మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : ఎక్సైజ్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసులు సంయుక్తంగా మిర్యాలగూడ మండలంలో గురువారం విస్తృతంగా దాడులు నిర్వహించి నాటుసారాను ధ్వంసం చేశారు. మిర్యాలగూడ మండలం రాజీవ్‌నగర్ కాలనీ, జాన్‌బావితాండా, గెడ్డగూడుతాండా తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 28 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 40 లీటర్ల నాటుసారా, 10 కేజీల పటిక బెల్లంను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే మిర్యాలగూడ టూటౌన్ పరిధిలో 6వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఏడుకొండలు, ఎస్‌ఐ సంజీవరెడ్డి, రూరల్ ఎస్‌ఐ సర్దార్ నాయక్, మిర్యాలగూడ టూటౌన్ సీఐ పాండురంగారెడ్డి, ఎస్‌ఐ శీనయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మిర్యాలగూడలో విస్తృతంగా ఎక్సైజ్ దాడులు
Published Thu, Jul 2 2015 1:41 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement