘‘కూలీలకు 100 పని దినాలు కల్పించాల్సిన చోట కుటుంబానికి కేవలం 48 రోజులే కల్పించారు. అంటే ఒక కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే ఒక్కొక్కరికి కేవలం 16 పని దినాలే దొరికారుు’’ అని అధికారులు మంత్రికి వివరించారు. పైగా కూలీలకు కేంద్రం నిర్ణరుుంచి రేటు రోజుకు రూ.169 కాగా వారికి తెలంగాణలో రూ.106 మాత్రమే లభిస్తున్నట్టు చెప్పారు. దాంతో కూలీలకు రావాల్సిన రేటు పూర్తిగా వచ్చేలా చూడడంతో పాటు, 100 పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధులు
Published Wed, Jun 18 2014 2:22 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement