పుష్కర మృతులకు అఖిలపక్ష నేతల నివాళి
Published Thu, Jul 14 2016 11:15 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
రాజమండ్రి: గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మృతి చెందారు. నాటి దుర్ఘటన జరిగి గురువారానికి ఏడాది అయింది. ఈ సందర్భంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు రాజమండ్రి, గోకవరం బస్టాండ్ నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ తీయనున్నారు. అనంతరం మృతులకు నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దుర్ఘటన జరిగి ఏడాది అయినా ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అ ప్రజాస్వామికమన్నారు.
Advertisement
Advertisement