కల్దుర్కిలో రెండోదఫా పర్యటించిన సీబీసీఐడీ అధికారులు
బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించేందుకు సీబీసీఐడీ అధికారులు మండలంలోని కల్దుర్కిలో బుధవారం పర్యటించారు. ఈ గ్రామంలో గత ఆగస్టులో మొదటి విడత పర్యటించి విచారణ చేపట్టిన విషయం విదితమే. మిగిలిన లబ్ధిదారుల వివరాలను ఇప్పుడు సేకరించారు.
సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి .. బిల్లులు వచ్చాయూ? ఎంత మేరకు వచ్చాయి.. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు.. అనే వివరాలుతెలుసుకున్నారు. అనంతరం సీబీసీఐడీ ఎస్‌ఐ సాల్మన్‌రాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో 794 ఇళ్లు మంజూరు కాగా, 155 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు. ఆయన వెంట స్థానిక హౌసింగ్ ఇన్‌చార్జి డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
పోల్కంపేటలో...
లింగంపేట : మండలంలోని పోల్కంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై బుధవారం సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య విచారణ చేపట్టారు. ఎంతమంది ఇందిరమ్మ బిల్లులు పొందారు? ఎంతమంది నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశాలపై ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. గ్రామంలో సుమారు 70 మంది నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అదికారులు గుర్తించారు.
అవకతవకలకు పాల్పడిన వారిపై, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులపై త్వరలో కేసులు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్‌ఐ నాగేందర్, హెడ్‌కానిస్టేబుల్ పాషా, రహమత్, స్థానిక ఏఎస్‌ఐ కుమార్‌రాజా, కానిస్టేబుల్ కిరణ్, హౌసింగ్ ఏఈ నరేందర్, వీఆర్వో రవి ఉన్నారు.
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
Published Thu, Mar 5 2015 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM
Advertisement
Advertisement