సంప్రదాయ ఆటలు ఆడుతున్న చిన్నారులు ఆట వస్తువులు
జూబ్లీహిల్స్: వామనగుంటలు, పచ్చీస్, అష్టాచెమ్మా, దాడి, పాము, నిచ్చెన కైలాసం, గచ్చకాయలు ఈ పేర్లు వింటే పెద్దలందరికీ తమ చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. వీటి గురించి ఈ తరం పిల్లలకు కొంచెం కూడా తెలియదు. అందుకే పురాతన సంప్రదాయ ఆటలను చిన్నారులకు తెలియజెప్పడానికి, వాటికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్న గుడ్ ఓల్డ్ గేమ్స్ సంస్థ ‘ హెరిటేజ్ గేమ్స్ ఆఫ్ ఇండియా ’ పేరుతో విభిన్నమన సాంప్రదాయ ఆటలను నగరంలో పరిచయం చేసింది.
బంజారాహిల్స్ సప్తపర్ణిలో శుక్రవారం ఎగ్జిబిషన్ ప్రారంభించింది. కనుమరుగవుతున్న 101 సాంప్రదాయ ఆటలను వెలిగితీసి ఆటకు సంబంధించిన పరికరాలను తయారు చేయించి ప్రదర్శిస్తున్నామని నిర్వాహకులు సునీతా రాజేష్, అర్చన తెలిపారు. జెయింట్ పచ్చీస్, త్రీ ఇన్ వన్ పచ్చీస్ సహా పలు ఆట పరికరాలను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఆయా ప్రాంతాల కళాకారులతో తయారు చేయించామని వారు తెలిపారు. ఆధునిక సాంకేతిక సమాచార ప్రపంచంలో కొట్టుకుపోతున్న నేటి తరానికి భారతీయ సాంప్రదాయ ఆటపరికరాలను పరిచయం చేసే లక్ష్యంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. 250 రూపాయల నుండి 60వేల రూపాయల వరకు ఆట పరికరాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment