మొత్తం 27 నామినేషన్లు
చివరి రోజున 21 నామినేషన్లు దాఖలు
నేడు నామినేషన్ల పరిశీలన
మార్చి 2న నామినేషన్ల ఉపసంహరణ
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల మండలి స్థానానికి నామినేషన్లు పర్వం ముగిసింది. మూడు జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కొందరు అభ్యర్థులు రెం డు, మూడు చొప్పున నామినేషన్లు వేశారు. దీంతో 27 మంది అభ్యర్థులకుగాను.. 44 నామినేషన్ సెట్లు దాఖలయ్యాయి. నామినేషన్ల చివరి రోజైన గురువారం 21 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున తీన్మార్ మల్లన్న, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 2వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
మల్లన్న నామినేషన్‌కు హాజరైన జిల్లా నేతలు
వరంగల్ రూరల్ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజవర్గానికి జరుగుతు న్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్) నల్లగొండ కలెక్టరేట్‌లో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమానికి జిల్లా నేతలు పలువురు తరలివెళ్లారు. అంతకుముందు ఏచూరి గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లన్నను గెలిపించుకునేందుకు సమన్వయంతో కృషిచేయాలన్నారు. సమావేశంలో ఏఐసీసీ కా ర్యదర్శి, రాష్ట్ర బాధ్యుడు ఆర్‌సీ.కుంతియా, పీసీసీ వర్కిం గ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, మల్లు భట్టివిక్రమార్క, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మీడియా కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ముగిసిన నామినేషన్ల పర్వం
Published Fri, Feb 27 2015 12:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement