illegality
-
NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: మదర్సాల్లో విద్యార్థులకు సరైన విద్య బోధించడం లేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు మదర్సాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడి పాఠ్యపుస్తకాల్లో అభ్యంతకర అంశాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో తాజాగా సమగ్ర అఫిడవిట్ సమరి్పంచింది. నాణ్యమైన, సమగ్రమైన విద్య పొందడం బాలల ప్రాథమిక హక్కు కాగా, ఆ హక్కు మదర్సాల్లో ఉల్లంఘనకు గురవుతోందని ఆక్షేపించింది. విద్యాహక్కు చట్టం–2009 సైతం ఉల్లంఘనకు గురవుతున్నట్లు తెలియజేసింది. మదర్సాల్లో తగిన విద్యా బోధన జరగకపోగా, మరోవైపు ఆరోగ్యకరమైన వాతావరణం, జీవితంలో పైకి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడం లేదని అఫిడవిట్లో స్పష్టంచేసింది. బిహార్, మధ్యప్రదేశ్, పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో ముస్లిమేతరులను సైతం చేర్చుకొని, ఇస్లామిక్ మత విద్య బోధిస్తున్నారని తప్పుపట్టింది. ఇలా చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)కు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. ‘‘మదర్సాల్లో బోధిస్తున్న విద్య పిల్లలకు పూర్తిగా ఉపయోగపడేది కాదు. అక్కడ సరైన పాఠ్యప్రణాళిక లేదు. విద్యాహక్క చట్టం సెక్షన్ 29లో పేర్కొన్న మూల్యాంకన విధానాలు అమలు కావడం లేదు. అర్హత లేదని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. నిధుల విషయంలోనూ పారదర్శకత కనిపించడం లేదు. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రమాణాలను లెక్కచేయకుండా చాలావరకు మదర్సాలు సొంతంగానే ఉపాధ్యాయులను నియమించుకుంటున్నాయి. వారికి తగిన విద్యార్హతలే ఉండడం లేదు. మదర్సాల్లో సంప్రదాయ విధానాల్లో ఖురాన్‌తోపాటు ఇతర మత గ్రంథాలు బోధిస్తున్నారు. ఇదంతా అసంఘటితమైన, అసంబద్ధమైన విద్యా వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. పాఠ్యాంశాలు అభ్యంతకరంగా ఉంటున్నాయి. అత్యున్నత మతం ఇస్లాం మాత్రమే అని పిల్లల మెదళ్లలోకి ఎక్కిస్తున్నారు’’ అని పేర్కొంది. -
Pakistan Supreme Court: చట్టవిరుద్ధం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. అల్–ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెసుŠట్ చేసి జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్ఏబీ) కస్టడీలో ఉంచడాన్ని పాక్ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. ‘ ఇమ్రాన్‌ను అరెస్ట్చేయడం పూర్తిగా చట్టవ్యతిరేకం. ఆయనను వెంటనే విడుదల చేయండి. విడుదలయ్యాక ఇస్లామాబాద్‌లో సురక్షిత ప్రాంతంలో ఉంచి రక్షణ కల్పించండి’అని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఇస్లామాబాద్ హైకోర్టులో అరెస్టయిన ఇమ్రాన్‌కు పెద్ద ఉపశమనం లభించింది. గంటలో హాజరుపరచండి అంతకుముందు మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో లాక్కెళ్లి అరెస్ట్ చేయడాన్ని ఇమ్రాన్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఆ పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఎన్ఏబీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘గంటలోగా ఇమ్రాన్‌ను మా ముందుకు తీసుకురండి’ అని మధ్యాహ్నం 3.30కి ఎన్ఏబీని ఆదేశించింది. దీంతో వెంటనే ఖాన్‌ను కోర్టుకు తీసుకొచ్చారు.‘హైకోర్టు రిజిస్ట్రార్ అనుమతి లేకుండా ఒక వ్యక్తిని కోర్టు ప్రాంగణంలో ఎలా అరెస్ట్ చేస్తారు? న్యాయం కోసం కోర్టుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేస్తారా? ఒకవేళ కోర్టులో లొంగిపోవడానికే వస్తుంటే అరెస్ట్ చేయడంలో అర్థమేముంది? అరెస్ట్ చేసేందుకు ఏకంగా 90 మంది పోలీసులు కోర్టులో చొరబడితే హైకోర్టుకు ఏం విలువ ఇచ్చినట్టు? అని అధికారులపై ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అతా బందియాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తదుపరి న్యాయపర ఆదేశాల అభ్యర్థన కోసం శుక్రవారం ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లండి. ఆ కోర్టు నిర్ణయమే తుది నిర్ణయం’ అని ఇమ్రాన్‌కు సుప్రీంకోర్టు సూచించింది. అరెస్ట్‌తో రణరంగంలా మారిన పాక్‌లో ఇప్పటిదాకా ఎనిమిది మంది చనిపోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు. కాగా, ‘ఒక నేరగాడిని విడుదల చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. నేరగాడికి రక్షణ కవచంగా ఉంటూ దేశంలో చెలరేగుతున్న హింసకు మరింత ఆజ్యం పోస్తున్నారు’ అని పాకిస్తాన్ ముస్లింలీగ్–నవాజ్ పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ఆరోపించారు. -
స్వలింగ వివాహాలు చట్ట విరుద్ధమే! కేంద్ర ప్రభుత్వం స్పందన ఇదే..
న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి వివాహాలను చట్టబద్ధంగా గుర్తించడం అనేది వ్యక్తిగత చట్టాలు, ఆమోదయోగ్యమైన సామాజిక విలువల మధ్య సమతూకాన్ని దెబ్బతీస్తుందని వెల్లడించింది. అందుకే చట్టబద్ధత కల్పించలేమని వివరించింది. స్వలింగ వివాహాలు ముమ్మాటికీ చట్టవిరుద్ధమేనని పరోక్షంగా తేల్చిచెప్పింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. ఐపీసీ సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కం నేరం కాదని తేల్చినప్పటికీ.. స్వలింగ వివాహాన్ని చట్టబద్ధంగా గుర్తించడాన్ని ప్రాథమిక హక్కుగా పిటిషనర్లు కోరలేరని స్పష్టం చేసింది. స్త్రీ–పురుషుడి సంబంధాలు, వేర్వేరు వ్యక్తుల నడుమ వ్యక్తిగత అవగాహనతో ఏర్పడే సంబంధాలు చట్టవ్యతిరేకం కాదని అఫిడవిట్లో కేంద్రం వెల్లడించింది. స్వలింగ సంపర్కుల సహజీవనం నేరం కాదు ఇద్దరు స్త్రీలు లేదా ఇద్దరు పురుషుల నడుమ జరిగిన పెళ్లికి వ్యక్తిగత చట్టాలు లేదా రాజ్యాంగబద్ధమైన చట్టాల కింద చట్టబద్ధత కల్పించడం, గుర్తించడం సాధ్యం కాదని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కులు కలిసి జీవించడం నేరం కాదని వెల్లడించింది. కానీ, దీన్ని భార్య, భర్త, పిల్లలతో కూడిన భారతీయ కుటుంబ యూనిట్‌తో పోల్చలేమని కేంద్రం అభిప్రాయపడింది. ఒకవేళ స్వలింగ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే అది ప్రస్తుతం ఉన్న వ్యక్తిగత చట్టాలను, నోటిఫైడ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని వివరించింది. -
మేనకోడలిని దారుణంగా చంపేశాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు, ఆకృత్యాలు మాత్రం ఆగటంలేదు. తాజాగా, యూపీలో ఒక వ్యక్తి తన మేనకోడలిని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం, యూపీలోని బులంద్‌షహర్ జిల్లాకు చెందిన వినీత్ అనే వ్యక్తి తన మేనకోడలితో వివాహేతర సంబంధాన్నికలిగి ఉన్నాడు. కాగా, ఆ మహిళకు ఇది వరకే పెళ్ళిఅయి ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరు కలసి నోయిడాలోని తమ బంధువుల ఇంటికి చేరుకున్నారు. అయితే ఆ మహిళకు అత్తవారింటి నుంచి ఒత్తిడి రావడంతో ఆమె తిగిరి వాళ్ళింటికి చేరుకుంది. వినీత్‌ను అతని సోదరి ఇంటికి పంపించేశారు. కాగా, వినీత్ తన మేనకోడలిపై కోపం పెంచుకొన్నాను. తనను కావాలనే మోసం చేసిందని ఆమె ఇంటికి చేరుకొన్నాడు. ఈ క్రమంలో పదునైన కత్తితో ఆమెపై దాడిచేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను బంధువులు దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోరికను తీర్చాలన్న కామాంధుడికి యావజ్జీవం! -
60 లక్షల నకిలీ ఓటర్లు!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 230 నియోజకవర్గాల్లో 60 లక్షల నకిలీ ఓటర్లను ప్రభుత్వం నమోదుచేసిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ నేతృత్వంలో ఈసీని ఆదివారం కలసిన కాంగ్రెస్ బృందం.. నకిలీ ఓటర్లకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించింది. ఈ 60 లక్షల పేర్లను వెంటనే ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నకిలీలను తొలగించేందుకు ప్రత్యేకమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఈసీకి మరోసారి విజ్ఞప్తి చేసింది. -
అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించం
పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో అక్ర మాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. శనివారం రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాఖ పనితీరు మెరుగుపడిందన్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) గణనీయ ప్రగతి సాధిం చిందని తెలిపారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రతిపా దనలు చేయగా.. ఇప్పటివరకు 15.28లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయిందన్నారు. ఇందులో 15 లక్షల మెట్రిక్ టన్నులు మిల్లింగ్కి ఇచ్చామని, శని వారం నాటికి 5.85 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లోకి చేరిందని తెలిపారు. మిగిలిన బియ్యాన్ని వీలైనంత త్వరగా అందించాలని మిల్లర్లను ఆదేశించామన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇస్తున్నామని, ఓపెన్ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో సీఎంఆర్ పద్ధతిలో బియ్యా న్ని సేకరిస్తున్నామన్నారు. దీనివల్ల రైతులకు సైతం మద్దతు ధర అందుతుందన్నారు. పేద విద్యార్థులకు అందించే బియ్యంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మంత్రి ఇలాఖాలో మరో ప్యూను డాన్ శీను
‘సంపూర్ణ’ సహకారంతో ఇసుక సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతో శాసిస్తున్న జిల్లాకు చెందిన ఓ ముఖ్య ప్రజాప్రతినిధి.. లిక్కర్ సిండికేట్‌ను సైతం తన చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. ఇందుకు ఆయన అడుగులకు మడుగులొత్తేది ఎవరో కాదు... మద్యం వ్యాపారుల అసోసియేషన్‌లోని ఓ నేత. ఇతన్ని ఆ వర్గంలోని వారందరూ ‘డాన్ శీను’ అని పిలుస్తుంటారు. మద్యనిషేధం సమయంలో కటకటాల్లెక్కించిన ఈయనగారి హవా ఇప్పుడు ఓ వెలుగు వెలుగుతోంది. అది ఎంతగా అంటే... ఎక్సైజ్ అధికారులనే శాసించేంత. మద్యం వ్యాపారుల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ఈయన ‘సీను’ ఇదీ... కలెక్షన్ కింగ్-2 - మంత్రిగారి ఆదేశాలతో అడ్డగోలు వసూళ్లు - ఎమ్మార్పీకి అమ్మకుండా ఉండేందుకు తాయిలాలు - దుకాణానికి రూ.25వేల నుంచి రూ.50వేలు డిమాండ్ - ఎదురు ప్రశ్నిస్తే దాడులే - అధికారులు అడిగితే శంకరగిరి మాన్యాలే.. - నోరు మెదపని ఎక్సైజ్ శాఖ మంత్రి సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాకు చెందిన ఓ మంత్రి అక్రమాలకు అంతులేకుండా పోతోంది. ఇసుక సిండికేట్లు మొదలు అధికారుల బదిలీల వరకు కలెక్షన్లకు పాల్పడటమే కాకుండా ఈ వ్యవహారమంతా చూసుకునేందుకు ఇప్పటికే ‘పరిపూర్ణ’ కలెక్షన్ కింగ్‌ను నియమించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి శాఖలోనూ తన అనుచరులను ఏర్పాటు చేసుకుని ఆ మంత్రి కోట్లు సంపాదిస్తున్నారనే విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఈ మంత్రి విషయంలో సాక్షాత్తూ జిల్లాకు చెందిన ఎక్సైజ్ మంత్రి కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని ఆయన అనుచరగణం వాపోతోంది. అసోసియేషన్ అండతో.. జిల్లా మద్యం వ్యాపారుల అసోసియేషన్‌లో నాయకుడిగా ఉంటూ లిక్కర్ ‘డాన్ శ్రీను’గా గుర్తింపుపొందిన ఈయన మంత్రికి అత్యంత సన్నిహితుడు. మంత్రి సహాయంతోనే లిక్కర్ సిండికేట్లలో చక్రం తిప్పి కోట్ల రూపాయలు గడిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ లిక్కర్ డాన్ గతంలో మద్య నిషేధ సమయంలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయిన వ్యక్తి. దీంతో ఆ తరువాత ఈ రంగంలో అనుభవం గడించాడని, ఇప్పుడు ఏకంగా అసోసియేషన్‌లో కీలకం కావడంతో వీరి ఆదాయం మూడు బార్లు... ఆరు కలెక్షన్లుగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి ఎన్నికల సమయంలో ఖర్చుల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలకు అయ్యే ఖర్చులు వంటి వాటిని కూడా ఈ నాయకుడే చూశాడని సమాచారం. ఎక్సైజ్ అధికారులు కూడా వీరి కనుసన్నల్లోనే పనిచేయాలని, లేకపోతే రాయలసీమ జిల్లాలకు బదిలీ చేయిస్తారని ఆ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలిసిన పచ్చినిజం. ఈయన అనుగ్రహం పొంది లక్షలు సమర్పించుకుంటే కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పదవులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు చెప్పుకొంటున్నాయి. తోటి సిండికేట్లపై దాడులు తమ మాట వినని సిండికేట్లపై అధికారులతో దాడులు చేయించి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు ఈ డాన్ శ్రీను ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బెంజిసర్కిల్ సమీపంలోని ఒక బార్‌పై ఏడాదిలో మూడుసార్లు దాడులు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఏడాది కాలంగా నగరంలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం అమ్మకుండా ఉండేందుకు ఒక్కో బ్రాంది దుకాణం నుంచి రూ.25వేల నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ఇక ప్రభుత్వం పెట్టే మద్యం దుకాణాలు తమ ఏరియాల్లో పెట్టకుండా చూస్తామంటూ మద్యం వ్యాపారులను ఈ నాయకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. తన ప్రమేయం లేదని చెబుతూనే అధికారులపైనే ఆయన సీరియస్ అవుతారని తెలిసింది. మంత్రితో తనకున్న పరిచయాలను తన సన్నిహితులకు, మిగిలిన మద్యం వ్యాపారులకు తెలిసేందుకు ఏడాదికి ఒకసారి మంత్రిని కుటుంబసభ్యులతో సహా ఆహ్వానించి స్నేహితులు, సన్నిహితులతో భోజనాలు ఏర్పాటుచేస్తారని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా స్థిరపడి.. మద్యం సామ్రాజ్యంలో అంచెలంచెలుగా ఎదుగుతూ, మంత్రి అండదండలతో కోట్లకు పడగలెత్తిన ఈ నాయకుడు ఇప్పుడు బినామీ పేర్లతో ఆస్తులు కూడబెడుతున్నాడని, గుణదలతో పాటు రాజధాని ప్రాంతంపైనా కన్నువేశాడని చెబుతున్నారు. -
‘జియోట్యాగింగ్’తో అక్రమాలకు చెక్
- ఇకనుంచి ఆన్లైన్లో మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి - అందుబాటులోకి కొత్త విధానం - త్వరలో గద్వాలలో అమలు గద్వాల : మరుగుదొడ్ల నిర్మాణాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఇక నుంచి ఉండదు. ఏది నిర్మించకపోయినా బిల్లులు మంజూరు చేయిం చుకోవడం కుదరదు. పాతవాటిని చూపి కొత్తగా నిర్మించామని చెప్పినా ఎవరూ పట్టిం చుకోరు. వీటి నిర్మాణాల్లో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జియోట్యాగింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గద్వాల పట్టణంలో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం తాజాగా రూ.25లక్షలు మంజూరు చేసింది. నిర్మాణాల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా నిఘా ఉంచేందుకు జియోట్యాగింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయనుంది. లబ్ధిదారులు గుంత తవ్విన నాటి నుంచి పూర్తయ్యే వరకు గల ఫొటోలు ఆన్లైన్లో అనుసంధానం చేస్తారు. దీనికోసం త్వరలో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను సైతం రూపొందించనున్నారు. పురపాలకశాఖ అధికారులు, సిబ్బంది వీటి నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెబ్సైట్లో నమోదు చేస్తారు. మరుగుదొడ్డి నిర్మించిన స్థలంతోపాటు ప్రాంతం తదితర వాటిని సైతం పరిగణలోకి తీసుకుంటారు. దీంతో లబ్ధిదారులు నిర్మించుకునే మరుగుదొడ్లు పూర్తయ్యే వరకు ఆన్లైన్లో కనిపిస్తాయి. దీంతో పాతవాటిని చూపించి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. దీంతో అర్హులకు న్యాయం జరిగే అవకాశముంది. పట్టణంలో 1,100 లబ్ధిదారుల గుర్తింపు పట్టణంలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంటుంది. లబ్ధిదారులకు సంబంధించి వివరాల నమోదు నెమ్మదిగా సాగుతుండడంతో వీటి నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పట్టణంలో మరుగుదొడ్లు లేనివారు సుమారు రెండువేల మంది ఉన్నట్లు తేలింది. వీరికి మరుగుదొడ్ల మంజూరు పత్రాలను అందించేందుకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పటిదాకా 1,300మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను విచారించిన అధికారులు 1,100మంది అర్హులున్నట్లు తేల్చారు. గత నెలలో కాలనీల వారీగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. త్వరలో వీటి నిర్మాణాలను పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చెల్లింపులు ఇలా.. ప్రభుత్వం ఒక్కో మరుగుదొడ్డికి రూ.12వేలు అందజేస్తోంది. వీటిని రెండు విడతల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేయనున్నారు. బేస్మెంట్, సెప్టిక్‌ట్యాంక్ నిర్మాణం పూర్తయితే రూ.6 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం మొత్తం పూర్తయితే మరో రూ.6 వేలు అందజేయనున్నారు. త్వరలో నిర్మాణాలు పూర్తిచేస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాల కోసం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలు కూడా అందజేశాం. కొన్నివార్డుల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే అన్నివార్డుల్లో నిర్మాణాలు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. -నాగేంద్రబాబు, ఇన్చార్జి కమిషనర్, గద్వాల మున్సిపాలిటీ -
అక్రమాల నిగ్గు తేల్చేందుకు సన్నద్ధం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: క్షేత్రస్థాయిలో మొక్కలు ఉన్నాయో లేవో చూడకుండా ఇష్టారీతిన ఒకేసారి పెద్దమొత్తంలో చెల్లింపులు, పూర్తి స్థాయిలో పనులు జరగకుండానే చెరువు గ ట్టు అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు, పని దినాలకు మించి మస్తర్లు వేసి పెద్ద ఎత్తున వేతనాలు డ్రా చేయడం వంటి పరిణామాలు తెర్లాం మండలంలో బయటపడ్డాయి. అంతా కుమ్మక్కయ్యే ఇదంతా చేశారన్న అభిప్రాయానికి అధికార వర్గాలొచ్చాయి. ఈ ఒక్క మండలంలోనే రూ.50 లక్షల మేరకు అవినీతి జరిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. దీనికంతటికీ మండల స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. అందుకనే తెర్లాం వ్యవహారంలో ఎంపీడీఓను సైతం బాధ్యుడ్ని చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంపీడీఓలకు నోటీసులివ్వడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నతాధికారులున్నారు. తెర్లాం వ్యవహారంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కూడా ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దిశగా విచారణతో పాటు నివేదిక తయారవుతోంది. ఈ అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా తనిఖీలు, పరిశీలన చేయాలని డ్వామా వర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు ప్రత్యేక బృందాల్ని నియమిస్తున్నాయి. అనుమానం వచ్చిన చోట ముందుగా తనిఖీలు చేయనున్నారు, ఆ తరువాత మిగతా చోట్ల దశల వారీగా పరిశీలన చేయాలని యోచిస్తున్నారు. పరిశీలనకు సంబంధించి ఒక నమూనా తయారు చేసినట్టు తెలిసింది. ఉన్నతాధికారులిచ్చిన నమూనా ప్రకారం క్షేత్రస్థాయి అధికారులు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా రంగంలోకి దిగనున్నారు. ఇంకోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా తనిఖీలు చేయనుంది. తెర్లాం తరహా భాగోతం ఎక్కడెక్కడ జరిగిందో నిగ్గు తేల్చేందుకు సిద్ధమవుతున్నాయి. కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కూడా సీరియస్‌గా ఉన్నారు. ఆరోపణలొచ్చినా, అభియోగాలు నిర్ధారణైనా వెంటనే చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. కొంతమందిని ఏరిపారిస్తే తప్ప అక్రమార్కులు అదుపులోకి రారని భావిస్తున్నారు. -
నామ్‌కే వాస్తేగా హౌస్ కమిటీలు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన శాసనసభాసంఘాలు (హౌస్ కమిటీలు) నామమాత్రంగా మారాయన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూసంబంధ వ్యవహారాల్లో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు జనవరిలో మూడు హౌస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూముల కబ్జా, అక్రమ విక్రయాలు, కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతం తదితర అంశాల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి ఈ కమిటీలు అసెంబ్లీకి నివేదికలు సమర్పించాల్సి ఉంది. మూడు నెలల కాలపరిమితితో ఏర్పాటైన ఈ కమిటీలు ఇప్పటి వరకూ ఒక్కోసారి మాత్రమే భేటీ అయ్యాయి. మేడ్చెల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాైటైన కమిటీ ప్రభుత్వ, దేవాదాయ, భూదాన్, సీలింగ్ మిగులు, ఇనాం భూములు ఏమేర అన్యాక్రాంతమయ్యాయో లెక్క తేల్చాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములపై నిగ్గుతేల్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ కూడా నామమాత్రంగానే మిగిలింది. -
‘మహా’ మలుపు
- హెచ్ఎండీఏలో సంస్కరణలకు శ్రీకారం - అక్రమార్కుల భరతం పట్టడమే లక్ష్యం - మహా నగరాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ సాక్షి, సిటీబ్యూరో: అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను సమూలంగా సంస్కరించే పనికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపక్రమించారు. సంస్థ ప్రతిష్టను దిగజార్చిన ప్రణాళికా విభాగంలోని కొందరు అధికారుల భరతం పట్టడంతో పాటు పూర్వ వైభవం తెచ్చేందుకు హెచ్ఎండీఏ పాలనా పగ్గాలను సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలిని మిశ్రాకు అప్పగించారు. అనుమతుల విషయంలో పారదర్శకతతో... అవినీతి రహితంగా... ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా సీఎం కొత్త విధానాలకు పూనుకున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధమవుతున్న తరుణంలో హెచ్ఎండీఏలో అవినీతి, అక్రమాలపై భారీగా ఫిర్యాదులు అందాయి. అదే సమయంలో ఏసీబీ దాడులు... అక్రమాలకు అడ్డుకట్ట పడ కపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఒక దశలో అసలు హెచ్ఎండీఏని ఏకంగా రద్దు చేయాలన్న దిశగా సమాలోచనలు చేసినట్లు వినికిడి. అయితే... హైదరాబాద్‌కు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఈ పని సరికాదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల జాబితా తెప్పించుకున్న సీఎం దశల వారీగా వారిపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒత్తిళ్లకు తలొగ్గకుండా... ఈ ఆపరేషన్‌లో నిజాయితీపరులు బలికాకుండా చూసే బాధ్యతను కొత్త కమిషనర్ శాలినీ మిశ్రాపై పెట్టినట్లు వినవస్తోంది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించి.. అక్రమార్కులను ఏరివేయడంతో పాటు హెచ్ఎండీఏను గాడిలో పెట్టేందుకు ఆయన మార్గనిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. నగరం చుట్టు పక్కల 4 జిల్లాల పరిధిలోని 35 మండలాలను కలుపుతూ (849 గ్రామా లు) 7,257 చ.కి.మీ. మేర విస్తరించిన హెచ్ఎండీఏను అత్యున్నత ప్రణాళికా సంస్థగా తీర్చిదిద్దాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. అవసరమైతే మాస్టర్‌ప్లాన్‌లో మార్పులూ చేర్పులకూ వెనుకాడవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అక్రమాలపై దృష్టి భూ వినియోగ మార్పిడి (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్) ఫైళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఉప్పందడంతో సీఎం ఆ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారు. నిజానికి ఈ అధికారం హెచ్ఎండీఏ పరిధిలో లేదు. నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో బడా రియల్టర్లు శివారు ప్రాంతాల్లో వందల ఎకరాలు కొనుగోలు చేసి సులభంగానే భూ వినియోగ మార్పిడి చేసుకుంటున్నారు. కన్జర్వేషన్ (అగ్రికల్చర్) జోన్ నుంచి రెసిడెన్షియల్‌కు... రెసిడెన్షియల్ జోన్ నుంచి కమర్షియల్‌కు ఎడాపెడా భూ వినియోగ మార్పిడి జరిగిపోయింది. దీనికి హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన కొందరు అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్ కనెక్టివిటీ వంటివి లేకపోయినా చిన్నపాటి మార్పులతో పక్కాగా ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. నిబంధనల మేరకు అన్నీ సరిగ్గా ఉండటంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ వెంటనే అనుమతి ఇచ్చేస్తోంది. ఈ కార్యాన్ని చక్కబెట్టినందుకు ప్లానింగ్ విభాగంలో కొందరు అధికారులు రూ.కోట్లలో దండుకొంటున్న విషయం ప్రభుత్వం పసిగట్టింది. ఇలా ఒక్క లేఅవుట్‌కు అనుమతిచ్చినందుకు గతంలో ఓ కమిషనర్ రూ.5 నుంచి 10 కోట్లు వసూలు చేసిన విషయం సీఎం దృష్టికి వచ్చింది. దాంతో హెచ్ఎండీఏ అంటేనే అక్రమాల పుట్ట అన్న భావన ఆయనలో బలంగా నాటుకొంది. దీన్ని సంస్కరించేందుకు ప్రదీప్ చంద్ర లాంటి సీనియర్ అధికారులను నియమించినా అక్రమాలు ఆగలేదు. అసలు ఆ సంస్థ అధికారాలను తప్పించి వాటిని ప్రభుత్వం చేతిలోకి తీసుకోవాలని ఓ దశలో సీఎం భావించినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుమతిచ్చిన ఫైళ్లను పునఃపరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే...ఇందులో బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, రియల్టర్లు ఉండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్త కమిషనర్‌గా శాలినీ మిశ్రా పగ్గాలు చేపట్టనుండటంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని అక్రమార్కులు హడలిపోతున్నారు. కొత్త సారథిగా శాలినీ మిశ్రా హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ నూతన సారథిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి శాలినీ మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో గత 9 రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడినట్లయింది. ఈ నెల 12న జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో హెచ్ఎండీఏకు ఇన్చార్జి కమిషనర్‌గా బి.జనార్దన్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజులు దాటినా ఆయనకు ప్రస్తుత ఇన్చార్జి కమిషనర్ ప్రదీప్ చంద్ర చార్జి ఇవ్వకపోవడంతో హెచ్ఎండీఏను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారేమోనన్న వదంతులు చెలరేగాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్‌గా శాలినీ మిశ్రాను నియమిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. -
‘అక్రమార్కుల’పై క్రిమినల్ కేసులు
- సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి. కుల్కచర్ల:‘ఇందిరమ్మ’ ఇళ్ల బిల్లులలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీబీసీఐడీ డీఎస్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో సీబీసీఐడీ అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై ఆరోసారి విచారణ చేపట్టారు. గ్రామానికి రెండో విడతలో 524 ఇళ్లు మంజూరయ్యాయి. అందులో 92 మంది లద్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. దీంతో అవి నాన్స్టాటేడ్ కింద రద్దయ్యాయి. 374 ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో అధికారులు బిల్లులు మంజూరు చేశారు. మిగితావి వివిధ స్థాయిలలో ఉన్నాయి. ఇప్పటివరకు సీబీసీఐడీ అధికారులు ఐదుసార్లు విచారణ చేశారు. గురువారం మరోమారు విచారణ చేపట్టారు. ఇందిరమ్మ పథకంలో గ్రామంలో ఎంతమంది బిల్లులు తీసుకున్నారనే విషయం ఆరా తీశారు. బిల్లులు తీసుకున్నవారు ఇళ్లు కట్టుకున్నారా..? లేదా అని విచారణ జరిపారు. బిల్లులు తీసుకున్నవారిలో చాలామంది స్థానికంగా ఉండడం లేదు. దీంతో గ్రామంలో లేనివారి పేర్లమీద బిల్లులు తీసుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో సీబీసీఐడీ అధికారులు కుల్కచర్ల స్టేట్ బ్యాంకుకు వెళ్లి విచారణ చేశారు. బిళ్లులు తీసుకున్న వారి ఖాతాలను తనిఖీ చేశారు. కొందరు లబ్ధిదారులకు సంబంధం లేకుండా బిల్లులు డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆధార్‌కార్డులు లేకుండా బిల్లులు తీసుక్నువారి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 40 మంది వరకు అక్రమంగా బిల్లులు తీసుకున్నట్లు విచారణలో తేలిందని, ఈవిషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సీబీసీఐడీ అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులు ఉన్నారు. -
‘ఇందిరమ్మ’ అక్రమాలపై విచారణ
కల్దుర్కిలో రెండోదఫా పర్యటించిన సీబీసీఐడీ అధికారులు బోధన్: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించేందుకు సీబీసీఐడీ అధికారులు మండలంలోని కల్దుర్కిలో బుధవారం పర్యటించారు. ఈ గ్రామంలో గత ఆగస్టులో మొదటి విడత పర్యటించి విచారణ చేపట్టిన విషయం విదితమే. మిగిలిన లబ్ధిదారుల వివరాలను ఇప్పుడు సేకరించారు. సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం ఇంటింటికి వెళ్లి .. బిల్లులు వచ్చాయూ? ఎంత మేరకు వచ్చాయి.. కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు.. అనే వివరాలుతెలుసుకున్నారు. అనంతరం సీబీసీఐడీ ఎస్ఐ సాల్మన్‌రాజ్ మాట్లాడుతూ.. గ్రామంలో 794 ఇళ్లు మంజూరు కాగా, 155 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని అన్నారు. ఆయన వెంట స్థానిక హౌసింగ్ ఇన్చార్జి డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. పోల్కంపేటలో... లింగంపేట : మండలంలోని పోల్కంపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై బుధవారం సీబీసీఐడీ డీఎస్పీ చెన్నయ్య విచారణ చేపట్టారు. ఎంతమంది ఇందిరమ్మ బిల్లులు పొందారు? ఎంతమంది నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే అంశాలపై ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. గ్రామంలో సుమారు 70 మంది నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు అదికారులు గుర్తించారు. అవకతవకలకు పాల్పడిన వారిపై, అందుకు సహకరించిన ప్రజాప్రతినిధులపై త్వరలో కేసులు నమోదు చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట సీబీసీఐడీ ఎస్ఐ నాగేందర్, హెడ్‌కానిస్టేబుల్ పాషా, రహమత్, స్థానిక ఏఎస్ఐ కుమార్‌రాజా, కానిస్టేబుల్ కిరణ్, హౌసింగ్ ఏఈ నరేందర్, వీఆర్వో రవి ఉన్నారు. -
ఆహార భద్రతకూ ఆధార్
ఆహార భద్రత’కు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్నాం. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పంతో అమలు చేస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి ఆధార్ సీడింగ్ లేకున్నా రేషన్ తీసుకోవచ్చు - కాట ఆమ్రపాలి, జేసీ-2 ⇒ ప్రస్తుతానికి సీడింగ్ లేక పోయినా సరుకులు ⇒భవిష్యత్తులో అనుసంధానం తప్పనిసరి ⇒ప్రజాపంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకూడదనే.. ⇒రేషన్‌షాపులను హేతుబద్ధీకరిస్తాం ⇒కార్డులకు అనుగుణంగా దుకాణాలు ⇒‘సాక్షి’తో జాయింట్ కలెక్టర్-2 ఆమ్రపాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆహార భద్రతకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్టవేయవచ్చని జాయింట్ కలెక్టర్-2 కాట ఆమ్రపాలి అభిప్రాయపడ్డారు. జే సీ-2గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రస్తుతం ఆధార్ సీడింగ్ లేనప్పటికీ నిరభ్యంతరంగా నిత్యావసరాలు తీసుకోవచ్చని, భవిష్యత్తులో మాత్రం ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. 57.28 శాతమే సీడింగ్! జిల్లాలో 11.78 లక్షల మందికి ఆహారభద్రత కార్డులున్నాయి. వీటిలో 57.28 శాతం కార్డులకే ఆధార్ సీడింగ్ జరిగింది. మిగతా కార్డులకు ఆధార్‌ను అనుసంధానించాల్సివుంది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 98 శాతం ఆధార్‌కార్డులు జారీ చేసినప్పటికీ, సమగ్ర కుటుంబ సర్వే సమాచారంతో క్రోడీకరించడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కొత్తగా మరోసారి ఆధార్ సీడింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ప్రమేయంలేకుండా రెవెన్యూ యంత్రాంగమే ఈ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేస్తున్నది. ఇదంతా పూర్తయ్యేవరకు ఆధార్లేకున్నా.. రేషన్ షాపుల్లో సరుకులు తీసుకోవచ్చు. దుకాణాలను హేతుబద్ధీకరిస్తాం చౌకధరల దుకాణాల సంఖ్య పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. కార్డుల సంఖ్యకు అనుగుణంగా షాపులను హేతుబద్ధీకరించనున్నాం. పట్టణ ప్రాంతాల్లో ఒక షాపు పరిధిలో సగటున 650 కార్డులుండగా, గ్రామీణ ప్రాంతాల్లో సగటున 400 కార్డులున్నాయి. గ్రేటర్ పరిధిలో మాత్రం కొన్ని షాపుల్లో నిర్ధేశిత సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా కొత్త దుకాణాల ఆవశ్యకతను అంచనా వేయగలుగుతాం. ప్రతినెలా 26వేల మెట్రిక్ టన్నులు జిల్లాలో ప్రతి నెల 26వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో ప్రతి వ్యక్తికి 6 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో అసాధారణం గా కోటా పెరిగింది. గతంలో 36 లక్షల యూనిట్లు ఉండగా, ఇప్పుడది 43 లక్షలకు చేరింది. ఈ నెల కిరోసిన్ కోటా పెంచాం. యూనిట్‌కు 3 లీటర్లు పంపిణీ చేస్తున్నాం. -
‘ముళ్లపూడి’ చెరలో ముత్యాలమ్మ చెరువు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారం దన్నుతో ఏం చేసినా చెల్లుబాటవుతుందని రెచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం చెరువుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమాలపై ఇదేమిటని ప్రశ్నించిన కిందిస్థాయి అధికారులను ‘ఏయ్ మీ పని మీరు చేసుకోండి.. మా జోలికి రావొద్దు.. మేం జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచరులం’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. సిబ్బందిని బెదిరిస్తున్నా అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిద్ర నటిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సొంతూరు నల్లజర్లలోని ముత్యాలమ్మ చెరువులో వారం రోజులుగా ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. టీడీపీకి చెందిన నల్లజర్ల సర్పంచ్వై.శ్రీనివాసరావు, పోతవరం సర్పంచ్ పి.రతీష్, బాపిరాజు సన్నిహితుడు యద్దనపూడి బ్రహ్మరాజు, మరికొంత మంది కలిసి నల్లజర్లలో ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌కి శ్రీకారం చుట్టారు. ఈ వెంచర్ కోసం నల్లజర్ల పోలీస్‌స్టేషన్ పక్కనే వందల ఏళ్లుగా ఉన్న 30 ఎకరాల ముత్యాలమ్మ చెరువునుంచి నిర్భీతిగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఒక సాధారణ రైతు ఇంటి వద్ద మెరక చేసుకునేందుకు తన పొలం నుంచి ట్రక్కు మట్టి తీసుకెళుతుంటే అధికారులు నానా హడావిడి చేసి కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇక్కడ బహిరంగంగానే మూడు పొక్లెయిన్లు, 30 ట్రాక్టర్లతో పట్టపగలే సుమారు వెయ్యి ట్రాక్టర్ల మట్టిని వారం రోజులుగా తరలించుకుపోతున్నా చోద్యం చూశారే గానీ ఇదేమిటని అడిగే ధైర్యం చేయలేక పోయారు. ఈ చెరువులోనుంచి మట్టి తవ్వకాలు జరిపేందుకు ఎటువంటి అనుమతులు లేవు. నిబంధనలు గాలికి.. మట్టి రియల్ వెంచర్‌కు వాస్తవానికి ఇరిగేషన్ చెరువులో మట్టి తవ్వుకు తీసుకెళ్లాలంటే ముందు వీఆర్వో, ఆ తర్వాత తహసిల్దార్ అభ్యంతరాల్లేవని లేఖ ఇవ్వాలి. ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే ఇరిగేషన్ అధికారులు మైనింగ్ ఏడీకి అనుమతులివ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ పట్టలేదు. ఎక్కడా ఏ అధికారి అనుమతులివ్వకుండానే తవ్వకాలు జరిగిపోతున్నాయి. గతంలో గంగానమ్మ గుడి ఎదురుగా వేసిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఇలానే మట్టి తరలిస్తుంటే అధికారులు దాడి చేసి పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకుని తోలిన మట్టికి క్యూబిక్ మీటర్ల వంతున లెక్కగట్టి మరీ జరిమానా విధించారు. కానీ ముత్యాలమ్మ చెరువు తవ్వకాల విషయానికి వస్తే.. అసలు దీనికి అనుమతులున్నాయో లేదో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. ఓ కిందిస్థాయి అధికారి మాత్రం నేరుగా అక్కడికి వెళ్లి అనుమతులున్నాయా అని అడిగితే.. నీకెందు కు.. ఎమ్మార్వోకిచ్చాం.. మేం ఎవరో తెలిసే ఇక్కడకు వచ్చావా.. అని గదమాయించడంతో ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లినట్టు తెలిసింది. జెడ్పీ చైర్మన్ బాపిరాజుకు తెలియకుండానే ఇదంతా జరుగుతుం దంటే ఎవరూ నమ్మరని, కేవలం ఆయన అండదండలతోనే అనుచరు లు, టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. కాలం చెల్లిన అనుమతులతో... గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హ యాంలో అనుమతిపొంది తిరిగి రద్దయిన కాపీలను పెట్టుకునే వీళ్లు తవ్వకాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా అడిగినా కాలం చెల్లిన అనుమతి లేఖలే చూపిస్తున్నట్టు చెబుతున్నారు. ఆ చెరువు గురించి మాకేం తెలియదు : మైనింగ్ శాఖ అధికారులు దీనిపై మైనింగ్ శాఖ ఏడీ వై.సత్తిబాబును వివరణ కోరేందుకు గత నాలుగురోజులుగా యత్నిస్తున్నా అయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. కనీసం ఆ శాఖకు చెందిన ఇతర అధికారులను కలిసి విష యం ప్రస్తావించగా, ఆ చెరువు గురించి మాకేం తెలియదు.. మేమేం మాట్లాడలేం.. అని నోరు నొక్కుకుంటున్నారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. -
అక్రమాలకు గ్రీన్‌సిగ్నల్
- ఇసుక మాఫియా విజృంభణ - పోలీసులకు కాసుల వర్షం వికారాబాద్: పశ్చిమరంగారెడ్డి జిల్లా పరిధిలో ఇసుకమాఫియా పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుక అక్రమరవాణాతో పాటు నల్లబజారుకు రేషన్‌బియ్యం తరలింపునకు సైతం కొందరు పోలీసు అధికారులు ఆశీస్సులు అందించి అందిన కాడికి దండుకుంటున్నారు. పరిగి డివిజన్ నుంచి నిత్యం 60-70 లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను తరలించుకుపోతున్నారు. అలాగే తండూరు సబ్‌డివిజన్‌లో 45నుంచి 69, వికారాబాద్ సబ్‌డివిజన్‌లో 20నుంచి 50లారీల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తద్వారా ప్రభుత్వానికి రావాల్సిన లక్షలాది రూపాయల రాయల్టీకి గండిపడుతోంది. ఈ అక్రమ వ్యాపారంలో సంహభాగం పోలీసు అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. ఏడాది క్రితం ఎస్పీ బి.రాజకుమారి చేపట్టిన కఠిన చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడినా గత ఆరునెలలుగా మళ్లీ ఊపిరిపోసుకుంది. తాండూరు పరిధిలోని యాలాల్ మొదలు కొని మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్,కర్నాటక ప్రాంతం, గండేడ్ మండలం రుసుంపల్లి,రంగారెడ్డిపల్లి, పెద్ద వార్వాల్, సాలార్‌నగర్ వాగులనుంచి పరిగి మండలం ఇబ్రహింపూర్,గడిసింగాపూర్,రంగంపల్లిల నుంచి ఫిల్టర్ ఇసుకను యథేచ్ఛగా తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇసుక లారీలనుంచి డబ్బు వసూళ్లకు ముగ్గురు పోలీసులు ప్రత్యేకంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌గా నడిచే ఇసుక లారీల నుంచి నెలకు ఇంతని వసూలు చేస్తున్నారు.అదే విధంగా కొత్తగా రవాణ చేసే లారీల వద్ద అయితే అదును బట్టి ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు వ సూలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ వ్యవహరం డీఐజీ వరకు వెళ్లింది.అప్పట్లో ఇక్కడి పోలీసు అధికారులకు నోటీస్‌లు జారీ చేయగా వారు సంజాయిషీ ఇచ్చుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ తంతు ఒక పరిగికే కాదు, ఇటు తాండూరుతో పాటు వికారాబాద్‌లో కూడా కొనసాగుతున్నట్లు తెలిసింది. ఎక్కువగా పరిగి,తాండూరు ప్రాంతల్లో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా పోలీసుల అండదండలతో కొనసాగుతున్నట్లు వినికిడి. దేనికైనా సై పరిగి పోలీసులు అక్రమ సంపాదన కోసం దేనికైనా బరితెగిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణ కేవలం ఒక ఇసుకకే పరిమితం కాలేదు.నల్లబజారుకు రేషన్ బియ్యాన్ని సైతం పోలీసుల అండదండలతో తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. .పరిగి కే ంద్రంగా అక్రమ బియ్యం వ్యాపారం జోరుగా కొనసాగుతోంది . ఈ వ్యాపారంపై పోలీసులు నెలకు రూ.50 వేలు మొదలు కొని లక్ష వరకు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. పరిగి మీదుగా అక్రమ మార్గాన సరుకును తరలించే వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్లకు పోలీసులు తాత్కాలిక చెక్‌పోస్టులు ఏ ర్పాటు చేసి రాత్రి పూట వసూళ్లకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. -
అక్రమాల పుట్ట
సాక్షి ప్రతినిధి, గుంటూరు :పాడి పరిశ్రమకు, పశుపోషకులకు ఆలంబనగా నిలవాల్సిన డెయిరీ అక్రమాలకు కేంద్రంగా మారింది. సంస్థలోని కొందరు ఉద్యోగులు తెలుదేశం పార్టీ కార్యకర్తలుగా రూపాంతరం చెందారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీకి టీడీపీ నాయకుడు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కొందరు ఉద్యోగులు డెయిరీలోవిధులు నిర్వహించకుండా పార్టీ కార్యక్రమాల్లో కొనసాగుతూ జీతాలు పొందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది రైతులు పాడిపరిశ్రమ అభివృద్ధికి తమ భూములను విరాళంగా ఇచ్చి ఒక రోజు పాల వేతనాన్ని అప్పగించి పునాదులు వేస్తే నేడు ఆ డెయిరీ ఆశయాలకు పాలకులు తూట్లు పొడుస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇతర జిల్లాల వారికే ఉద్యోగాలు.. జిల్లాలో పాల ఉత్పత్తిదారుల పిల్లలకు ఉద్యోగాలు కల్పించాల్సిన పాలకవర్గం అందుకు భిన్నంగా అనంతపురం, కృష్ణా, చిత్తూరు జిల్లాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇచ్చి జిల్లాలోని నిరుద్యోగ యువతకు శఠగోపం పెడుతోంది. 1994లో సంగం డెయిరీలో పాల ఉత్పత్తిదారుల పిల్లల సంక్షేమం కోసం వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసేందుకు వీరయ్య చౌదరి ఆధ్వర్యంలోని దూళిపాళ్ల మెమోరియల్ ట్రస్టుకు పదెకరాల భూమిని విరాళంగా అందజేశారు. కళాశాలను ఏర్పాటు చేయకుండా ఆ భూములను సొంత ఆస్తిగా అనుభవిస్తున్నారు. వీరయ్య చౌదరి మరణానంతరం కృష్ణా, గుంటూరు జిల్లాల పాల ఉత్పత్తిదారులు ట్రస్టు కోసం ఒక రోజు పాల వేతనం రూ.18 లక్షలను జమ చేయగా, ఆ నగదు జమా లెక్కలు వివరాలను చైర్మన్ ఇంత వరకు వెల్లడించలేదు.కీలక సిబ్బందికి నో రిటైర్మెంట్.. డెయిరీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది ఉద్యోగ విరమణ చేసినప్పటికి వారి స్థానంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. అదే సిబ్బందిని మళ్లీ విధుల్లోకి తీసుకొని వేలకు వేలు జీతాలిస్తూ పెంచి పోషిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. కొందరు సిబ్బంది విధులకు డుమ్మా కొట్టి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఉద్యోగులమనే విషయాన్ని మరిచిపోయి నిబంధనలకు విరుద్ధంగా పెదకాకాని మండలంలో నగదు పంచుతూ పోలీసులకు చిక్కటమే ఇందుకు నిదర్శనం. ఎక్స్గ్రేషియానూ వదలటం లేదు.. డెయిరీలో 200 మంది వరకు ఎసైన్మెంట్ సిబ్బంది ఉన్నారు. వారికిచ్చే అరకొర జీతం నుంచి విరాళాలు ఇవ్వాలని డెయిరీ యూనియన్ నాయకులు పార్టీకి చందాలు వసూలు చేస్తున్నారు. డెయిరీ చైర్మన్‌గా ఉన్న నరేంద్రకుమార్ పొన్నూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ఆ పార్టీ అనుబంధ యూనియన్ నాయకులు ఒక్కో ఉద్యోగి నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు విరాళాలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినపడుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా కింద అందజేసే సొమ్ములో కొంత మొత్తాన్ని విరాళంగా వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్క్ సొసైటీల నుంచి ఇదే తరహాలో విరాళాలు సేకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.సంగం డెయిరీ ఏర్పడిన తరువాత పాలక వర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వారు డైరక్టర్లుగా ఎన్నిక కాకపోవటం గమనార్హం. బలహీన వర్గాలకు చెందిన వారు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు గ్రామాల్లో పాల ఉత్పత్తిదారులుగా ఉండగా వారికి పాలకవర్గంలో అవకాశం దక్కటం లేదు. ప్రస్తుత పాలకవర్గంలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారు అధిక శాతం ఉన్నారు. మహిళలకు ప్రాతినిథ్యం కూడా లేకపోవటం విమర్శలకు కారణమవుతుంది. పవర్‌ప్లాంట్‌కు డెయిరీ భూమి.. డెయిరీ భూమిలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన పాలకవర్గం ఆ భూమిని ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నదనే విమర్శలున్నాయి. ప్రయివేట్ పవర్ ప్లాంట్‌కు మూడెకరాల భూమిని అధిక మొత్తాలకు లీజుకు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై డెయిరీ మేనేజింగ్ డెరైక్టర్ కె.గోపీనాథ్‌ను వివరణ కోరగా ఆ భూమిని పదేళ్లకు మాత్రమే లీజుకిచ్చామని, అక్కడ ఉత్పత్తయ్యే కరెంటులో కొంతభాగం డెయిరీకిచ్చేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. -
కబ్జాకోరల్లో రూ.10 కోట్ల స్థలం!
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డూ అదుపూలేకుండాపోతోంది. వారు చెప్పిందే న్యాయం.. వారు చేసిందే చట్టం అన్నట్టుగా అధికార యంత్రాంగం తల ఊపుతుండడంతో అంతా వారి ఇష్టారాజ్యమైపోరయింది. ఎన్నికలకు ఇంకా మూడు నెలలే సమయం ఉండడంతో దీపం ఉండగానే ఖాళీ జాగాలో పాగా వేయాలన్న చందంగా పట్టణంలో కనిపించిన ప్రతి స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. తాజాగా సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలంపై కొందరు కన్నేశారు. ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేపట్టారు. పట్టణంలోని దాసన్నపేట నుంచి కొత్తపేట వెళ్లే రింగ్‌రోడ్డు సమీపంలోని బుంగవీధికి శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి ఆనుకుని ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన సుమారు ఏడు ఎకరాల స్థలం ఉంది. బుంగవీధి వాసులు దీన్ని బహిర్భూమిగా వాడుతున్నారు. ఈ స్థలంలో పెద్ద పెద్ద గుట్టలు కూడా ఉన్నాయి. ఈ గుట్టలను సైతం తొలచి కొందరు అక్రమార్కులు స్థలాన్ని చదును చేస్తున్నారు. శ్మశానం ముందు ప్రాంతంలో కల్కి భగవాన్ ఆశ్రమాన్ని నిర్మించారు. బుంగవీధికి చెందిన చిన్న పిల్లలు మృతి చెందితే ఈ ఆశ్రమం వెనుక ఉన్న ప్రభుత్వ స్థలంలో పూడ్చుతారు. అరుుతే ఈ స్థలం కూడా ఆక్రమణకు గురవుతోంది. సిమెంట్ ఇటుకలతో అడ్డంగా గోడ నిర్మిస్తున్నారు. దీంతో ఆ వీధికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా చనిపోతే పూడ్చడానికి ఆరడుగుల స్థలమైనా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివరామ దీక్షితులు పేరిట ఉన్న ట్రస్ట్ కార్యకలాపాలను దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తోంది. శ్మశానం పక్కనే ఉన్న ఈ ట్రస్ట్‌కు చెందిన ఖాళీ స్థలంలో కూడా చిన్నపాటి రోడ్డు నిర్మించి, తరువాత నెమ్మదిగా లేఅవుట్ వేసేందుకు అధికార పార్టీ నేతలకు చెందిన కొందరు అనుచరులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇంతస్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నా.. ఇటు మున్సిపల్ అధికారులు గాని, అటు దేవాదాయ శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. తెర వెనుక అధికార పార్టీ నాయకులు మున్సిపాలిటీలోని ప్రభుత్వ స్థలాల ఆక్రమణల వెనుక జిల్లాకు చెందిన ముఖ్యనేత, పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది. తమ అనుచర గణాన్ని ప్రభుత్వ స్థలాలపైకి పంపి కబ్జా చేసేలా వారు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నారుు. కబ్జాదారులు ఆక్రమించిన స్థలాల వద్దకు వెళ్లి మున్సిపల్ అధికారులు పనులను నిలిపివేసినా.. వారు వెళ్లగానే మళ్లీ పనులను ప్రారంభిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్లే ఆక్రమణదారులు ఇలా రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
దేవరకొండ కేసు సీబీసీఐడీకి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలను విచారించేందుకు కేసును సీబీసీడీకి అప్పగించాలని డీసీసీబీ బోర్డు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అక్కడ జరిగిన *18 కోట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చే వరకు వదిలిపెట్టవద్దని డెరైక్టర్లు ముక్తకంఠంతో పట్టుబట్టారు. శుక్రవారం డీసీసీబీ సమావేశ మందిరంలో ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు సంబంధం ఉన్న వారు ఎంతటి హోదాలో ఉన్నా విడిచిపెట్టవద్దని తీర్మానించారు. తొలుత ఇన్చార్జ్ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన పాండురంగారావును పలువురు డెరైక్టర్లు అభినందించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే డెరైక్టర్లు చాపల లింగయ్య, ఏర్పుల సుదర్శన్, పిల్లలమర్రి శ్రీనివాస్, హనుమయ్యలు మాట్లాడుతూ దేవరకొండలో జరిగిన అవినీతి అక్రమాలపై నాన్చుడి ధోరణికి పోకుండా వెంటనే సీబీసీఐడీ చేత విచారణ జరిపించడానికి సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విచారణలో కాలయాపన చేయడం వలన బ్యాంకుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. నూతనంగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నందున నిస్పక్షపాతంగా సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఇన్చార్జ్ చైర్మన్ పాండురంగారావు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి హోదాలో ఉన్నా ఎవరినీ వదలిపెట్టేది లేదని, విచారణ సీబీసీఐడీతోనే జరిపించడానికి తీర్మాణనం చేస్తున్నామని తెలిపారు. నిజాన్ని నిగ్గుతేల్చేంత వరకు విడిచేది లేదని అన్నారు. బ్యాంకుకు పూర్వ వైభవం వచ్చేలా చూస్తా : ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చిన మచ్చను తొలగించి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. శుక్రవారం డీసీసీబీలో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకు అధికారులు, డెరైక్టర్ల సమష్టి సహకారంతో బ్యాంకును అన్ని విధాలుగా లాభాల బాటలో నడిపించి రైతులకు మెరుగైన సేవలు అందించనున్నామన్నారు. దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ చేత విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలో అధికారులు, డెరైక్టర్లతో కలిసి జిల్లాలోని అన్ని బ్రాంచ్‌లను సందర్శించి అక్కడ ఉన్న లోపాలను సవరించడానికి కృషి చేయనున్నామని తెలిపారు. బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు మాట్లాడుతూ దేవరకొండ అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించడంతో పాటు బ్యాంకులో అక్రమాలు జరిగి నట్లు వచ్చిన ఆరోపణలపై హెచ్ఆర్ కమిటీతో విచారణ జరిపించనున్నట్లు చెప్పారు. పాలకమండలి సహకారంతో బ్యాంకును లాభాల బాటలో నడిపించనున్నామన్నారు. విలేకరుల సమావేశంలో డెరైక్టర్లు డేగబాబు, గరిణే కోటేశ్వర్రావు, మిర్యాల గోవర్ధన్, గుడిపాటి వెంకటరమణ, హరియానాయక్, పీర్‌నాయక్ పాల్గొన్నారు.