వరంగల్ లీగల్: లోక్ అదాలత్‌లలో పరిష్కారమైన కేసుల్లో చెల్లించిన జరిమానా డబ్బులను రికార్డుల్లో పేర్కొనకుండా, కోర్టులో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వరంగల్ ఎక్సైజ్ కోర్టు జడ్జి ఎ.ఆర్.విలాసితను సస్పెండ్ చేస్తూ గురువారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గత ఏడాది డిసెంబర్ 12న, ఈ సంవత్సరం ఫిబ్రవరి 13న, మార్చి 12న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్సైజ్ కోర్టు పరిధిలో రాజీకి అవకాశం ఉన్న 55 కేసులు పరిష్కారమయ్యాయి.
వీటిలో జరిమానా రూపంలో చెల్లించిన డబ్బులు కోర్టులో డిపాజిట్ చేయకుండా, రికార్డుల్లో సైతం పేర్కొనలేదు. తప్పుడు చలానాలు, స్టాంపులు సృష్టించి ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిన ఆరోపణలపై సస్పెండ్ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరవ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి రఘునాథ్‌రెడ్డిని ఎక్సైజ్ కోర్టుకు ఇన్‌చార్జి జడ్జిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు.
ఎక్సైజ్ కోర్టు జడ్జిపై సస్పెన్షన్ వేటు
Published Thu, Apr 21 2016 10:21 PM | Last Updated on Mon, Apr 8 2019 8:33 PM
Advertisement