Pushkarni Ghat
-
వరద గోదావరి
ఇటీవలి కాలంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో క్రమక్రమంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. వరంగల్ జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం ఉదయం గోదావరి నీటిమట్టం 7.56 మీటర్లకు చేరింది. దీంతో స్నాన ఘట్టాలు నీటమునిగాయి. -
మమ్మల్ని మనుషులుగా చూడండి
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుట తాళాయపాలెం రైతుల ఆవేదన ఎలా బతకాలంటూ కన్నీటిపర్యంతమైన మహిళలు తుళ్లూరు : ‘మమ్మల్ని మనుషులుగానే చూడటంలేదు. అధికారులు, కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. మా ఇళ్ల పక్క నే పెద్దపెద్ద గోతులు తీసి ఇసుకను తోడేస్తున్నారు. మా ఇళ్లు కూల్చేందుకు తెగబడుతున్నారు’ అంటూ తాళాయపాలెం గ్రామానికి చెందిన మహిళలు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే ముందు కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం తాళాయపాలెం లంకలోని పుష్కర ఘాట్‌ను పరిశీ లించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక అధికారి అనంతరాములుతో కలసి కలెక్టర్ వచ్చేశారు. పుష్కర ఘాట్‌ను పరిశీలించి వెళుతుండగా బాధితులు పెద్దసంఖ్యలో కలెక్టర్ కాన్వాయ్‌కు అడ్డుగానిలిచి ‘కలెక్టర్ కారు దిగి రావాలి. మా గోడు వినాలి’ అని నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ తప్పని పరిస్థితిలో వాహనం దిగి ఆందోళన చేస్తున్న బాధితుల వద్దకు వెళ్లారు. రెండో విడత కౌలు చెక్కులు కూడా రైతులు తీసుకుంటున్నారని, అసైన్డ భూముల రైతులకు మాత్రం మొదటి దఫా కౌలు చెక్కులు కూడా ఇవ్వలేదని బాధితులు తెలిపారు. తమ నివాసాలకు ఆనుకుని ఇసుక డంపింగ్‌లు చేస్తున్నారని, ఇసుక తోడేస్తూ గోతులు తీస్తున్నారని, ఇలాగే కొనసాగితే తమ నివాసాలు కూలిపోతాయని కలెక్టర్‌కు వివరించారు. వివిధ రకాలుగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాళాయపాలెం లంక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ పరిస్థితిని స్వయంగా చూడాలని బాధితులు కోరగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే వెళ్లి పరిశీలించారు. స్పందించిన కలెక్టర్ పుష్కర ఘాట్ల పనుల వల్ల స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబును ఆదేశించారు. అనంతరం అసైన్డ బాధితుల గురించి మాట్లాడుతూ అసైన్డ భూములపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చిందని, త్వరలో లబ్ధిదారులకు కౌలు చెక్కులు వస్తాయని హామీ ఇచ్చారు. దీంతో లంకవాసులు శాంతించారు. -
తాడేపల్లిలో నిఘా నేత్రం
సీసీ కెమెరాల ఏర్పాటుకు పరిశీలన తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మునిసిపాలిటీ, జాతీయ రహదారి వెంబడి నిఘా నేత్రాలను (సీసీ కెమరాలను) ఏర్పాటు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది గురువారం పరిశీలించారు. రానున్న పుష్కరాలకు పోలీసు విభాగం నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుంటూరు వెస్ట్ జోన్ డీఎస్పీ సరిత ఈ పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఏడు పుష్కర నగర్లతోపాటు ఉండవల్లి సెంటర్, ప్రకాశం బ్యారేజి, పుష్కర ఘాట్లు, జాతీయ రహదారి వెంబడి ప్రధాన కూడళ్లు పాత టోల్ గేటు, క్రిస్టియన్‌పేట తదితర ప్రాంతాల్లో 44 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి డీఎస్పీ సరిత తీసుకువెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ పరిశీలనలో సీసీ కెమెరాల టెక్నీషియన్ భరత్, తాడేపల్లి పీఎస్ఐ నారాయణ, ఆర్ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర మృతులకు అఖిలపక్ష నేతల నివాళి
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. నాటి దుర్ఘటన జరిగి గురువారానికి ఏడాది అయింది. ఈ సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రి, గోకవరం బస్టాండ్ నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ తీయనున్నారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుర్ఘటన జరిగి ఏడాది అయినా ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అ ప్రజాస్వామికమన్నారు. -
గోదావరి పుష్కర ఘోరానికి ఏడాది
-
గోదావరి పుష్కర ఘోరానికి ఏడాది
తొలిరోజు 29 మంది మృతి.. బాబు ప్రచార యావే కారణమని విమర్శలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : 2015 జూలై 14.. గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.. నాటి ఘోరానికి గురువారంతో ఏడాది పూర్తవుతోంది. ఇటు గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. అయినా ఈ ఘోరానికి బాధ్యులను గుర్తించడంలో, చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫలమైంది. ఈ ఘటనకు చంద్రబాబు ప్రచారయావ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని పౌర సంఘాలు, రాజకీయ పార్టీలు నిలదీస్తున్నా సర్కారులో చలనం కనిపించడం లేదు. ఇప్పటికీ బాధ్యులెవరో తేలలేదు..: సంఘటనపై పౌర సంఘాలు గొంతెత్తి నినదించిన మూడు నెలలకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 15న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్‌ను విచారణకు నియమించింది. ఆ కమిషన్ ఇప్పటికీ బాధ్యులెవరో తేల్చలేదు. పైగా.. ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీలు పుష్కరఘాట్‌లో గంటకు పైగా ఉండడంతోనే దుర్ఘటనకుకారణమని అప్పట్లో తూర్పుగోదావరి కలెక్టర్ రాష్ట్రపతికి, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు నివేదించారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో నివేదికలో మార్పులు చోటుచేసుకున్నారుు. భక్తులు తోసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని రెండోసారి నివేదికలో పేర్కొన్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన నివేదికలివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ‘బాబు’ డాబు కోసమే 29 మంది బలిదానం..: నాటి విషాద ఘటనకు ప్రధాన కారణం.. వీఐపీ ఘాట్‌కు కాకుండా సామాన్యులు స్నానమాచరించే పుష్కర ఘాట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రావడమేనని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. ఘాట్ నుంచి సీఎం కుటుంబం బయటకు రాగానే గేట్లు తెరవడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ఘాట్‌లోకి పోటెత్తడంతో తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పుష్కరాలకు అంతర్జాతీయ ప్రచారం కల్పించాలని నేషనల్ జియోగ్రఫీ చానల్‌కు పుష్కరాల షూటింగ్‌ను కాంట్రాక్ట్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ భక్తుల ప్రాణాలను పణంగా పెట్టిందని ప్రతిపక్షాలు సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఆ దుర్ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను ప్రభుత్వం కావాలనే మాయం చేసిందని ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. -
పోటెత్తిన గోదావరి
రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 9.92 మీటర్ల నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక జారీ {పజలను అప్రమత్తం చేసిన అధికారులు ఏటూరునాగారం :మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. సోమవారం సాయంత్రం 9.92 మీటర్ల నీటి మట్టం నమోదు కావడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి వరదతో రామన్నగూడెం, గొంటైని పంట పొలాలు నీట మునిగాయి. మండల కేంద్రంలోని మానసపల్లి శివారులో 16 ఎకరాల్లో వరి నారుమడులు మునిగిపోయూరుు. జలదిగ్బంధంలో మూడు గ్రామాలు.. మండలంలోని రాంనగర్, కోయగూడ ఎల్లాపురం, లంబాడీతండా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి, జీడివాగు పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు వెళ్లే కాజ్వే పూర్తిగా నీట మునిగి రాకపోకలు నిలిచిపోయాయి. రాంనగర్- రామన్నగూడెం గ్రామాల మధ్య లోలెవల్ కాజ్‌వేపై వరద ఉండడంతో మూడు రోజులుగా ఆయూ గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయారుు. దీంతో ఐటీడీఏ, రెవెన్యూ అధికారులు స్పందించి సోమవారం పడవలను ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ అధికారులతో కలిసి మానసపల్లి, రాంనగర్, రామన్నగూడెం ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం ఇస్తూ లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలని తహశీల్దార్ నరేందర్, వీఆర్ఓలను ఆదేశించారు. వారి వెంట ఇరిగేషన్ అధికారులు, ఆర్ఐ సర్వర్‌పాషా, వీఆర్ఓలు ఖాసీం, నర్సయ్య, నర్సయ్య, రాములు, పుల్లయ్యతోపాటు సర్పంచ్ బొల్లె జ్యోతి, శ్రీను, మాజీ సర్పంచ్ గారె ఆనంద్, పీఏసీఎస్డెరైక్టర్ దొడ్డ కృష్ణ, ఎంపీటీసీ దొడ్డ పద్మ ఉన్నారు. -
పుష్కర ఘాట్ నిర్మాణంలో లోపాలు
పెదపులిపాకలో విజిలెన్స్ తనిఖీల్లో బహిర్గతం పెనమలూరు : పెదపులిపాక గ్రామ పరిధిలో కృష్ణానది వద్ద నిర్మిస్తున్న పుష్కర ఘాట్ నిర్మాణంలో లోపాలు బయటపడ్డాయి. ఈ ఘాట్ నిర్మాణంపై పర్యవేక్షణ కొరవడడంతో గుత్తేదారు ఇంజినీర్లు ఇచ్చిన డిజైన్‌లోని ప్రమాణాల ప్రకారం నిర్మాణం చేయడం లేదని బుధవారం విజిలెన్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో తేలింది. పెనమలూరు మండలంలో పెదపులిపాక ఘాట్‌కి మాత్రమే రూ. 38.75 లక్షలు కేటాయించారు. ఈ ఘాట్‌ను 34 మీటర్ల వెడల్పు, 17 మీటర్ల పొడవుతో నిర్మించాల్సి ఉంది. కొంతకాలంగా ఇక్కడ ఘాట్ పనులు జరుగుతున్నాయి. ఘాట్‌ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఈ రామకృష్ణ, ఏఈలు వెలుగొండయ్య, రాజేంద్రప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీరి తనిఖీలో ఘాట్ వెడల్పు 34 మీటర్లు ఉండాల్సి ఉండగా అది 33.5 మీటర్లు, కాంక్రీట్ మందం 30 సెంటీమీటర్లకు బదులుగా 28 సెంటీమీటర్లు మాత్రమే ఉంది. విజిలెన్స్ అధికారులు కొలతలు వేసి వివరాలు నమోదు చేశారు. ఘాట్ డిజైన్‌పై విస్మయం పెదపులిపాక ఘాట్ డిజైన్‌పై విజిలెన్స్ అధికారులతో పాటు, గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ మందం డిజైన్‌లో ఎక్కవ చూపారని, మందం తగ్గించి ఉంటే ఘాట్ మరింత పొడ వు, వెడల్పు పెరిగేదని చెబుతున్నారు. ఇక ఘాట్‌లో ఇప్పడు నీరు చాలా తక్కువగా ఉండడంతో ఘాట్ ఎత్తు సరిపోతుంది. ఒక వేళ పుష్కరాల నాటికి కృష్ణానదికి వరదలు వస్తే ఘాట్ పూర్తిగా నీటిలో మునిగిపోయే అవకాశం ఉంది. ఘాట్‌ను మరో రెం డు మీటర్లు ఎత్తు నిర్మించి ఉండి ఉంటేయాత్రికులకు అనువుగా ఉండేదని గ్రామస్తులు చెబుతున్నారు. మరిన్ని నిధులు అవసరం ఈ ఘాట్‌కు మరిన్ని నిధులు అవసరం ఉంది. ఘాట్‌కు వెళ్లే దారి సక్రమంగా లేదు. పాత ఘాట్ కు, కొత్త ఘాట్‌కు లింకుగా మధ్యలో యాత్రికులు నడవడానికి మెట్లు నిర్మించాలి. ఘాట్ వద్ద బ్యూటిఫికేషన్ కూడా చేయాల్సి ఉంది. వీటికి ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు. కనీసం అంచనాలు కూడా వేయలేదని సమాచారం. -
సీఎం నివాసం సక్రమమైతే.. కూలీల ఇళ్లూ సక్రమమే
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నివాసం సక్రమమైతే పుష్కర ఘాట్లలో కూలీ నాలీ చేసుకునే ప్రజలు నిర్మించుకున్న ఇళ్లు సక్రమమేనని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం పుష్కరఘాట్లలో కోర్టును ఆశ్రయించిన బాధితులను కలిసేందుకు ఆయన సీతానగరం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రే కృష్ణానది ఒడ్డున ఇంటిని నిర్మించుకున్నారు. ఆయన నివసిస్తున్న ఇంటికి తన పేరుపై పన్నులు కూడా చెల్లించడం లేదన్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నివసించే గిరిజనులు, మత్స్యకారులు 40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ సక్రమంగా నివాసం ఉంటున్నారని అన్నారు. అధికారం ఉందని ముఖ్యమంత్రి కృష్ణా ఒడ్డున నివసిస్తుంటే సంవత్సరాల తరబడి పన్నులు చెల్లించే పేదవారికి ఎంత హక్కు ఉంటుందో అధికారులు గమనించాలని ఆర్కే సూచించారు. కోర్టు స్టే విధించిన విధంగా అధికారులు మెలగకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బుర్రముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు, పట్టణ కార్యదర్శి గోరేబాబు, బీసీ నేత ఓలేటి రాము, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, యువజన నాయకులు మహేష్, కౌన్సిలర్లు లక్ష్మి, దర్శి విజయశ్రీ, పార్టీ నాయకులు కొల్లి చంద్ర, మేకా వెంకటరామిరెడ్డి, విశ్వనాధరెడ్డి, అంబటి రఘు పాల్గొన్నారు. -
ఆ పాపం భక్తులదే!
♦ ముఖ్యమంత్రి, యంత్రాంగం తప్పేమీ లేదట! ♦ పుష్కర ఘాట్ తొక్కిసలాట ఘటనపై కలెక్టర్ తాజా నివేదిక సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికార యంత్రాంగం ప్రత్యక్ష ప్రమేయాన్ని దాచిపెడుతున్నారు. ఇందులో తమ తప్పు ఏమీ లేదని, యంత్రాంగం సమర్థవంతంగా పని చేసిందని ఏకసభ్య కమిషన్‌కు ఇచ్చేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ రూపొం దించిన 15 పేజీల నివేదిక విస్మయం కలిగిస్తోంది. నాటి ఘటనకు భక్తుల తొందరపాటే కారణమని ఈ నివేదికలో స్పష్టం చేశారు. గత ఏడాది జూలై 14వ తేదీ నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించారు. ప్రారంభం రోజు ఉదయం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగి ల్చింది. నాటి ఘటనకు ప్రధానం గా సీఎంపైనే విమర్శలు వెల్లువెత్తాయి. పుష్కరఘాట్‌లో చంద్రబాబు ఎక్కువ సేపు గడపడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని నాడు నివేదిక లో స్పష్టం చేసిన కలెక్టర్.. బాబు పుష్కర స్నానానికి ఈ ఘటనతో సంబంధం లేదని తాజా నివేదికలో వెనకేసుకు రావడం గమనార్హం. తాజా నివేదికలోని కీలకాంశాలు... ఘాట్‌కు చేరుకున్న వారు గంటల తరబడి నిద్రాహారాలు లేకుండా నిరీక్షించి ఎండవేడిమి కారణంగా డీహైడ్రేషన్‌కు గురయ్యారు.ఆక్సిజన్ అందకపోవడ మూ కారణం. అధికారులు, పోలీసులు సమూహాన్ని సమర్థవంతంగా నియంత్రించినా అనుకోకుండా ఈ ఘటన జరిగింది. తొలి రోజు తప్ప మిగిలిన 11 రోజులు ఎలాంటి అపశ్రుతి చోటుచేసుకోలేదు. పుష్కరఘాట్‌లో భక్తుల ప్రవేశ ద్వారం, బయటకు వె ళ్లే మార్గాలు చాలా వెడల్పుగా ఉన్నాయి. డాక్యుమెంటరీ చిత్రీకరణకు ఏపీ టూరిజం వారు నేషనల్ జియోగ్రాఫిక్ చానల్‌కు అనుమతి ఇచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఘటన తాలూకు దృశ్యాలు రికార్డు కాలేదు. -
పుష్కరష్కర తొక్కిసలాట దుర్ఘటన దోషి చంద్రబాబే
ఏకసభ్య కమిషన్ వద్ద మాజీ ఎంపీ ఉండవల్లి అఫిడవిట్ దాఖలు రాజమహేంద్రవరం క్రైం: గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా గతేడాది జూలై 14న రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్‌కు ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. పుష్కర ఘాట్‌లో సీఎం గంటల తరబడి ఉండడంతో భక్తుల రద్దీ పెరిగిపోయిందని, తరువాత ఒక్కసారిగా భక్తులను ఘాట్‌లోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డారని, 52 మంది గాయపడ్డారన్నారు. తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలు సమర్పించడానికి తనకు సమయం ఇవ్వాలని కమిషన్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పుష్కర ఏర్పాట్లు, భక్తుల రద్దీని నియంత్రించడంలో అధికారుల నిర్లక్ష్యం వంటి అంశాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రముఖులు స్నానాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సీఎం పుష్కర ఘాట్‌లో స్నానం చేశారని, ప్రజలకు సౌకర్యాలు, రక్షణ కల్పించాల్సిన అధికార యంత్రాంగం ఆయన రక్షణలో ఉండిపోవడంతో తొక్కిసలాట జరిగిందని ఉండవల్లి వివరించారు. -
పుష్కర ఘాట్‌లో యువకుడి దుర్మరణం
ఉమ్మిడివారిపాలెం (పెరవలి) : పుష్కర స్నానం ఆచరించేందుకు వెళ్లిన యువకుడు నీటమునిగి మరణించాడు. పెరవలి మండలం ఉమ్మిడివారిపాలెం తాత్కాలిక పుష్కర ఘాట్ వద్ద అదే గ్రామానికి చెందిన యువకుడు నడపన మురళీకృష్ణ(27) పుష్కర స్నానం చేసేందుకు ఉదయం సుమారు 9.30 గంటలకు స్నేహితులతోపాటు మేనత్త కుమారుడు ఉమ్మిడి పూర్ణయ్యతో కలిసి గోదావరిలో స్నానానికి దిగాడు. మురళీకృష్ణ ఊబిలోకి దిగబడి నీట మునిగాడు. పూర్ణయ్య కాపాడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అనంతరం అతను అధికారులకు తెలపడంతో వారు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి వెతుకులాట ప్రారంభించారు. 10.40 గంటలకు మునిగిపోయిన మురళీ కృష్ణ 11.30 గంటల ప్రాంతంలో విగతజీవిగా లభ్యమయ్యాడు. పడవపై మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి తండ్రి, తల్లి, చెల్లెలు ఉన్నారు. నువ్వైనా బతుకు బావా.. నువ్వయినా బతుకు బావా అంటూ తనను నెట్టేశాడని పూర్ణయ్య విలపిస్తూ చెప్పాడు. మురళీకృష్ణ నీటమునగడం గమనించి అతడిని కొంతమేర లాక్కువచ్చానని తెలిపారు. నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో కష్టమైందన్నాడు. ప్రవాహ వేగానికి మరింత ముందుకు వెళ్లిపోతున్నాడని చెప్పాడు. తాను అలసిపోతున్నానని గమనించిన మురళీకృష్ణ నేనెలాగూ చనిపోతాను నువ్వు కూడా ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు బావా నన్ను వదిలేయమని చెప్పి ముందుకు నెట్టివేశాడని బోరున విలపించాడు. మురళీకృష్ణ పూర్తిగా మునిగిపోవడంతో తాను వెంటనే ఒడ్డుకు అధికారులను రక్షించమని వేడుకున్నానని చెప్పాడు. చావు కోసమే వచ్చావా నాన్నా... కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న అతని