CBCID officials
-
నాగదోషం ఉన్నట్లు నమ్మించి.. పలుమార్లు అత్యాచారం
తిరువళ్లూరు: విద్యార్థిని ఆత్మహత్యకు ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామే కారణం అని.. సీబీసీఐడీ అధికారులు నిర్ధారించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా చెంబేడు గ్రామానికి చెందిన హేమమాలిని(22) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. అనారోగ్యానికి గురికావడంతో బంధువులు 2021లో వెల్లాత్తుకోటలోని ఓ ఆశ్రమానికి ఆమెను తీసుకెళ్లారు. యువతిని పరిశీలించిన ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి నాగదోషం ఉన్నట్లు నమ్మించి తరచూ యువతిని ఆశ్రమానికి రప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో యువతి బంధువులు ఆశ్రమానికి తీసు కెళ్లారు. రెండు రోజుల తరువాత హేమామాలిని అక్కడ ఆత్మహత్యకు యత్నించింది. తిరువళ్లూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత ఫలించక మృతి చెందింది. యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ.. పలు సంఘాలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మునస్వామిని మాత్రం అరెస్టు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీసీఐడీకి మార్చాలని ఆందోళనలు ఉద్ధృమయ్యాయి. దీంతో ప్రభుత్వం ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించింది. కేసును విచారించిన సీబీసీఐడీ పోలీసులు యువతిపై ఆశ్రమ నిర్వాహకుడు మునస్వామి పలుమార్లు అత్యాచారం చేసాడని, తరచూ తనకు లొంగాలని యువతిని వేదించడం వల్లే మనస్థాపం చెంది హేమామాలిని ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఆదివారం అర్ధరాత్రి ఆశ్రమ నిర్వాహకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
డీఎంకే ఎంపీపై హత్యకేసు.. అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ సన్నాహాలు?
సాక్షి, చెన్నై : కడలూరు ఎంపీ, డీఎంకే నేత రమేష్ ఓ హత్య కేసులో బుక్కయ్యారు. ఆయనపై శనివారం సీబీసీఐడీ కేసు నమోదు చేసింది. త్వరలో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కడలూరు నుంచి డీఎంకే అభ్యర్థిగా టీఆర్వీఎస్ రమేష్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఆయనకు కడలూరులో జీడిపప్పు పరిశ్రమ ఉంది. ఇక్కడ మేల్ వా పట్టు గ్రామానికి చెందిన గోవిందరాజన్ పనిచేస్తున్నాడు. ఈయన పీఎంకేలో కార్యకర్త. ఈ పరిస్థితుల్లో గత నెల గోవిందరాజన్ మృతి చెందాడు. అయితే, ఆయన శరీరంపై గాయాలు ఉండడం అనుమానాలకు దారితీసింది. హత్యకేసు నమోదు చేయాలంటూ.. కిడంబలూరు పోలీసులను బాధిత కుటుంబం కోరింది. అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయడంతో ఆ కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జిప్మర్ వైద్య బృందం పర్యవేక్షణలో గోవిందరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ కుటుంబం పట్టుబట్టింది. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) సీబీసీఐడీ కేసు నమోదు ఈ కేసును సీబీసీఐడీకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ రమేష్‌పై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆయనే కొట్టి చంపినట్లుగా, బలవంతంగా విషం తాగించినట్లు ప్రచారం జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన సీబీసీఐడీ శనివారం ఎంపీపై హత్య కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఎంపీ సహాయకుడు నటరాజన్, ఆ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కందవేల్, అల్లాపిచ్చై, సుందర్, వినోద్ పేర్లను కూడా కేసులో చేర్చారు. నటరాజన్ అనారోగ్యం పేరిట ఆస్పత్రిలో చేరడంతో మిగిలిన నలుగుర్ని సీబీసీఐడీ అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరిచిన అనంతరం వీరిని కడలూరు జైలుకు తరలించారు. అయితే, ఈ కేసులో ఎంపీ రమేష్‌ను అరెస్టు చేయడానికి సీబీసీఐడీ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. గోవిందరాజన్ పరిశ్రమలో చోరికి పాల్పడినట్లు, ఆగ్రహించి ఆయన్ని చితక్కొట్టి హతమార్చినట్లుగా సీబీసీఐడీ గుర్తించినట్లు సంకేతాలు వెలువడ్డాయి. చదవండి: (ఆశిష్ మిశ్రా అరెస్ట్) ముఖ్యనేతలతో స్టాలిన్ సమాలోచన పార్టీకి చెందిన ఎంపీపై సీబీసీఐడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కడలూరు జిల్లా ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అన్నాఅరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు, న్యాయవిభాగం నేతలు, రాజ్యసభ సభ్యుడు విల్సన్, ఎన్.ఆర్ ఇలంగోవన్, మంత్రి ఎంఆర్కే పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి హాజరయ్యారు. సీబీసీఐడీ నుంచి లభించే సమాచారం మేరకు పార్టీ పరంగా రమేష్‌పై చర్యలకు డీఎంకే సిద్ధమవుతోంది. -
‘అక్రమార్కుల’పై క్రిమినల్ కేసులు
- సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి. కుల్కచర్ల:‘ఇందిరమ్మ’ ఇళ్ల బిల్లులలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో సీబీసీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై ఆరోసారి విచారణ చేపట్టారు. గ్రామానికి రెండో విడతలో 524 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 92 మంది లద్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో అవి నాన్స్టాటేడ్ కింద రద్దయ్యాయి. 374 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు బిల్లులు మంజూరు చేశారు. మిగితావి వివిధ స్థాయిలలో ఉన్నాయి. ఇప్పటివరకు సీబీసీఐడీ అధికారులు ఐదుసార్లు విచారణ చేశారు. గురువారం మరోమారు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ పథకంలో గ్రామంలో ఎంతమంది బిల్లులు తీసుకున్నారనే విషయం ఆరా తీశారు. బిల్లులు తీసుకున్నవారు ఇళ్లు కట్టుకున్నారా..? లేదా అని విచారణ జరిపారు. బిల్లులు తీసుకున్నవారిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో గ్రామంలో లేనివారి పేర్లమీద బిల్లులు తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో సీబీసీఐడీ అధికారులు కుల్కచర్ల స్టేట్ బ్యాంకుకు వెళ్లి విచారణ చేశారు. బిళ్లులు తీసుకున్న వారి ఖాతాలను తనిఖీ చేశారు. కొందరు లబ్ధిదారులకు సంబంధం లేకుండా బిల్లులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆధార్‌కార్డులు లేకుండా బిల్లులు తీసుక్నువారి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 40 మంది వరకు అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని, ఈవిషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీబీసీఐడీ అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు. -
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
కల్దుర్కిలో రెండోదఫా పర్యటించిన సీబీసీఐడీ అధికారులు బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించేందుకు సీబీసీఐడీ అధికారులు మండలంలోని కల్దుర్కిలో బుధవారం పర్యటించారు. ఈ గ్రామంలో గత ఆగస్టులో మొదటి విడత పర్యటించి విచారణ చేపట్టిన విషయం విదితమే. మిగిలిన లబ్ధిదారుల వివరాలను ఇప్పుడు సేకరించారు. సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి .. బిల్లులు వచ్చాయూ? ఎంత మేరకు వచ్చాయి.. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు.. అనే వివరాలుతెలుసుకున్నారు. అనంతరం సీబీసీఐడీ ఎస్ఐ సాల్మన్‌రాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో 794 ఇళ్లు మంజూరు కాగా, 155 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు. ఆయన వెంట స్థానిక హౌసింగ్ ఇన్చార్జి డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోల్కంపేటలో... లింగంపేట : మండలంలోని పోల్కంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై బుధవారం సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య విచారణ చేపట్టారు. ఎంతమంది ఇందిరమ్మ బిల్లులు పొందారు? ఎంతమంది నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశాలపై ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. గ్రామంలో సుమారు 70 మంది నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అదికారులు గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులపై త్వరలో కేసులు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్ఐ నాగేందర్, హెడ్‌కానిస్టేబుల్ పాషా, రహమత్, స్థానిక ఏఎస్ఐ కుమార్‌రాజా, కానిస్టేబుల్ కిరణ్, హౌసింగ్ ఏఈ నరేందర్, వీఆర్వో రవి ఉన్నారు. -
‘ఇందిరమ్మ’పై సీబీసీఐడీ విచారణ పూర్తి
ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ పథకం ఇళ్ల అవినీతి బాగోతంపై జిల్లాలో సీబీసీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తు పూర్తయింది. నివేదికను విచారణ అధికారి సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ సంబంధిత శాఖ ఐజీకి సమర్పించటంతో అవినీతికి పాల్పడిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లాలో మొత్తం రూ. 14 కోట్లు స్వాహా అయినట్లు గృహనిర్మాణ శాఖ విచారణలో తేలగా సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. విచారణలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. నివేదికను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి పంపించినట్లు జిల్లాలో విచారణ చేపట్టిన అధికారి తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను బట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో విచారణ అధికారి డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో క్షేత్ర స్థాయిలో రెండు నెలల పాటు విచారణ చేశారు. గ్రామాల్లో కూడా విచారణ కొనసాగింది. పాలేరు నియోజకవర్గంలోని రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండలం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కూనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ములకలపల్లి మండలం పూసుగూడెంలో విచారణ చేశారు. గతంలో నిధులు స్వాహచేసి సస్పెండ్ అయ్యి మళ్లీ విధుల్లో చేరిన అధికారుల్లో గుబులు పుడుతోంది. మళ్లీ తమ మెడకు ఉచ్చు బిగుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. -
‘ఇందిరమ్మ’ పై సీఐడీ పునర్విచారణ
* బషీరాబాద్‌కు రానున్న అధికారులు * అక్రమార్కుల్లో గుబులు బషీరాబాద్: ‘ఇందిరమ్మ’ ఇళ్ల వ్యవహరంపై మళ్లీ సీబీసీఐడీ అధికారులు బషీరాబాద్‌కు మరో రెండ్రోజుల్లో విచారణకు రానున్నారు. ‘ఇందిరమ్మ’ ఇళ్ల అవకతవకల్లో బషీరాబాద్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అవినీతి జరిగిన విషయం తెలిసిందే.. దీంతో ‘ఇందిరమ్మ’ అక్రమాల పుట్టను బట్టబయలు చేసేందుకు సెప్టెంబర్ నెలలో సీఐడీ అధికారులు విచారణ మొదలుపెట్టారు. విచారణ చేసి వెళ్లాక తిరిగి సీఐడీ అధికారులు బషీరాబాద్‌కు రానుండడంపై అధికారులు, దళారులకు భయం పట్టుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వహయంలో ‘ఇందిరమ్మ’ మొదటి విడతలో బషీరాబాద్ గ్రామపంచాయతీ ఎంపికైంది. ఇక్కడ హౌజింగ్ అధికారులు నిబంధనలకు వి రుద్ధంగా ఇళ్లను మంజూరు చేశారు. అధికారుల చేతి వాటం, దళారుల ప్రోత్సాహంతో బషీరాబాద్ గ్రామంతోపాటు, అనుబంధ గ్రామమైన నవాంద్గి లబ్ధిదారులకు ఇళ్లను నిర్మించుకోకుండానే బిల్లులు చేశారు. ఈ విషయమై సీఐడీ అధికారులు అప్పట్లో విచారణ చేశారు. సగానికి పైగా పాత ఇళ్లకే బిల్లుల చెల్లింపు.. బషీరాబాద్ గ్రామ పంచాయతి పరిధిలో ‘ఇందిరమ్మ’ మొదటి విడతలో 1195 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 951 ఇళ్ల నిర్మించినట్లు హౌజింగ్ అధికారులు బిల్లులు చెల్లించారు. అయితే లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు రాలేదని ఆందోళన చేయడంతో రెండేళ్ల క్రితం బషీరాబాద్‌లో విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. అందులో 479 ఇళ్ల నిర్మాణం చేయకుండానే బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. వీటిలో కొన్ని పాత ఇళ్లనే కొత్తవాటిగా చూపి బిల్లులు చేసుకున్నట్లు కూడా గుర్తించారు. ఈ 479 ఇళ్లకు సంబంధించి రూ.98 లక్షల మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయి. అడ్రస్ లేని 146 ఇళ్లు... బషీరాబాద్, నవాంద్గి గ్రామాలలో సీఐడీ అధికారులు సెప్టెంబరులో విచారణ చే యగా బిల్లులు చేసుకున్నవాటిలో 146 ఇళ్లను అడ్రస్ లేని ఇళ్లుగా గుర్తించారు. నిర్మించని 479 ఇళ్లలో హౌజింగ్ అధికారులు కొన్ని నిజాం కాలం నాటి ఇళ్లను చూపించినా కూడా 146 ఇళ్లు రికార్డులకు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో పని చేసిన అధికారులు చేతి వాటం ప్రదర్శించి ఇళ్ల ను చూడకుండానే బిల్లులు చేయడం గమనార్హం. జోరుగా చర్చ.... మండల కేంద్రంలో ఇళ్ల భాగోతంపై సీఐడీ అధికారులు మళ్లీ విచారణ చేయనున్నారు. గతంలో చేసిన విచారణ మాదిరిగానే చేసి వెళతారా లేక అక్రమాలకు పాల్పడ్డవారిని అదుపులోకి తీసుకుంటారా అనేదానిపై మండల కేంద్రంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే అక్రమాలకు పాల్పడ్డ హౌజింగ్ అధికారులను హైదరాబాద్‌లో పూర్తి స్థాయిలో విచారణ చేశారు. ఎవరిపై చర్యలు తీసుకుంటారోనని మధ్యవర్తులలో గుబులు రేకెత్తుతోంది. -
అంతులేని అవినీతి
‘ఇందిరమ్మ’ అవకతవకలపై విచారణ ముమ్మరం వెలుగు చూస్తున్న అక్రమాలు ఊరూరా లక్షల రూపాయలు స్వాహా! నారాయణఖేడ్: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, ఆక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. హౌసింగ్‌శాఖలో అవినీతి భారీగా జరిగిందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఓ అంచనా కోసం జిల్లాల వారీగా ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లోని నాలుగు గ్రామాల్లో సీబీసీఐడీ అధికారులు మొదటి విడతగా విచారణ చేపట్టారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో రెండు సార్లు సీబీసీఐడీ అధికారులు బృందాలుగా వెళ్లి ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై లబ్ధిదారులు, హౌసింగ్ అధికారులు, ఇతరులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. అందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం మండలంలోని కేరూర్, నాగులపల్లి, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలంలో శేరిదామరగిద్ద, ఖేడ్ మండలంలోని పంచగామ గ్రామపంచాయతీ పరిధిలో విచారణ జరిపారు. లక్షల్లో అవినీతి సీబీసీఐడీ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో దాదాపు ప్రతి గ్రామంలో లక్షల్లో అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. పంచగామ గ్రామ పంచాయతీ పరిధిలో హౌసింగ్ శాఖలో రూ.1.35 కోట్లతో 419 ఇళ్లు మంజూరుకాగా, అందులో 176 ఇళ్ల పేరిట అక్రమార్కులు రూ.47 లక్షలను బిల్లుల రూపంలో స్వాహా చేశారు.తెల్ల రేషన్‌కార్డులు లేకుండా కొందరి పేర్ల మీద, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న కొందరి పేర్ల మీద ఇళ్లు మంజూరు అయినట్టు అధికారులు గుర్తించారు. పూర్తి విచారణ చేపట్టిన అధికారులు రూ.47 లక్షల వరకు అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈమేరకు సీబీసీఐడీ అధికారులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మనూరు మండలం శేరిదామరగిద్దలో 506 ఇళ్లు మంజూరు కాగా, అందులో రూ.25.92 లక్షలు అవినీతి జరిగినట్టు అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా ఇటీవల నారాయణఖేడ్‌లోని డీసీసీబీ బ్యాంకులో ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు సేకరించారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు 2004 నుండి 2014 వరకు హౌసింగ్ శాఖలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా విచారణ చేపట్టడంతో అవినీతికి పాల్పడ్డ వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మొదట జిల్లాలోని నాలుగు గ్రామాల్లోనే విచారణ జరుగుతున్నా, మిగితా గ్రామాల్లో అవినీతికి పాల్పడ్డ వారు కూడా ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు, పైరవీకారులు ఇళ్ల నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. హౌసింగ్ అధికారులు, కింది స్థాయి సిబ్బందితో పాటు నేతల అండదండలతో ఇష్టారీతిగా హౌసింగ్‌శాఖ సొమ్మును కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులకు ఇళ్ల బిల్లులు చెల్లించే క్రమంలో కూడా లంచాల పేరిట కొంత డబ్బు కాజేసినట్లు సీబీసీఐడి అధికారులు గుర్తించారు. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల అవకతవలపై విచారణ జరుగుతున్న తరుణంలో అవినీతి అధికారులు, నాయకులకు గుబులు పట్టుకుంది. ఏదిఏమైనా పూర్తి స్థాయి విచారణ జరిగి హౌసింగ్‌శాఖ అవినీతి బట్టబయలు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
పాత ఇళ్లకే బిల్లులు!
పెద్దేముల్: ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై గురువారం సీబీసీఐడీ అధికారులు మండల పరిధిలోని రేగొండిలో రెండోసారి విచారణ జరిపారు. గ్రామంలో మంజూరైన 291 ఇళ్లకు 290 ఇళ్లు పూర్తిగా నిర్మాణమైనట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. కాగా వీటిలో సగానికి పైగా పాత ఇళ్లకే అధికారులు బిల్లులు ఇచ్చినట్లు సీబీసీఐడీ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఉద్యోగస్తుల కుటుంబీకులకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, వాటిపై కూడా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకున్న కందనెల్లి వెంకటమ్మ, బంటు నర్సింలు, బంటు హన్మంతు, లక్ష్మమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మ, కొలుకుందె ఎల్లమ్మ, కోనేరు లక్ష్మి, కూర నర్సింలు, కె.వెంటకమ్మ, చంద్రకళ, కూర నర్సమ్మ తదితరుల ఇళ్లతో పాటు మొత్తం 50 ఇళ్లను సీబీసీఐడీ అధికారులు గురువారం పరిశీలించారు. జిల్లాలోని బషీరాబాద్, రేగొండి, కుల్కచర్లతో పాటు పలు గ్రామాల్లో తనిఖీలు చేశామని, ఒకే రేషన్ కార్డుపై కూడా రెండు ఇళ్లు మంజూరైనట్లు గుర్తించినట్లు సీబీ సీఐడీ అధికారులు చెప్పారు. పెద్దేముల్, బషీరాబాద్ తదితర మండలాల్లో ఇందిరమ్మ ఇళ్లపై విచారణ జరుపగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు గుర్తించామని, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇంటికి రూ.41,000 బిల్లు రావాల్సి ఉండగా అధికారులు కేవలం రూ.30 వేలు, 10 బస్తాల సిమెంట్ మాత్రమే ఇచ్చారని లబ్ధిదారులకు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలియచేశారు. అధికారులు చనిపోయిన వారి పేర్ల మీద బిల్లులు ఇస్తే చర్యలు తప్పవని సీబీసీఐడీ అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ప్రజలు స్వచ్ఛంధంగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమాలకు గ్రామస్తులు సహకరించరాదని పేర్కొన్నారు. కాగా అధికారుల తనిఖీలతో కొందరు లబ్ధిదారులు తమ ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. ఎంతటివారైనా చర్యలు తప్పవు.. ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని, అక్రమార్కులు ఎంతటివారైనా కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ అధికారులు హెచ్చరించారు. మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు తేలినా, అధికారులు-లబ్ధిదారులు కుమ్మకై ప్రభుత్వ ధనాన్ని పక్కదారి పట్టించినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. బిల్లులపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమాలు తెలుసుకునే క్రమంలో ఇళ్లు ఎప్పుడు నిర్మాణమయ్యాయనే విషయమై నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెంట సంబంధిత శాఖ ఇన్స్పెక్టర్లు జితేందర్‌రెడ్డి, రాజ్‌గోపాల్, తాండూరు హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లపై నిఘా
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో తవ్విన కొద్దీ అవినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సీబీసీఐడీ అధికారులే దిగ్భ్రాం తికి గురయ్యేలా సాగిన ఈ బాగోతంలో అసలు దోషులు త్వరలోనే బయట పడనున్నారు. జిల్లాలో వారం రోజులుగా సీబీసీఐడీ అధికారులు జట్లుగా విడిపోయి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి విచారణలో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇళ్ల కుంభకోణంపై ప్రభుత్వం థర్డ్ పార్టీతో చే యించిన విచారణలో వెలుగుచూసిన అక్రమాలకు తోడు కొత కోణాలు బయటపడటం చర్చనీయాంశం అవుతోంది. 16 మండలాలలోని 29 గ్రామాలలో సు మారుగా 2,705 ఇళ్ల పేరిట రూ.42.50 కోట్లు స్వాహా అయినట్లు థర్డ్ పార్టీ విచారణలో తేలగా, ఆరు మండలాలలో సీబీ సీఐడీ జరిపిన దర్యాప్తులో మరిన్ని అవకతవకలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలో అక్రమాలు జరిగిన లింగంపేట మండలం పొల్కంపేట, సదాశివనగర్ మండలం భూంపల్లికి సంబంధించిన నివేదికను తయారు చేసిన అధికారులు దానిని హైదరాబాద్ కు పంపనున్నారు. శనివారం సాయంత్రం వారు నిజామాబాద్ గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలోనూ పలువురిని విచారించారు. అంకెల గారడీపై ఆరా ఇందిరమ్మ గృహనిర్మాణ పథకంలో అధికారులు చేసిన అంకెల గారడీపైనా సీబీసీఐడీ ఆరా తీస్తోంది. ఈ పథకం కింద జిల్లాకు మొత్తం ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి ? లబ్ధిదారుల సంఖ్య ఎంత? ఒక్కొక్క కుటుంబంలో ఎందరి పేరిట ఇళ్లు మంజూరయ్యాయి? తదితర వివరాలను తెలుసుకుంటున్నారు. అధికారిక రికార్డుల ప్రకారం జిల్లాలో 5,91,033 కుటుంబాలు, 5,90,445 ఇళ్లు ఉన్నాయి. ఇందులో 22,717 ఇళ్లు శిథిలావస్థలో ఉండగా, ఇప్పటి వరకు ఇందిరమ్మ పథకంలో 2.80 లక్షల ఇళ్లు మం జూరు చేశారు. ఇందులో 1,27,121 ఇళ్లు కట్టామని, ఇంకో 1.51,984 ఇళ్లకు నిధులు మంజూరైనా పెండింగ్‌లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కుటుం బాల సంఖ్య, మంజూరైన ఇళ్ల సంఖ్యకు, అధికారుల వివరాలకు అసలు పొంతన కుదరడం లేదు. దీనిపైనే సీబీసీఐడీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో వా రు గృహ నిర్మాణ సంస్థ జిల్లా మాజీ మేనేజర్ జ్ఞానేశ్వర్రావుతోపాటు అయన హయాంలో పనిచేసిన ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలపైనా ఆరా తీస్తుండటం కలక లం రేపుతోంది. రికార్డులు స్వాధీనం ప్రగతినగర్ : ఐపీఎస్ అధికారి చారుసిన్హా నేతృత్వంలోని ఆరుగురు అధికారుల సీబీసీఐడీ బృందం ‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ జరుపుతోంది. ముందుగా ఎల్లారెడ్డి నియెజకవర్గంలోని లింగంపేట్ మండలం పోల్కంపేట్, సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామాలలో విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐలు ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్, ఎస్ఐ సాల్మన్‌రాజు ఇక్కడ పూర్తి సమాచారాన్ని సేకరించారు. పోల్కంపేట్లో 177 మంది లబ్ధిదారులు, భూంపల్లిలో 531 మంది లబ్ధిదారుల గురించి ఆరా తీశారు. అనంతరం భోదన్‌లో క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి పూర్తి సమాచారాన్ని సేకరించారు. సేకరించిన సమాచారాన్ని గోప్యంగా హైదరాబాద్‌కు పంపించారు. శనివారం మధ్యాహ్నం సీఐడీ ఎస్ఐ సల్మాన్ రాజు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాలయం నుంచి పోల్కంపేట్, భూంపల్లికి సంబందించిన రికార్డులు స్వాధీనం చేసు కున్నారు. ఈ నెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వే అనంతరం తిరిగి అన్ని గ్రామాలలో విడతలవారీగా విచారణ కొనసాగించనున్నారు. -
‘ఇంటి’ దొంగల్ని పట్టేద్దాం!
‘ఇందిరమ్మ’ పథకంలో అక్రమాలపై సీబీసీఐడీ విచారణ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘ఇందిరమ్మ ఇళ్ల’ నిర్మాణంలో అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. బినామీలు, ప్రజాప్రతినిధుల మిలాఖత్‌తో ఈ పథకం పక్కదారి పట్టిందని భావించిన ప్రభుత్వం.. అక్రమాలను వెలికితీయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన విచారణ బాధ్యతను సీబీసీఐడీకి అప్పగించింది. ఇందులో భాగంగా బుధవారం సీబీసీఐడీ అధికారులు జిల్లా హౌసింగ్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును పరిశీలించే క్రమంలో భాగంగా జిల్లాలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రికార్డులు, ఆన్లైన్ రిపోర్టులను వారు స్వాధీనం చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయి సమాచారం సేకరించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా 2008-09 సంవత్సరంలో జిల్లాలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం థర్డ్‌పార్టీతో విచారణ చేయించింది. జిల్లావ్యాప్తంగా 20,707 గృహాలను పరిశీలించగా 2,350 ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తేలింది. వీటిలో 133 ఇళ్లకు రెండుసార్లు చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. అసలు నిర్మాణ పనులే చేపట్టకుండా 47మంది పేరిట బిల్లులు క్లియర్ చేసినట్లు పసిగట్టారు. ఎనిమిది పాత ఇళ్లకు మెరుగులు దిద్ది బిల్లులు స్వాహా చేసినట్లు తేల్చారు. మరో 313 మంది లబ్ధిదారులకు లెక్కకు మించి చెల్లింపులు చేశారు. 105 మంది లబ్ధిదారుల పేర్లు రెండుసార్లు నమోదుచేసి నిధులు కైంకర్యం చేశారు. మొత్తంగా సర్వేచేసిన వాటిలో 11 శాతం అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు రూ. 80.74లక్షలు పక్కదారి పట్టినట్లు నిగ్గుతేల్చారు. ప్రతి ఇంటింటి లెక్క పరిశీలన.. ‘ఇందిరమ్మ’ పథకంలో భాగంగా జిల్లాలో మూడు విడతలుగా 2.09లక్షల ఇళ్లను మంజూరు చేశారు. దశాలవారీగా మంజూరుచేసిన ఇళ్లలో పావువంతు నిర్మాణాలు మొదలుకాలేదు. అయితే పనులు చేపట్టిన, పూర్తిచేసిన వాటిల్లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో విచారణ మొదలుపెట్టిన అధికారులు బుధవారం కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తనిఖీ ప్రక్రియ మరింత పకడ్భందీగా చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి సంబంధించిన రికార్డు పరిశీలించనున్నట్లు తెలిసింది. మొత్తంగా అక్రమాల లోగుట్టు పూర్తిస్థాయిలో తేల్చేందుకు సీబీసీఐడీ చర్యలు వేగిరం చేసింది. మరో రెండు రోజుల్లో జిల్లా హౌసింగ్ శాఖలో లోతైన పరిశీలన చేయనున్నట్లు సమాచారం. -
తవ్వేకొద్దీ అవినీతి!
కర్నూలు(కలెక్టరేట్) : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. కోట్లాది రూపాయలతో ముడిపడిన ఈ పథకంలో తవ్వేకొద్దీ అవినీతి వెలుగు చూస్తోంది. ఎవరి స్థాయిలో వారు దొరికిన కాడికి దోచుకుంటున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 9,798 మంది ఈ కోవలో ఉన్నారంటే అవినీతి ఏ స్థాయిలో చోటుచేసుకుందో అర్థమవుతోంది. జిల్లాలో 2007 సంవత్సరం నుంచి పథకం అమలవుతుండగా.. ఇప్పటి వరకు రూ.1,650 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి సగటున రూ.235 కోట్లు వ్యయమైంది. ఇంత చేసినా ఎక్కడా ఆ పనుల జాడ లేకపోవడం గమనార్హం. జిల్లాలో వెలుగుచూసిన అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఎక్కడా లేని విధంగా సీబీసీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా రూ.124.9 కోట్ల దుర్వినియోగం వెలుగుచూసింది. పథకంలోని అక్రమాలపై యేటా సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఏడో విడత తనిఖీ కొనసాగుతుండగా.. రూ.756.9 కోట్లు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. మొత్తం 7.50 లక్షల జాబ్ కార్డుల్లో అత్యధికం బోగస్‌వేనని తెలుస్తోంది. చనిపోయిన.. విద్యార్థులు.. ఉద్యోగుల పేర్లతో జాబ్ కార్డులు సృష్టించి కొందరు సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. అక్రమాలపై విచారణ చేపట్టి శిక్షించేందుకు మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు మూడేళ్లుగా ప్రచారంలో ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. మొబైల్ కోర్టుల ప్రచారం నేపథ్యంలో అక్రమార్కులను మూడు కేటగిరీలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి మొబైల్ కోర్టుల్లో సత్వరం విచారణ జరిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే కోర్టును ఏర్పాటు చేయకపోవడంతో అక్రమార్కులు మరింత చెలరేగుతున్నారు. సామాజిక తనిఖీల్లో రూ.795 కోట్లు దుర్వినియోగమైనట్లు తేలినా.. అధికారులు కేవలం గ్యాప్‌లు మాత్రమేనంటూ అవినీతి మొత్తాన్ని రూ.8,68,06,259కు కుదించడం గమనార్హం. ఈ మొత్తంలోనూ రూ.1.79 కోట్లు మాత్రమే రికవరీ చేయడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. అవినీతిలో టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు అగ్రస్థానం అక్రమించారు. అధికారికంగానే టెక్నికల్ అసిస్టెంట్లు రూ.2.18కోట్లు.. ఫీల్డ్ అసిస్టెంట్లు రూ.1.41 కోట్లు స్వాహా చేసినట్లు స్పష్టమైంది. వెల్దుర్తి, కృష్ణగిరి, ఎమ్మిగనూరు, పాములపాడు, పత్తికొండ, ప్యాపిలి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు, మద్దికెర తదితర మండలాల్లో నిధుల దుర్వినియోగం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమాలకు కళ్లెం వేయలేని పరిజ్ఞానం: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎన్ఆర్ఈజీఎస్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావించినా ఫలితం లేకపోయింది. జాబ్ కార్డు వెరిఫికేషన్ చేపట్టినా తూతూమంత్రంగా సాగింది. జిల్లాలో 2.15 లక్షల బోగస్ జాబ్ కార్డులు ఉన్నట్లు మాత్రమే తేల్చగలిగారు. ఈఎంఎంఎస్, ఈ-మెజర్మెంట్ విధానాలను అమల్లోకి తీసుకొచ్చినా.. ఆన్లైన్ పేమెంట్ చేపడుతున్నా అక్రమాలను అడ్డుకోలేకపోవడం గమనార్హం. అక్రమాలను తగ్గిస్తున్నాం - హరినాథ్‌రెడ్డి, డ్వామా పీడీ ఎన్ఆర్ఈజీఎస్లో అక్రమాలను తగ్గిస్తున్నాం. పీడీగా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజోపకర పనులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. డంపింగ్ యార్డులు, పండ్ల తోటల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించం. ఇప్పటికే బాధ్యులపై చర్యలు మొదలుపెట్టాం. దుర్వినియోగం చేసిన మొత్తాన్ని రికవరీ కూడా చేస్తున్నాం.