
సాక్షి, హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ భవనంలో ప్రైవేట్ ఆస్పత్రి యజమాన్యాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాజరయ్యారు.ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు తమ సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రికి తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్య శ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రైవేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం కురుర్చుకున్న ఆరోగ్యశ్రీ ఎంఓయూను మార్చాలని కోరారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్, ఇతర మెడికల్ బిల్లులకు సంబంధించిన ధరకు అనుగుణంగా బిల్లుల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment