
దీవించమ్మా..
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత
నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు
నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం
పగటి వేళ 35 సెల్సియస్ డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
గోదావరి పుష్కరాల రెండో రోజు బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. మంగపేట పుష్కరఘాట్ భక్త జనంతో కిటకిటలాడింది. రామన్నగూడేనికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముల్లకట్టవద్ద గోదావరి ప్రవాహం లేకపోవడంతోపాటు పోలీసులు రాకపోకలు నిషేధించడంతో పుష్కరఘాట్ వెలవెలబోయింది. బుధవారం సుమారు 26 వేల మంది భక్తులు గంగమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదారమ్మ .. దీవించమ్మా.. అని వేడుకున్నారు.
- సాక్షి, హన్మకొండ
మంగపేట : పుష్కరఘాట్ వద్ద కల్పించిన సౌకర్యాలను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం పరిశీ లించారు. ఈసందర్భంగా కస్తూరీబా మహిళా మం డలి అధ్యక్షురాలు కొమరగిరి సామ్రాజ్యం, కమలాపురం కోలాట భజన మండలి సభ్యులు మంగళహా రతితో కలెక్టర్‌కు ఆహ్వానం పలికారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి కలెక్టర్.. దీపాలు వెలిగించి నది వదిలారు. కాగా, ఆరూరి రమేశ్ తన కుటుంబ సభ్యులతో కలిపి పుష్కర స్నానం ఆచరించారు.
‘పుష్కర బుక్‌లెట్’ ఆవిష్కరణ
ములుగు : గోదావరి పుష్కరాలు-2015 వరంగల్ జిల్లా సమాచార బుక్‌లెట్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఇక్కడ ఆవిష్కరించారు.
వరంగల్ : పుష్కరాల సందర్భంగా అధికారులు తీసుకుంటున్న ‘అతి’జాగ్రత్తలు భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉన్నతాధికారుల నిర్ణయాలతో పోలీ సులు తమ శైలిలో వ్యవహరించడం ఇందుకు కారణమవుతోంది. మంగపేట సమీప పుష్కరఘాట్‌కు వెళ్లాలంటే భక్తులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారిని గంపోని గూడెం పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి మినీ బస్సు ద్వారా పుష్కరఘాట్‌కు వెళ్లాలి. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారు మంగపేట బస్టాండ్‌లో దిగి ఉమాచంద్రశేఖర స్వామి అలయం వరకు నడిచివెళ్లి మినీ బస్సులో పుష్కరఘాట్‌కు చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. గంపోనిగూడేం వద్ద నుంచి పుస్కరఘాట్ వరకు సుమారు 2.50కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పోలీసులు తీసుకుంటున్న అతి..జాగ్రత్త వల్ల గంటకు పైగా సమయం పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వారి కష్టాలు చెప్పకుండా ఉన్నాయి.