తండ్రి నర్సయ్య ఘటనా స్థలానికి పరుగున వచ్చాడు. చావు కోసమే బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చావా నాన్నా అంటూ కుమారుడి మృతదేహంపై పడి విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కొడుకు ఎంటెక్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బెంగళూరులోని మహీంద్రా టెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, పుష్కరాల కోసం రెండు రోజుల క్రితమే వచ్చాడని నర్సయ్య వాపోయాడు. తన కొడుకు చేతికి అందొచ్చి ఇంటి బాధ్యతలు మోస్తూ గోదావరిలో మునిగిపోయాడని విలపించాడు. ఘాట్ వద్ద రక్షణ లేదు పుష్కర ఘాట్ వద్ద పోలీస్, రెవెన్యూ యంత్రాంగం ఎవరినీ ఏర్పాటుచేయకపోవడంతో గ్రామస్తులే ఇక్కడ రేయింబవళ్లూ భక్తులకు అండగా ఉంటున్నారు. ఘాట్ అధికారిని నియమించారేకానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని పలువురు ఆరోపిస్తున్నారు. పుష్కర ఘాట్‌కు అనుమతిస్తే పోలీసులు, ఇతర అధికారులను నియమించాల్సి ఉంది. ఓ నర్సు, పారిశుధ్య సిబ్బందిని మాత్రమే నియమించారని గ్రామస్తులే తెలిపారు. గ్రామస్తులే అన్నీ తామై ఇక్కడ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. -
రాజుల సొమ్ము రాళ్లపాలు..
నిరుపయోగంగాముల్లకట్ట పుష్కరఘాట్ అధికారుల అత్యుత్సాహమే కారణం వరంగల్ :‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ లా తయూరైంది ముల్లకట్ట వద్ద నిర్మించిన పుష్కరఘాట్ పరిస్థి తి. జిల్లాలో పుష్కర ఏర్పాట్లు కోసం ప్రభుత్వం సు మారు రూ.35కోట్లు వ్యయం చేసింది. అందులో ముల్లకట్ట వద్ద 160మీటర్ల పుష్కరఘాట్ నిర్మాణానికి సుమారు రూ.5కోట్లు వెచ్చింది. తాగునీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణకు రో రూ.కోటి వ్యయం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరిలో ని నీరు ఘాట్‌కు దాదాపు 150మీటర్ల దూరం నుం చి ప్రవహిస్తోంది. పుష్కరాలు జూలై రెండోవారం లో ప్రారంభమవుతాయని, అప్పుడు ఏ స్థాయిలో నీరు ఉంటుందన్న విషయాలను నీటిపారుదల శా ఖ అధికారులు అంచనా వేయూల్సి ఉంది. గతానుభవవాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.కోట్ల ప్రజాధనం దుర్వినియోగమయ్యేదికాదంటున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణల మధ్య ముఖ్య వారధి కావడంతో అక్కడి మావోయిస్టులు వస్తారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేసినా ఇంజినీరింగ్ అధికారులు అదేమీ పట్టించుకోలేదని తెలిసింది. కేవలం కాంట్రాక్టర్ల మేలు కోరి, వారి సూచనల మేరకే బ్రిడ్జి వద్ద స్నానఘట్లాలు నిర్మించారని ఆరోపణలు వస్తున్నారుు. ముల్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు గోదావరి ప్రవహిస్తోంది. ముల్లకట్ట నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న జాతీయ రహదారికి సుమారు 300మీటర్ల దూరంలో నది ఒడ్డు వెంట ప్రవహిస్తోంది. ముల్లకట్ట బ్రిడ్జి పరిశీలనకు వచ్చిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇదే విషయంపై నీటిపారుదల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ముల్లకట్ట వద్ద బ్రిడ్జిపై రాకపోకలు నిషేధించడంతో పలువురు భక్తులు ఇదే ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు వెళ్తున్నారు. ఈ ఘాట్ వద్ద సుమారు వందకు పైగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నా...భక్తులు మాత్రం రెండంకెలు దాటకపోవడం గమనార్హం. -
దీవించమ్మా..
బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌పై నిరాసక్తత నదిలోకి వెళ్లి స్నానం చేస్తున్న భక్తులు నీటి ప్రవాహం వెంట ఏర్పాట్లకు సిద్ధమైన యంత్రాంగం పగటి వేళ 35 సెల్సియస్ డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు గోదావరి పుష్కరాల రెండో రోజు బుధవారం భక్తుల తాకిడి పెరిగింది. మంగపేట పుష్కరఘాట్ భక్త జనంతో కిటకిటలాడింది. రామన్నగూడేనికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముల్లకట్టవద్ద గోదావరి ప్రవాహం లేకపోవడంతోపాటు పోలీసులు రాకపోకలు నిషేధించడంతో పుష్కరఘాట్ వెలవెలబోయింది. బుధవారం సుమారు 26 వేల మంది భక్తులు గంగమ్మ ఒడిలో పుణ్యస్నానాలు ఆచరించారు. గోదారమ్మ .. దీవించమ్మా.. అని వేడుకున్నారు. - సాక్షి, హన్మకొండ మంగపేట : పుష్కరఘాట్ వద్ద కల్పించిన సౌకర్యాలను జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ బుధవారం పరిశీ లించారు. ఈసందర్భంగా కస్తూరీబా మహిళా మం డలి అధ్యక్షురాలు కొమరగిరి సామ్రాజ్యం, కమలాపురం కోలాట భజన మండలి సభ్యులు మంగళహా రతితో కలెక్టర్‌కు ఆహ్వానం పలికారు. గోదారమ్మకు పూజలు నిర్వహించి కలెక్టర్.. దీపాలు వెలిగించి నది వదిలారు. కాగా, ఆరూరి రమేశ్ తన కుటుంబ సభ్యులతో కలిపి పుష్కర స్నానం ఆచరించారు. ‘పుష్కర బుక్లెట్’ ఆవిష్కరణ ములుగు : గోదావరి పుష్కరాలు-2015 వరంగల్ జిల్లా సమాచార బుక్‌లెట్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఇక్కడ ఆవిష్కరించారు. వరంగల్ : పుష్కరాల సందర్భంగా అధికారులు తీసుకుంటున్న ‘అతి’జాగ్రత్తలు భక్తులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఉన్నతాధికారుల నిర్ణయాలతో పోలీ సులు తమ శైలిలో వ్యవహరించడం ఇందుకు కారణమవుతోంది. మంగపేట సమీప పుష్కరఘాట్‌కు వెళ్లాలంటే భక్తులకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వస్తున్న వారిని గంపోని గూడెం పార్కింగ్ స్థలం వద్ద నిలిపివేస్తున్నారు. అక్కడ నుంచి మినీ బస్సు ద్వారా పుష్కరఘాట్‌కు వెళ్లాలి. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన వారు మంగపేట బస్టాండ్‌లో దిగి ఉమాచంద్రశేఖర స్వామి అలయం వరకు నడిచివెళ్లి మినీ బస్సులో పుష్కరఘాట్‌కు చేరుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. గంపోనిగూడేం వద్ద నుంచి పుస్కరఘాట్ వరకు సుమారు 2.50కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పోలీసులు తీసుకుంటున్న అతి..జాగ్రత్త వల్ల గంటకు పైగా సమయం పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. చిన్నపిల్లలు ఉన్న వారి కష్టాలు చెప్పకుండా ఉన్నాయి. -
చంద్రబాబు రాజీనామా చేయాలి
వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ సాక్షి, విజయవాడ : పవిత్ర గోదావరి నదిలో పుష్కర స్నానాలు చేయడానికి వచ్చిన 27 మంది పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో చనిపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్ధసారథి డిమాండ్ చేశారు. మంగళవారం బందరు రోడ్డులోని తన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలు తొలి రోజున ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని, మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చిందే తప్ప భక్తుల సంఖ్యను అంచనా వేసి సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులు నాసిరకంగా పనులు జరిగాయని చెబితే ముఖ్యమంత్రే స్వయంగా పనులు పర్యవేక్షిస్తున్నారని మంత్రులు చెప్పారని, సీఎం నైతిక బాధ్యత వహించాలని పార్ధసారథి సూచిం చారు. ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ ఏడాది క్రితం నుంచే పుష్కర పనులను రూ.1460 కోట్లతో చేపట్టినట్లు చెప్పుకొచ్చిన చంద్రబాబు, ఇప్పుడు భక్తులు చనిపోవడానికి ఆయనే బాధ్యత వహించాలన్నారు. తహశీల్దార్‌పై దాడి ఘట నలో మహిళా తహశీల్దార్నే చంద్రబాబు తప్పుపట్టడంతో రెవెన్యూ ఉద్యోగులు కలత చెంది వారు పూర్తిస్థాయిలో పని చేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి సామినేని ఉదయభాను మాట్లాడుతూ పవిత్ర గోదావరిలో చంద్రబాబు కనీసం చెప్పులు, చొక్కా కూడా విప్పకుండా స్నానం చేశారని, బ్రాహ్మణులు వారిస్తున్నా చంద్రబాబు పట్టించుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశా రు. ప్రతి మృతుడు కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహా రం చెల్లించడమే కాకుండా సీఎం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ముఖ్యమంత్రి స్నానంతో గోదావరి అపవిత్రమైందని, అక్కడ భక్తులు స్నానాలు చేసి ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మృతుల ఫొటోలను నేతలు ప్రదర్శించారు. పార్టీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కార్పొరేటర్ బొప్పన భవకుమార్, రాష్ట్ర కార్యదర్శి మొండితోక అరుణ్‌కుమార్, వైఎస్సార్ సీపీ నేతలు తుమ్మల చంద్రశేఖర్, కిలారు శ్రీనివాసరావు, అధికారప్రతినిధి టీవీకెఎస్ శాస్త్రి, మాజీ కార్పొరేటర్ జానారెడ్డి పాల్గొన్నారు. -
పుష్కరాలకు 2,270 బస్సులు
హైదరాబాద్ నుంచి 530 25 లక్షల మందిని చేరవేయడమే లక్ష్యం టీఎస్ఆర్టీసీ జేఎండీ రమణరావు వెల్లడి హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న గోదావరి పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం 2,270 బస్సులు నడుపుతున్నట్టు టీఎస్ ఆర్టీసీ జాయింట్ ఎండీ రమణరావు తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టంలోని వివిధ పుష్కర ఘాట్లకు 25 లక్షల మంది భక్తులను చేరవేయడమే లక్ష్యంగా బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలి పారు. హైదరాబాద్ నుంచి 530, ఆదిలాబాద్- 310, నిజామాబాద్- 300, కరీంనగర్ -415, వరంగల్- 355, ఖమ్మం నుంచి 360 బస్సులు పుష్కర ఘాట్లకు భక్తులను చేరవేస్తాయని వివరించారు. హైదరాబాద్ నుంచి అన్ని పుష్కరఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు ప్రధాన ఘాట్లు అయిన బాసర, భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరంలకు అవసరాన్ని బట్టి ప్రత్యేక బస్సులు పెంచే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పుష్కరఘాట్ల వద్ద ఏర్పాటుచేసిన తాత్కాలిక బస్స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు రమణరావు వివరించారు. తాగునీరు, మరుగుదొడ్లు, క్యాంటీన్లు, సమాచార కేంద్రాలు, విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యం, క్లాక్ రూం సౌకర్యంతో పాటు బస్స్టేషన్ల వద్ద 150 మంది అంతర్గత సిబ్బందిని కూడా నియమిస్తున్నట్టు తెలిపారు. భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు.