The package
-
న్యాయం చేయండి
ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి ఇసుకలారీలు అడ్డుకున్న సంకెపల్లి గ్రామస్తులు వేములవాడ రూరల్ : తమకు న్యాయం జరిగే వరకు గ్రామ శివారు నుంచి ఇసుకను తరలించేది లేదని సంకెపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. మధ్యమానేరు నిర్మాణంతో సంకెపల్లి గ్రామస్తుల వ్యవసాయ భూములు ముంపునకు గురవుతుండగా.. కొన్ని భూములకు మాత్రమే పరిహారం వచ్చిందని, మిగతా భూములకు సైతం త్వరగా ఇవ్వాలని కోరారు. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే రమేశ్‌బాబును గురువారం కలిసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తోడుతున్న వాహనాల ముందు బైఠాయించారు. ఈవిషయం తెలుసుకున్న పట్టణ సీఐ శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్, ఎస్సై సైదారావు సిబ్బందితో అక్కడికి చేరుకుని మాట్లాడిన గ్రామస్తులు పట్టించుకోలేదు. కలెక్టర్, ఆర్డీవోల నుంచి హామి వచ్చే వరకు తాము ఈ ఆందోళనను విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని సిరిసిల్ల ఆర్డీవో బిక్షానాయక్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు . నిర్వాసితుల డిమాండ్లు గ్రామస్తులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయూలి. పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించి, పరిహారం అందించాకే ఇసుకను తీసుకువెళ్లాలి. -
ఓట్ల కోసమే బిహార్‌కు ప్యాకేజీ
మోదీ సర్కారుపై రాహుల్‌గాంధీ ధ్వజం అమేథీ: ప్రధాని మోదీ బిహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇవ్వడం ఓట్ల కోసమేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇలా జిమ్మిక్కులు చేయడం ఆయనకు అలవాటేనన్నారు. ఈ ప్యాకేజీ హామీ కూడా జవాన్లకు ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’(ఓఆర్ఓపీ) మాదిరే అవుతుందేమోనని పేర్కొన్నారు. ‘బిహార్‌కు ప్యాకేజీ ఇవ్వడానికి, విదేశీ పర్యటనలకు వెళ్లడానికి మోదీకి డబ్బు లు ఉంటాయి. అదే మన జవాన్లకు, మాజీ సైనికులకు ఇవ్వడానికి మాత్రం డబ్బుల్లేవంటారు. 2017లో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు ముందూ ఆయన యూపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓఆర్ఓపీ అమలు చేస్తామని లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నారా?’ అని ప్రశ్నించారు. అమేథీ పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం రాణిగంజ్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ ప్యాకేజీ హామీలు ఇవ్వడం సమయం వృథా చేయడమే. ఆయన మాట్లాడతారు. ప్రజలు వింటారు. తర్వాత ఆయన మరో హామీ ఇస్తారు. ఈ ప్రపంచం అంతా భ్రమల్లో బతుకుతుందని బీజేపీ, మోదీ భావిస్తున్నట్టున్నారు. పల్లె జనాలు ఇదంతా అర్థం చేసుకోరని వారు అనుకుంటున్నారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తెచ్చి దేశంలో ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆ హామీ ఏమైంది?’ అని దుయ్యబట్టారు. అభివృద్ధిని కొలిచే విధానాలన్నింటినీ మార్చేసి.. తామే దేశాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ‘సూటు- బూటు’ సర్కారుగా విమర్శించిన రాహుల్ మళ్లీ ఆ దాడిని కొనసాగించారు. సామాన్యుల కోసం పనిచేసేందుకు కుర్తా- పైజామా సర్కారు వస్తుందన్నారు. -
ఏకరీతి ఎస్కలేషన్‌కు ‘నో’
ప్యాకేజీల వారీగా పరిశీలించాకే కాంట్రాక్టర్లకు చెల్లింపు సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ నిర్ణయం హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను ప్యాకేజీల వారీగా సమీక్షించి, పూర్తిగా పరిశీలించిన తర్వాత... అర్హులైన పనులకు మాత్రమే ఎస్కలేషన్ చెల్లించాలని కేబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం మాదిరి కాకుండా కాంట్రాక్టులందరికీ ఒకేరీతిన ఎస్కలేషన్ చెల్లించడం కాకుండా పనులు పూర్తి చేస్తామని విశ్వాసం ఉన్నచోటే పెంచిన ధరలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. శనివారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల సబ్‌కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. పనులు జరగని చోట, కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శించిన చోట ఎస్కలేషన్‌కు అనుమతించరాదని నిర్ణయించారు. ప్రాజెక్టుల వారీగా.. ప్యాకేజీల వారీగా పనులను పూర్తిగా అధ్యయనం చేయాలని, రీటెండరింగ్ చేస్తే అయ్యే భారం, ఎస్కలేషన్‌కు అయ్యేభారాన్ని లెక్కించి నివేదిక తయారు చేయాలని సాగునీటి పారుదల శాఖను ఆదేశించారు. దీనిపై చర్చించేం దుకు ఈ నెల 17న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు సత్వరం పూర్తిచేసేందుకు చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని ఆదేశించారు. భూసేకరణకు ప్రత్యేకంగా అథారిటీని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.