ప్యాకేజీల వారీగా పరిశీలించాకే కాంట్రాక్టర్లకు చెల్లింపు
సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ నిర్ణయం
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించి, పూర్తిగా పరిశీలించిన తర్వాత... అర్హులైన పనులకు మాత్రమే ఎస్కలేషన్ చెల్లించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం మాదిరి కాకుండా కాంట్రాక్టులందరికీ ఒకేరీతిన ఎస్కలేషన్ చెల్లించడం కాకుండా పనులు పూర్తి చేస్తామని విశ్వాసం ఉన్నచోటే పెంచిన ధరలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. శనివారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. పనులు జరగని చోట, కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించిన చోట ఎస్కలేషన్‌కు అనుమతించరాదని నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా.. ప్యాకేజీల వారీగా పనులను పూర్తిగా అధ్యయనం చేయాలని, రీటెండరింగ్ చేస్తే అయ్యే భారం, ఎస్కలేషన్‌కు అయ్యేభారాన్ని లెక్కించి నివేదిక తయారు చేయాలని సాగునీటి పారుదల శాఖను ఆదేశించారు. దీనిపై చర్చించేం దుకు ఈ నెల 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు సత్వరం పూర్తిచేసేందుకు చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని ఆదేశించారు. భూసేకరణకు ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
ఏకరీతి ఎస్కలేషన్‌కు ‘నో’
Published Sun, Jun 14 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM
Advertisement
Advertisement